తెలుగు సినిమా హీరోల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అసలు తెలుగు సినిమా ఎటువైపు వెళ్తుంది?ప్రస్తుత తెలుగు సినిమా అగ్ర హీరోలు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు?అసలు వీళ్ళు కథలు వింటున్నారా లేదా ? అనే సందేహాలు ప్రతి సినీ ప్రేక్షకుడ్ని వేధిస్తున్నాయి. కొంతమంది హీరోలు రాసి ఎక్కువ వాసి తక్కువ సినిమాలు చేస్తుంటే , మిగిలిన వాళ్ళు రాసి,వాసి రెండి తిలోనూ తక్కువే . మన తెలుగు సినిమా అగ్ర హీరోలను పరిశీలిస్తే ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు . వెంటనే మరో అద్భుతం వస్తుంది అని ప్రేక్షకులు , కాలర్ ఎత్తుకు తిరిగేద్దామని ఫ్యాన్స్ సంబరపడి పోదామనుకుంటే . . సర్దార్ లాంటి భారీ కళాఖండం వచ్చింది,విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ తానే సొంతగా కథ ఇచ్చాడు,అది భారీ ప్లాప్ అయ్యి బాలీవుడ్ విమర్శకులతో కార్టూన్ మూవీ అనిపించుకుంది. అసలు పవన్ అత్తారింటికి దారేది విజయం నుండి ఎం నేర్చుకున్నాడు?పోనిలే పవర్ లేని పవర్ సినిమా డైరెక్టర్ బాబీ ఎఫెక్ట్ అనుకుంటే తరువాత పవన్ తీసిన కళాకండం కాటమరాయుడు బస్సు మంది , డాలీ ఐరన్ లెగ్ ఎఫెక్ట్ అనుకుంటే,ఇక తెలుగు సినిమా ని నష్టాల్లో ముంచేసే భీభత్సం త్రివిక్రమ్ లాంటి రచయిత తో కలిసి ఇచ్చాడు పవర్ స్టార్ అదే అగ్న్యాయతవాసి . రెండు ప్లాపులు తరువాత భారీ ప్లాప్ ఎలా ఇచ్చాడు పవన్ , అసలు కథ వింటాడా,త్రివిక్రమ్ ఫోన్ చేసి రెండు నిమిషాల లైన్ చెప్తే ఓకే చేసి ఎంత మంది కొంపలు కూల్చేశాడు పవర్ స్టార్ .పవన్ వరస హిట్ లు ఇచ్చి అందరి మనసులు గెలవడానికి కారణం అతను ఎంచుకున్న కథాంశాలే,సామాన్య కుటుంబంలో యువత పడే పాట్లు ,యువత ఎదురుకుంటున్న ఇబ్బందులు కథలుగా తీసుకుని సుస్వాగతం,తొలిప్రేమ,తమ్ముడు,ఖుషి వంటి నాన్ స్టాప్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు సినిమాల్లో ... నేను అన్ని సినిమాల్లో ఇలాగె ఉంటాను
నాలా గే ఉంటాను అని పూర్తిగా నటించడమే ఇష్టం లేదన్నట్లు నటించడం , ప్రతి సినిమాలో అక్కడక్కడా ఉండే గే చేష్టలు ,అగ్న్యాయవాసి నిండా ఉండటం ఇబ్బంది కరంగా మారింది ,
పవన్ మరో సారి సరి కొత్త కథలతో ముందుకు రావాలి ,పాలిటిక్స్ వదిలేసి కచ్చితంగా తిరిగివచ్చి వయసుకు తగ్గ పాత్రలు చెయ్యాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రయోగాలు మొదటి నుండి చేస్తున్నాడు , వన్,నిజం,నాని,ఒక్కడు,
బాబీ,బిజినెస్మాన్ వంటి ప్రయోగాలు చేసాడు , కానీ ఆ ప్రయోగాలు పరిశీలిస్తే అవి సహజత్వానికి దూరంగా ఉండటం పెద్ద సమస్య,అందుకే కొన్ని ఘోరంగా విఫలమయ్యాయి , భయపడి కమర్షియల్ సినిమా వైపు వెళ్లి డైరెక్టర్ల వలలో పడ్డాడు ,శ్రీమంతుడు హిట్ అయిన వెంటనే సీతమ్మ వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డా లని నమ్మి అడ్డంగా బుక్ అయిపోయాడు ,బ్రహ్మోత్సవం వంటి టీవీ సీరియల్ అందించాడు, ఒక హిట్ ఇస్తే అన్ని సినిమాలు హిట్ చేస్తారా డైరెక్టర్లు కథ వినడా? ఆ తరువాత తెలుగు సినిమా భారీ నష్టాల సినిమా స్పైడర్ తీసి
బోర్ల పడ్డాడు , గ్రాఫిక్స్ వలన లేట్ అవుతుందని చెప్పి ,చెత్త గ్రాఫిక్స్ తో స్పైడర్ ని వదిలాడు,
మళ్ళి డైరెక్టర్నే నమ్ముకుని భారత్ అనే నేను తో వస్తున్నాడు, ఒక్క పూరీజగన్నాధ్ మినహా , ఏ డైరెక్టర్ కూడా మహేష్ బాబు తో రెండవ సినిమా తీసి సక్సెస్ కొట్టలేదు. కొరటాల శివ కూడా అన్ని సినిమాలు నొవెల్స్,హిందీ సినిమాలు చూసి కాపీ కొట్టే రకం ,బాబు ఈ సరి ఎం చేస్తాడో?
