ప్రముఖ నటుడు భానుచందర్ ఇటీవల ఒక వెబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ , బాహుబలి సినిమా మంచి సినిమా కాదు కేవలం పాపులర్ సినిమా మాత్రమే అని తేల్చేశారు , ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ యాంకర్ .. ' బాహుబలి సినిమా ని ప్రపంచమంతా పొగిడింది అని చెప్పగా ... భానుచందర్ "ఏ దేశం పొగిడింది అమెరికానా?చైనా ?రష్యా? అని ప్రశ్నించాడు. యాంకర్ మొహం మాడిపోయింది .
బాహుబలి ఒక సాధారణ వాటర్ బాటిల్ కాప్ లాంటిదని , దానిని రాజమౌళి టీం తెలివిగా మార్కెటింగ్ చేసిందని ,రాజమౌళి ప్రతిభ మార్కెటింగ్లో ఉందని చెప్పేసాడు , అంతేకాకుండా భానుచందర్ యాంకర్ ని " దంగల్ ,బాహుబలి లో ఏది మంచి సినిమా ? " అని అడగగా యాంకర్ ఠక్కున దంగల్ అని సమాధానమిచ్చింది.
భానుచందర్ మాదిరిగానే దాసీ లాంటి క్లాసిక్ ఆర్ట్ ఫిలిం తీసిన బి . నరసింగ రావు బాహుబలి హాలీవుడ్ రేంజ్ సినిమా కాదు , విసువల్ గా బాగుంటుంది కానీ , గొప్ప సినిమా కాదు అని తేల్చేశారు.బాహుబలి వాపే కానీ బలుపు కాదు అని వ్యంగ్యంగా చెప్పారు. టెక్నికల్ గ బాగుంది కానీ హాలీవుడ్ కు సరితూగే సినిమా కాదు , 1970 లో వచ్చిన బెన్ హర్ సినిమా లో ఒక గుర్రపు పందెం సీన్ కోసం 110 కెమెరాలు వాడారు , దానితో పోల్చితే ఇప్పుడు రాజమౌళి తీసినది ఎం గొప్ప కాదు అని తేల్చేశారు.
నిజమే డబ్బు ఎంత వసూలు చేసిన దంగల్ లో మనసుకు హత్తుకునే సన్నివేశాల ముందు , విసువల్ ఎఫెక్ట్స్ బాహుబలి తేలిపోయాడన్నది వాస్తవం. ప్రభాస్ నటన ఏమంత గొప్పగా ఉండదు, అమిర్ ఖాన్ నటన కన్నీళ్లు తెప్పిస్తుంది , . దేశం కోసం పోరాడే మల్ల యోధుల యుద్ధం (దంగల్) ముందు , సాగ దీసిన వెన్నుపోటు నాటకం బాహుబలి ఏమంత బాగుంటుంది !
No comments:
Post a Comment