add

Thursday, 8 February 2018

నీరజ్ పండే - అయ్యారీ - బయటపడని ఓ స్కాం ఆధారంగా తెరకెక్కుతుంది

నీరజ్  పండే  దర్శకత్వం లో ,సి ద్దార్థ్ మల్హోత్రా,రకుల్ ప్రీత్ , మనోజ్ బాజపాయ్ నటిస్తున్న అయ్యారీ  సినిమా  ముంబయి లో జరిగిన ఒక స్కాం ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం.

మిలిటరీ లో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుల భార్యలకు, ప్రభుత్వం ముంబైలో తక్కువ ధరకు ఇల్లు ఇవ్వదలిచింది , ఆదర్శ్ సొసైటీ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో చాలా  అవినీతి జరిగింది . ప్రముఖ పొలిటిషన్స్ , మిలిటరీ ఆఫీసర్స్, వ్యాపారవేత్తలు ఈ  కుంభకోణంలో భాగస్వాములు , ముంబైలో కోలోబా లో 31 అంతస్థులతో నిర్మించిన ఆదర్శ్ సొసైటీ బిల్డింగ్ లో
22 ప్లాట్స్ బినామీ పేరుతో కొట్టేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చావహాన్ ,విలాసరావు దేశముఖ్ ప్రయత్నించారు ,



కాగ్ , సిబిఐ ఎంక్వయిరీ తరువాత ,ఎన్నో అరెస్టులు జరిగాయి ,ఇప్పటికి పూర్తి కానీ ఈ కేసు ని ఆధారంగా చేసుకుని నీరాజపండే .. ఆదర్శ్ సొసైటీ ని ఆశ్రయ సోసియేటీగా మార్చి అయ్యారే సినిమా తీస్తున్నాడు. మిలిటరీ నుండి నో అబీజెక్షన్ సర్టిఫికెట్ పొందిన తరువాత ఈ సినిమా విడుదలకు సిద్దమయ్యింది , ఫిబ్రవరి 16న విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని వివాదాలు సృష్టిస్తుందో వేచి చూడాలి

2 comments:

ADD