బాహుబలి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ,దానికి తగినట్లే ట్రైలర్ సూపర్ గ ఉండటం తో ఇంకా అంచనాలు ఆకాశానికి అంటాయి . సినిమా కోసం రెండు సంవత్సరాలు నిరీక్షించిన ప్రేక్షకులకు ఈ బాహుబలి ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో చూద్దాం .
కథ : మొదటి భాగం ఆగిపోయిన చోటే మొదలవుతుంది ,అమరేంద్ర బాహుబలి పట్టాభిషేకానికి ముందు కుంతలా దేశం రాణి దేవసేన తో ప్రేమాయణం ,పెళ్లి, రాజ్యాన్ని కోల్పోయి ప్రజల్లో ఒక్కడిగా సామాన్య జీవితం గడపటం ,వంచనకు గురవ్వడం ,మరణించడం. మహేంద్ర బాహుబలి భల్లాలదేవ మీద యుద్ధం ప్రకటించడం . భల్లాల మరణం .
నటీనటులు : ప్రభాస్ చాలా అందంగా కనిపించిన సినిమా ,కాస్ట్యూమ్స్,జ్యువలరీ,కత్తులు, అన్ని అతనికోసమే పుట్టాయా అనిపించేలా ఉన్నాయి, కొన్ని సీన్స్ లో సాహో అనిపిస్తాడు. కానీ ఎప్పటిలాగే డైలాగ్ డెలివరీ చాలా పూర్ .కొన్ని చోట్ల అతని వాయిస్ లో స్పష్టత లేదు . యుద్ధ సన్నివేశాలు బాగా చేసాడు,అనుష్క చాలా రోజుల తరవాత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది ,ఆ పాత్రకు ఇంకా చాలా ఇంటెన్సిటీ అవసరమైన ఉన్నంతలో బాగానే చేసింది , విచిత్రం ఏంటంటే కొన్ని సన్నివేశాల్లో ఆమెకు అదనంగా పెరిగిన వోళ్ళే హుందా తనం తెచ్చింది. సుబ్బా రాజు కి కొంత మంచి పాత్ర లభించింది . రమ్యకృష్ణ,సత్యరాజ్,నాజర్,రాణా పాత్రలు మొదటిభాగం లో బాగా హుందాగా ఉండి రగులుతూ ఉంటాయి,ఈ సినిమా లో ఆ పాత్రలు వాటి ప్రవర్తన విచక్షణ రహితంగావుండి రొటీన్ గ కనిపిస్తాయి రాజమాత కాస్త పిచ్చ మాత గా అనిపిస్తుంది . తమన్నా కరివేపాకు పాత్రలో చేసింది ఎం లేదు.
సాంకేతిక వర్గం : రాజమౌళి ప్రయత్నం అభినందించాల్సింది,విజయేంద్రప్రసాద్ కథ పాత చింతకాయ పచ్చడి, అశోక్ కే బ్యాంకర్ దసరాజన్ నవల లో ఆనకట్ట కూల్చే సన్నివేశం వాడేసుకున్నారు . రాజమాత,కట్టప్ప పాత్రలు పేలవమైన పాత్రలుగా మిగిలిపోయాయి . అందరినీ కంట్రోల్ చేసే రాజమాత ని కొడుకు,భర్త కంట్రోల్ చెయ్యడం,కట్టప్ప ఆలోచనలేకుండా పెంచిన బాహుబలిని ఆలోచనారహితంగా చంపేయడం,అసలు మరీ నాటకీయంగా కట్టప్పని కాలకేయ తమ్ముడి లాంటి వాడు వచ్చి కట్టేయడం సొల్లులా అనిపిస్తుంది. కట్టప్ప బాహుబలిని చంపినపుడు సినిమా నీరసంగా మారి సాగిపోయే తాటి చెట్లతో గోలి ఆట ఆడు కునే చివరి యుద్ధ సన్నివేశం తో నీరసంగా ముగుస్తుంది.ఉన్న తెలుగు సినిమాల్లో గ్రాండియర్ అవ్వొచ్చు గాని సంజయ్ లీల భన్సాలీ సినిమాలతో పోల్చితే ఒక లెక్క కి రాదు,గ్రాఫిక్స్ లో కొన్ని చాలా బాగా వచ్చాయి (కుంతలా కి వెళ్లే మార్గం,హంసనావ సాంగ్,)కొన్ని చాలా చెత్తగా చీప్ గ్రాఫిక్స్ ల ఉన్నాయి ( కట్టప్ప తిరుగుబాటు అనగానే వచ్చే గుర్రాలు పరుగెత్తే సీన్ ,చాలా చోట్ల కీయింగ్ షాట్స్ ).సెంథిల్ కెమెరా క్లోజ్ షాట్స్ అద్భుతంగ చూపించారు ,సోలమన్,కెచ్చ,లీ విట్టేకేర్ ఆక్షన్ సీన్స్ మరీ అతి ల అనిపిస్థాయి. కుంతలా దేశం లో కొన్ని సన్నివేశాలు తీసేయాలి ,సినిమా ఒక్కసారి చూడొచ్చు .
