add

Friday, 14 January 2022

బంగార్రాజు - సినిమా రివ్యూ - వసివాడి , తుస్సుమన్న బంగార్రాజు .


హాయ్ ఫ్రెండ్స్ ...  యువసామ్రాట్ నాగార్జున హీరోగా చాలా సంవత్సరాల క్రితం వచ్చిన , రొమాంటిక్ ఫాంటసీ మూవీ .. సోగ్గాడే చిన్నినాయనా . దానికి సీక్వెల్ గా , బంగార్రాజు సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఓమిక్రాన్ ప్రభావమో.. లేదా పబ్లిసిటీ  సరిగ్గా చెయ్యకపోవడం వల్లనో .. బంగార్రాజు సినిమాకి సరైన ఓపెనింగ్స్ రాలేదని .. బుక్ మై షో  ఆప్ చూసి, మనం ఇట్టే  చెప్పెయ్యవచ్చు. బంగార్రాజు సినిమా లో నాగార్జున , నాగ చైతన్య ఇద్దరు కలిసి నటించిన సినిమా అవ్వడం, హిట్ సినిమా కి సీక్వెల్ అవ్వడం .. ఈ రెండు కారణాలు ..  సినిమా ప్రేక్షకులను , కొంతమందినైనా థియేటర్లకు రప్పించాయి. ఇక ఈ సంక్రాంతికి  మరే పెద్ద సినిమా లేకపోవడం ఒక ప్లస్ ఈ బంగార్రాజుకి . మరి ఈ బంగార్రాజు మెప్పించాడా ? లేదా ?  రివ్యూ లో చదవండి . 

కథ : బంగార్రాజు పుట్టగానే తల్లి చనిపోతుంది , నాన్న..నాయనమ్మ కి ఇచ్చేసి, అమెరికా వెళ్ళిపోతాడు. బంగార్రాజు ( నాగ చైతన్య ) చిన్నప్పటి నుండే నాగ లక్ష్మి ( కృతి శెట్టి ) తో గొడవలు పడుతూ పెరుగుతాడు . నాయనమ్మ ( రమ్య కృష్ణ ) దగ్గరే పెరిగిన బంగార్రాజు .. ఊరంతా చిలిపి చేష్టలు చేస్తూ తిరుగుతుంటాడు . అది తెలిసిన నాయనమ్మ చనిపోయి , స్వర్గం లో ఉన్న పెద్ద బంగార్రాజు (నాగార్జున ) దగ్గరకెళ్ళి , మనవడి పెళ్లి చేయడానికి  పెద్ద బంగార్రాజుని కిందకి పంపిస్తుంది . పెద్ద బంగార్రాజు కిందకొచ్చి, మనవడి ప్రాణానికి ప్రమాదం ఉందని తెలుసుకుంటాడు . మనవడి పెళ్లి ఎలా చేసాడు ? ఎలా.. మనవడి ప్రాణాలు కాపాడుకున్నాడు, అనేది కథ . 

నటీనటులు : నాగార్జున ఈ సినిమా కి ప్రాణం , అయన స్టైల్,ఊపు ,వాచకం పెద్ద ప్లస్.. బంగార్రాజు క్యారెక్టర్ కి. నాగార్జున స్క్రీన్ మీద ఉన్నంత సేపు.. మనం తెరకి అతుక్కుపోతాం. ఇక రమ్య కృష్ణ చిన్న పాత్ర పోషించింది . కానీ.. ఉన్న కొద్దీ సేపు .. ఆకట్టుకుంది. చిన్న బంగార్రాజుగా.. నాగ చైతన్య  ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ . నాగ చైతన్య  వాచకం , యాస , ఆహార్యం ఏవి కూడా , నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు అస్సలు మ్యాచ్ కాలేదు. నాగ చైతన్య  ని పెద్ద రొమాంటిక్ స్టార్ ని చేద్దామనుకున్నారు , దానికోసం చాలా మంది అమ్మాయిలతో సీన్స్ సృష్టించారు .. అవేవి నాగ చైతన్య ఇమేజ్ కి కానీ...సినిమాకి కానీ .. ఉపయోగపడవు.  కృతి శెట్టి పర్వాలేదనిపిస్తుంది , కానీ దర్శకుడు ఆమెతో ఓవర్ యా క్షన్ చేయించాడు అనిపిస్తుంది . రావు రమేష్,సంపత్ విలన్స్ గా పర్వాలేదనిపిస్తారు. బ్రహ్మాజీ , వెన్నెల కిశోర్ అనవసరం అనిపిస్తారు . నాగబాబు, రవిప్రకాష్ ఉన్నంతలో ఓకే . 

