****
కథ : తన కూతురికి జరిగిన అన్యాయానికి కడుపు రగిలి పగ తీర్చుకున్నసవతి తల్లి కథ . నిజంగా ప్రేమించే తల్లి ,తన సవతి కూతురు ప్రేమను ఎలా గెల్చుకుందో తెరమీదే చూడాలి.
నటీనటులు : శ్రీదేవి తొలి సన్నివేశంలో తన వయసును దాచుకోలేకపోయింది , సినిమా జరిగేకొద్దీ ఆమె మేకప్ లో మార్పులు మనకి అలవాటవుతాయి , కళ్ళతోనే చాలా భావాలు పలికించి మరోసారి శ్రీదేవి ఐస్ గ్రేట్ అనిపించుకుంది . సజల్ అలీ రేప్ కి గురయిన అమ్మాయిగా చాలా బాగా నటించింది ,ఆమె పాత్ర ని చూసి ఎవరైనా జాలి పడాల్సిందే ,
ఆద్నాన్సిద్దిక్యూ శ్రీదేవి భర్తగ మంచి నటన కనపరిచాడు,కూతురి బాధ చూసి చలించిపోయి తండ్రిగా , కూతురి కోసం ఏదైనా చేసే తండ్రిగా మెప్పించాడు,నవాజుద్దీన్ సిద్దిక్యూ అమోఘమైన నటన ,పాత్రలో జీవించాడు,మనకున్న సహజ నటులలో నవాజుద్దీన్ ఒకరు,కామెడీ తో పాటు బాధ్యతాయుతమైన సపోర్టింగ్ రోల్ లో నవాజుద్దీన్ జీవించాడు ,అక్షయ్ ఖన్నా కొత్తగా ఏమిచేయలేకపోయిన పాత్ర కి హుందాతనాన్ని ఇచ్చాడు ,అభిమన్యుసింగ్ ,విల్లన్స్ అందరు తమ పాత్ర పరిధిల్లో నటించారు .
సాంకేతికవర్గం : రవియుడైవర్ పాతకథ ఎంచుకున్న పకడ్బందీ స్క్రీన్ ప్లే తో సినిమాని ఆసక్తికరంగా మలిచాడు,కెమెరా లైటింగ్ మూడ్ సినిమాలోకి ప్రేక్షకులను లీనమయ్యేలా చేస్తుంది , రెహమాన్ పాటలు సినిమాలో చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు, ముఖ్యంగా అతని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ , రేప్ జరుగుతున్నపుడు వెనుక వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గుండెల్నిపట్టి లాగేస్తున్నట్లుంటుంది , ఎడిటింగ్ చాలా బాగుంది ,క్లైమాక్స్ రొటీన్ అయినా శ్రీదేవి నటనతో కట్టిపడేసింది,ఇటువంటి సినిమాను నిర్మించినందుకు బోనీ కపూర్ని అభినందించాలి.
అందరు తప్పక చూడాల్సిన చిత్రం
చూసిన ధియేటర్ :70ి/-శివ (ఆసియన్) దిల్సుఖ్నగర్ - హైదరాబాద్
ధియేటర్ బాగుంది
No comments:
Post a Comment