రాజమాత ని బుర్రతక్కువ దానిగా చూపడం మైనస్.
కట్టప్ప బాహుబలిని చంపే సీన్ అంత గొప్పగా లేదు ,బుర్ర తక్కువ పనిలా ఉంది .
కట్టప్ప రాజమాత ని చంపినా భల్లాలదేవ దగ్గర నోరు ముసుకు పనిచేయడం,రాజమాతని కాపాడే పనిలో మధ్యలోనే సైడ్ అయ్యిపోవడం ,రాజమాత రాజుగా ప్రకటించిన మహేంద్ర బాహుబలిని కాపాడకుండా ,రానాతో ఉండటం?చివరిలో నాజర్ తో శివగామి మహేంద్రని రాజు అని ప్రకటించిందని చెప్పడం అస్సలు లాజిక్ లేదు ,మహేంద్ర చిన్న నాదే రాజు అయిపోయాడు మరి మహేంద్ర కోసం బతకాలి ?భల్ల తో ఎందుకు తిరుగుతున్నాడు బుర్ర తక్కువ కట్టప్ప .
కట్టప్పని కట్టేసింది ఎవరు ? కాలకేయ గెటప్ తో వచ్చినవాళ్లు ఎవరు?
బాహుబలిని చంపి శివగామి చేతికి రక్తం రాయడం,పేరు పెట్టి పిలవడం కట్టప్ప కి ఓవర్ బిల్డ్ అప్ లా ఉంది .అదే సీన్ లో దేవసేన భర్త చావు గురించి తెలిసి కూడా పెద్దగా రియాక్ట్ అవ్వక పోవడం మైనస్ .
కీరవాణి సంగీతం లో సాహోరే పాట తప్ప మిగిలినవి బాగోలేదు ,పాటలు అన్ని మధ్య ఆగి మళ్ళి మొదలవడం అస్సలు బాగోలేదు,సైడ్ లో వచ్చే పాట లు చిరాకుగా ఉంటాయి,బాహుబలిని చంపే సీన్ లో బంగారు కలల్ని అంటూ వచ్చే పాట లో సాహిత్యం మరీ వెటకారం . చంపేయమని చెప్పి మళ్లి లాలి పాటలు శివగామికి .
సూపర్ సీన్స్;
బాహుబలి ఎంట్రన్స్.
కట్టప్ప బాహుబలి ఆయుధం లు విసురుకునే సీన్స్.
దేవసేన శివగామిని ఎదిరించే సీన్స్
దేవసేన దండనాయక వేళ్ళు కోసే సీన్
బాహుబలి దండనాయక తలా నరికే సీన్ .
బాహుబలి తన భుజాలమీద దేవసేన ని నడిపించుకునె సీన్ .
రాజమౌళి ఎమోషన్స్ బాగున్నాయి (కొన్ని చోట్ల),ప్రభాస్ కొన్ని చోట్ల హావభావాలు ఇవ్వలేక పోయాడు .
రివ్యూ బై
ఫణి (7386748001)
చూసిన సినిమా హాల్ ;
వేంకటాద్రి (దిల్సుఖ్నగర్)మాటినీ) సెకండ్ హాఫ్ లో హాలులో సౌండ్ పని చేయక గొడవ జరిగి ప్రొజెక్టర్ లెన్స్ పగలగొట్టారు ప్రేక్షకులు ,పోలిసులు వచ్చి కొంతమందిని తీసుకుపోయారు .
రామకృష్ణ (నైట్ షో - అబిడ్స్) వైజాగ్ జగదాంబ ల ఉంది థియేటర్ . సూపర్ పిక్చర్ అండ్ సౌండ్ క్లారిటీ

No comments:
Post a Comment