సాంకేతికవర్గం : దర్శకుడు కల్యాణ కృష్ణ కథ సరిగ్గా రాసుకోలేదు , సీన్స్ కూడా సరిగ్గా రాసుకోలేదు. కనీసం పాత్రల తీరు కూడా సరిగ్గా రాసుకోలేకపోయాడు . ఉదాహరణకి ... 

1. రాము ( నాగార్జున) తన భార్య సీతని పని ఒత్తిడి మూలంగా దూరం పెడతాడు . అందుకే అతని పెళ్లి, విడాకుల వరకు వెళ్తుంది..  సోగ్గాడే చిన్నినాయనలో . అదే తప్పు మళ్ళి  బంగార్రాజు లో చేస్తాడు . ఈసారి కొడుకుని దూరం పెడతాడు. పాత్రలో పరిపక్వత లోపించింది . 

2. చిన్న బంగార్రాజు చిన్నప్పటి నుండి తండ్రి కోసం ఏడుస్తూ..  ఉత్తరాలు రాసి, స్కూల్ బాక్స్ లో పెట్టుకుని ఏడుస్తాడు. మరి తల్లి గుర్తులేదా ? 

3. చిన్న పల్లెటూరిలో .. హీరో చుట్టూ తిరిగే ఫ్రెండు , రాత్రి కూడా కాదు , పట్టపగలే ..  ఊరి పక్కనే..  ఇనప లంగర్లు వేసుకుని, మర్డర్లు చేస్తుంటే .. కనీసం ఫ్రెండ్స్ కి తెలియదా?. మళ్ళి .. హీరో చావుకోసం పూజలు చేస్తూ ... ఫ్రెండ్ నే పువ్వులు తీసుకురమ్మనడం ఎందుకు ? వాడ్ని చంపడం ఎందుకు ? 

4. తాత  ఆత్మ  మనవడి లో ప్రవేశించినపుడు .. మనవడిలో ఎ మార్పులు రావు . సోగ్గాడే .. లో రెండు ప్రధాన పాత్రలు .. నాగార్జునే చెయ్యడం ప్లస్ , ఇక్కడ నాగ చైతన్య చెయ్యడం మైనస్. నాగ చైతన్య  ఇన్ని సినిమాలు చేసినా ..  నటన లో పెద్ద మార్పులేం రాలేదు. 

కెమెరా పర్వా లేదు , గ్రాఫిక్స్ సరిగ్గా కుదరలేదు . పాము అకస్మాత్తుగా లేవడం .. లాంటివి  టైమింగ్ కుదరలేదు  గ్రాఫిక్స్ లో . మ్యూజిక్ లో ఒక్క పాట  కూడా బాగోలేదు. నేపధ్య సంగీతం  పర్వాలేదు.   పాటలు ..అకస్మాత్తుగా అనవసరంగా వస్తాయి . ఇబ్బంది పెడతాయి . పాటల్లో .. పల్లవి,ఒక చరణం ఉండటం..  ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్ .లడ్డుందా ..  లడ్డుందా .. పాట  వస్తున్నపుడు , రాడ్ ఉందా .. రాడ్ ఉందా... అని అనిపిస్తుంది . కామెడీ లేకపోవడం కూడా .. పెద్ద మైనస్ . సోగ్గాడే .. లో బ్రహ్మానందం కామెడీ ప్రధాన ఆకర్షణ .

హీరోనే  పెద్ద మైనస్ ఈ సినిమాకి .. ! 

వసివాడి, తుస్సుమన్న  బంగార్రాజు . 

రేటింగ్ : 1 / 5 


3 comments:

ADD