add

Saturday, 22 June 2019

ఓటర్ 2019 తెలుగు సినిమా రివ్యూ RATING - 1/5

మంచు విష్ణు 'ఆచారి అమెరికా యాత్ర ' తరువాత ... ఎన్నో వివాదాలు,గొడవలు మధ్య రిలీజ్ చేసిన కొత్త సినిమా "ఓటర్".కార్తీక్ రెడ్డి దర్శకత్వం లో తయారయిన .. ఓటర్ సినిమా మీద జనాల్లో , ఎటువంటి అంచనాలు లేవు. మంచు విష్ణు కి ఢీ  సినిమా ద్వారా వచ్చిన పేరు .. ఇంకా కొంత ఉంది కనుకే ఒక పది మంది అయినా సినిమా కి వచ్చారు. ఇక ఈ సినిమా ఎలా ఉందొ చుద్దాం.. 

కథ - గవర్నమెంటు ప్రజలకు ఉచితం గా ఇల్లు కట్టి ఇవ్వడానికి ఎవరైనా స్థలం ఇవ్వాలని కోరుతుంది. ఒక వ్యాపారవేత్త తన 10 ఎకరా స్థలం జూబిలీ హిల్స్లో .. ఇస్తాడు. మినిస్టర్ ఆ వ్యాపారవేత్త ని , అతని కుటుంబాన్ని చంపి 
షాపింగ్ మాల్ కడతాం అనుకుంటాడు , అప్పుడు మన హీరో అమెరికా నుండి వచ్చి ఆ మినిస్టర్ ఆగడాలకు ఎలా బ్రేక్ వేశాడో .. సినిమాలో చూడాలి. 


నటీనటులు - విష్ణు నటన రొటీన్ , హీరోయిన్ సురభి కొంత స్కిన్ షో చేసి అలరించింది. సంపత్ విలనీ , పోసాని కామెడీ పరమ రొటీన్. 
సాంకేతికవర్గం - డైరెక్టర్ రాసిన కథ,చేసిన కథనం పరమ రొటీన్. ఒక్క సీన్ తప్ప ఎందులోనూ .. అసెంబ్లీ రౌడీ కి ఈ ఓటర్ కి సంబంధం లేదు. ఫైట్స్, పాటలు ఉన్నాయంతే .. గుర్తుపెట్టుకోలేం . ఆర్ట్ ,కెమెరా రొటీన్. డైలాగ్స్ ఒక్కటి కూడా ఆలోచన రేకెత్తించేలా లేదు. 

టైం వేస్ట్ చేసుకోడానికి ఈ ఓటర్ చూడండి. ఈ ఓటర్ అయిదు వేళ్ళు కలిపి తల మీద పిడిగుద్దులు కొడతాడు. ఓటర్  తెలుగు సినిమా  రివ్యూ  

No comments:

Post a Comment

ADD