add

Thursday 20 June 2019

సాహో టీజర్ ఇలా ఉందేంటి?

సాహో  ... భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్నది. రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో తెచ్చుకున్న ఇంటర్నేషనల్ క్రేజ్ తో , నిర్మాతలు భారీ పెట్టుబడి పెట్టి నిర్మిస్తున్న సాహో .. సినిమా ఎలా ఉండాలి? బాహుబలి కి రాజమౌళి పనితనం,మార్కెటింగ్ విధానం ప్రధాన బలాలు,ప్రభాస్ కాకుండా వేరే హీరో ఉన్నా బాహుబలి సూపర్ హిట్ అయ్యి తీరుతుంది ఎందుకంటే ... అక్కడ ఉన్నది రాజమౌళి . కానీ .. సాహో  సినిమాకి , ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ దర్శకుడు. ఈ సారి మాత్రం , ప్రభాస్ తన స్టార్ పవర్ ఏంటో నిరూపించుకోవాలి. ..ప్రభాస్ ఒక్కడే సాహో   సినిమాని భుజాల మీద మొయ్యాలి.  హీరో స్టార్ పవర్ ఓపెనింగ్స్ తెస్తుంది  కానీ ...సినిమాని నిలబెట్టేది దర్శకుడి పనితీరే.



ఈ మధ్య రిలీజ్ అయ్యిన టీజర్ , సాహో  మీద అంచనాలను తగ్గించే విధంగా ఉంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ ,సినిమా కి వాడిన కలర్ కరెక్షన్ ఏమంత గొప్పగా లేవు . ముఖ్యంగా ప్రభాస్ మీద ట్రక్ పడే షాట్ లో.. గ్రాఫిక్స్ ని యిట్టె కని  పెట్టెయ్యొచ్చు . ఇక ప్రభాస్ ఒక చోట సన్నగా ...ఒక చోట బొద్దుగా .. ఒక చోట ఫిట్గా ఉన్నాడు, శ్రద్ధాకపూర్ ప్రభాస్ దగ్గర పిట్టలా ఉంది. ప్రభాస్ డైలాగ్ చెప్పే తీరు ఇంకా ... ఈశ్వర్ సినిమా లో లానే ఉంది. టీజర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది, గిబ్రాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ... బాలీవుడ్ ఐ రన్ లెగ్ లు , శ్రద్ధాకపూర్, చుంకి పండేయ్,జాకీష్రాఫ్, లు నటించగా .... సినిమా భవిష్యత్తు ఏమిటో .. దేవుడే కాపాడాలి.
madmax ,మిషన్ ఇంపొసిబల్  సినిమాల కాపీ షాట్స్ ఈ టీజర్ లో కనపడి .. సినిమా మీద అంచనాలు తగ్గించాయి.

ఇక్కడ ట్రైలర్ చుడండి.

https://www.youtube.com/watch?v=rDoFiOjoC2Y

1 comment:

ADD