బాహుబలి విజయం తో ముందున్న ప్రభాస్ ,విజయం మొత్తం రాజమౌళి కొట్టేయడం తో తన తరువాత సినిమా సాహూ తో నిరూపించుకోవాలి. నటన ,వాచకం లో వెనుక బడి ఉన్న ప్రభాస్
ఇంకా మెరుగుదిద్దుకోవాలి ,రాజమౌళి సినిమా తరువాత వరస ప్లాపులు ఖచ్చితం అని ప్రతి హీరోకి తెలుసు ,ఛత్రపతి తరువాత ప్రభాస్ వరుస పరాజయాలతో బాధపడ్డాడు కూడా,ప్రభాస్ ఈ సారి ఎలా తప్పించుకుంటాడో చూడాలి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రొటీన్ రోతపుట్టించే సినిమా లు మానేసి నాన్నకు ప్రేమతో నుండి ప్రయోగాలు చెయ్యడం మొదలెట్టాడు, నాన్నకు ప్రేమతో లో సుకుమార్ సైకాలాజీ జనాల్ని ఇబ్బంది పెడితే,జనతా గ్యా రేజ్ సర్కార్ సినిమా కి కాపీ ల అనిపించింది, ఇక బాబీ దర్శకత్వం లో వచ్చిన జై లవ కుశ లో అద్భుతమైన నటన చూపించినా సినిమా లో ముగ్గురు ఎన్టీఆర్ లు తప్ప ,కథ ,కథనాలు అందరి మెప్పు పొందలేదు , డబ్బులు వచ్చినా పేరు మాత్రం అంతగా తెచ్చుకోలేదు జై లవ కుశ లు ,రాబోయే త్రివిక్రమ్ సినిమా ఎలా ఉండబోతుందో ?దేవుడికే ఎరుక .
ఇక రాంచరణ్ ఇప్పుడే రంగస్థలం వైపు అడుగులేసి మారుతుండగా , రవితేజ మాత్రం గుడ్డిగా డబ్బుకోసం కక్కుర్తిపడి సినిమాలు చేస్తున్నాడని టచ్ చేసి చూడు చూస్తే తెలిసిపోతుంది,రాజా ది గ్రేట్ తో అలరించి, మళ్ళి తన పాత పంథా లోనే డబ్బుకోసం సినిమాలు చేస్తూ పోతున్నాడు.
సినిమా కథ బాగుంటే హీరో ముసలివాడయినా సరే బంపర్ హిట్ అవుతుందని శంకరాభరణం,భారతీయుడు,నరసింహ,దంగల్ సినిమాలు నిరూపించినా మన హీరోలు ఎం నేర్చుకుంటున్నట్లు ? ఆమిర్ ఖాన్ తన దంగల్ సినిమా ని పూర్తి చేసాక 3 నెలల పాటు తనకు తెలిసిన వాళ్లకు చూపించి వాళ్ళ సలహాలు తీసుకుని ,ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని రిలీజ్ చేసి హిట్ కొట్టాడు ఆ శ్రద్ధ తెలుగు హీరోలకు ఎందుకు లేదు ?ప్రపంచవ్యాప్తంగా , ఒక్క బాహుబలి తప్ప విశ్వవ్యాప్తంగా భారీ వసూళ్లు,ఆదరణ పొందిన తెలుగు సినిమా లేదేం?
ఒక్కో సినిమా రెండు మూడు ఏళ్ళు తీసి,ప్లాప్ అయ్యాక కనపడకుండా పోవడం ఎందుకు?
బ్రహ్మోత్సవం సినిమా ఫస్ట్ కాపీ రిలీజ్ కి రెండు రోజుల ముందు వచ్చిందని , ఎంమార్పులు చేస్తాం అని నిర్మాత వాపోయాడంటే మన వాళ్లు ఎంత బాధ్యతారహితంగా సినిమాలు తీస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు,సినిమా ద్వారా లాస్ అయిన వాళ్లకు డబ్బులు తిరిగి ఇచ్చేసినా , ప్లాప్ సినీమా తీశామని పేరు ఉండిపోతుందిగా , వంద కథలు విన్న తరువాత నూట ఒకటవ కథ అద్భుతంగ అనిపించిందట ఎన్టీఆర్ కి ,ఆ సినిమా చూసి మాట్ని ఆటకే జనాలు థియేటర్లు ఖాళి చేయగా ,నిర్మాత మూసి లో దూకాడు.
తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని (తమిళ హీరో ధనుష్ ) ,మినిమం బడ్జెట్ లో ,ఫారెన్ లొకేషన్స్ ఆశించకుండా(ఆరెంజ్) లోకల్ కథలతో సినిమాలు తీసి (నాని) ఎక్కువ లాభాలు కొన్న వాళ్లకు తెస్తే సినిమా పరిశ్రమ బాగుంటుందిగా ?ఆలోచించండి అగ్రహీరోలు . విజయం తలకెక్కకుండా, అపజయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయండి,తీసిన నిర్మాత చుసిన ప్రేక్షకుడి ఆనందం మీ చేతుల్లో ఉంది.
ఫణి (8639823007)
No comments:
Post a Comment