add

Saturday 22 June 2019

మల్లేశం తెలుగు సినిమా రివ్యూ MALLESAM MOVIE REVIEW 2019 RATING - 2.5 / 5



బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తుంది, మహానటి సినిమా తో టాలీవుడ్లో కూడా బయోపిక్ లు మొదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ తీసి బాలయ్య చేతులుకాల్చుకున్నాక .. టాలీవుడ్ లో బయోపిక్ ఊపుతగ్గింది. పద్మశ్రీ  అవార్డు గ్రహీత మల్లేశం జీవితం ఆధారంగా ..తీసిన సినిమా  " మల్లేశం ". మల్లేశం గా కమెడియన్ ప్రియదర్శి నటించగా , అనన్య అతని భార్యగా నటించింది. ప్రముఖ యాంకర్ ఝాన్సీ మల్లేశం తల్లి పాత్రలో నటించింది. ఈ సజీవ చిత్రం ఎలా ఉందొ చూద్దాం. 

కథ - తెలంగాణ లో .. పేద చేనేత కార్మికులకు పుట్టినవాడు మల్లేశం. చదువుకుందామనుకున్నా .. డబ్బులు లేక తండ్రికి సహాయంగా ఉంటూ చేనేతపని చేసుకుంటుంటారు మల్లేశం, మరదలు ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒక రోజు తల్లి నేత పని చేసుకుంటూ భుజాల నొప్పికి గురవుతుంది. డాక్టర్ పని మానక పోతే చేతులు పడిపోతాయంటాడు. మల్లేశం అప్పుడే తల్లి కోసం చేనేత పని చేసే మెషిన్ కనిపెట్టడం మొదలు పెడతాడు. చెక్క మెషిన్ పని చెయ్యక ..ఊర్లో అందరి తో తిట్లు తింటాడు. భార్య నగలు తాకట్టు పెట్టి ,హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుకుని ,ఎలక్ట్రికల్ పని చేసుకుంటూ .. ఇనుము తో మెషిన్ చేస్తాడు. ఇదే కథ. 

నటీనటులు - ప్రియదర్శి మల్లేశంగా చక్కగా నటించాడు, తన కామెడీ ఫేస్  దాచుకుంటూ కొన్ని చోట్ల మంచి నటన ప్రదరించాడు. అనన్య , ప్రియదర్శి స్నేహితులు, తండ్రి, ఝాన్సీ పాత్రలకు జీవం పోశారు. తాగుబోతు రమేష్, రెండు సన్నివేశాల్లో కనపడి నవ్వించాడు. 
సాంకేతికవర్గం- కెమెరా , ఆర్ట్ సినిమా బడ్జెట్ ని తెలియజేశాయి. మార్క్ రాబిన్ పాటలు,బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో  
చెప్పుకోతగ్గ అంశం . డైలాగ్స్ కూడా సహజం గా ఉండి  ఆకట్టుకుంటాయి. సినిమా లో ప్రధాన లోపం . .. రాజ్ కథనం. దర్శకుడు సినిమాలో ఎక్కడ కూడా మనసుకు హత్తుకునేలా, ఉత్సుకత కలిగించేలా సినిమా లో సీన్స్ రాసుకోలేకపోయాడు. ఉదాహరణకు .. చివరిలో మెషిన్ పని చేయడం చూపించడానికి అందర్నీ పిలుస్తాడు మల్లేశం,కానీ అది పని చెయ్యదు. అప్పుడు వేరే మోటార్ తెచ్చి పని చేయిస్తాడు. ఈ సీన్  చాలా మామూలుగా తీసాడు. టెన్షన్ పుట్టించేలా తీయాల్సిన సీన్ ఇలా తీసిన డైరెక్టర్ , చాల సీన్స్ అలాగే తీసాడు. ఫీల్ లేక పోయిన సీన్స్ ఎన్ని ఎన్ని  ఉన్నా  మనసుకు హత్తుకోకపోతే సినిమా కి జనం తరలిరారు. దీని వలన సినిమా చాల నెమ్మదిగా.. పెద్దది  అనిపిస్తుంది.

మెల్లిగా సాగిన ