add

Wednesday 31 December 2014

shankar - vikram AI(manoharudu ) movie leaked story

విక్రమ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఐ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు తన సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులకు ఆస్కారం ఇవ్వని విక్రమ్‌ ఇప్పుడు ఐసినిమాకు సంబంధించిన కథ లీకవ్వటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఐ సినిమా విజువల్‌ వండర్‌ గా ఉండబోతుందని ఇప్పటికే సెన్సార్‌ తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కథ విషయంలోకి వెళ్తే….
కండలవీరుడు, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్ స్వ్కార్జ్‌ నెగ్గర్‌ ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండలవీరుడు కావాలన్నది లింగేశన్ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నేరవేరుతుందనుకున్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. దాన్ని నుంచి ఎలా బయటపడతాడు. కలను ఎలా సాకారం చేసుకుంటాడన్నదే ఐ సినిమా కథాంశమట.
విక్రమ్‌ ఈసినిమాలో ఓ విలేజ్‌ కుర్రాడిగా కనిపిస్తాడట. దాదాపు 16 సంవత్సరాల తర్వాత హీరోయిన్‌ అమీ జాక్సన్‌ తన గ్రామం ( విక్రమ్‌ ఊరు ) కు వస్తుందట. చిన్నప్పటి నుంచి వీళ్లంతా స్నేహితులు. ఆ బాల్య స్నేహం మళ్లీ వీళ్లను కలుపుతుందట. ఈ సినిమాలో హీరోయిన్‌ మోడల్‌ . ఆమె మోడలింగ్‌ ఫోటోలను చూసి ఆకర్షితుడైన హీరో ఆమెకు దగ్గరవ్వాలంటే తాను ఓ మోడల్‌ ను కావాలనుకుంటాడట.
ఈ లోగా అమీ ఓ కార్పోరేట్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారడం, ఒలింపిక్స్‌ బీజింగ్‌ కు ప్రమోషన్‌ మోడల్‌‌ గా అవకాశం రావడం జరుగుతాయట. తన అవకాశాలను లాంగేసుకుంటున్న అమీపై విలన్‌ అయిన ఉపేన్‌ కక్ష పెంచుకుంటాడట. ఆప్రయత్నంలో అందవిహీనుడిగా మారిన విలన్‌ తిరిగి తన అందాన్ని సంపాదించుకోవటానికి తండ్రి సాయం తీసుకుంటాడట. విలన్‌ తండ్రికి ఓ ఫార్మాసిటికల్‌ కంపెనీ ఉంటుందట. అందులో తయారైన డ్రగ్‌‌ ను పరిక్షీంచాలంటే ఎవరో ఒకరు కావాలి. అందుకే విక్రమ్‌ ని ఎంచుకుంటాడట. మోడల్ అవ్వాలనుకున్న విక్రమ్‌ ని రప్పించి ఆ కెమికల్‌ ను అతనిపై ప్రయోగించటంతో అతను అందంగా తయారవటమేకాకుండా టాప్‌ మోడల్‌ అవుతాడట. ఇంకేముంది మోడల్‌ అయిన విక్రమ్‌ తో అమీ ప్రేమలో పడటం దాన్ని చెబుదామనుకుంటున్న టైంలో మరో ట్విస్ట్‌ వస్తుందట.
విక్రమ్‌ కు ఎక్కించిన ఈ మెడిసన్‌ సైడ్‌ ఎఫెక్ట్‌ ఇచ్చి నెమ్మదినెమ్మదిగా కురూపిగా మారుస్తుందట. అంద వికారంగా తయారవుతాడట. ఇక ఇంటర్వెల్‌ తర్వాత కురూపిగా ఉన్న విక్రమ్‌ జంతువగా మారిపోతాడట. ఈ విషయం ముందుగా తెలిసే విలన్‌ తనకు ఈ మెడిసిన్‌ ఎక్కించాడని విక్రమ్‌ ఆలస్యంగా తెలసుకుంటాడు. అంతేకాదు త్వరలోనే ప్రియురాలు అమీ జాక్సన్‌ కు ఎక్కించబోతున్నాడని విషయం తెలుసుకున్న విక్రమ్‌ జంతువుగా మారి విలన్‌ పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఈ లోగా అమీ ఓ కోటీశ్వరుడిని ఎంగేజ్‌ మెంట్‌ చేసుకుంటుంది. వేరే దారి లేని పరిస్థితుల్లో హీరోయిన్‌ ను కిడ్నాప్‌ చేసి తన పూర్వరూపం తెచ్చుకోవటానికి విక్రమ్‌ చేసే ప్రయత్నాలు, అమీని టార్గెట్‌ చేసుకొని విలన్‌ ఎత్తుగడలు ఇలా ట్విస్ట్‌ లతో కథ రసవత్తరంగా సాగుతుందట. చివరకు విక్రమ్‌ ఎలా గెలుస్తాడన్నది ఈ సినిమా కథని కోలీవుడ్‌ లో కథనాలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment

ADD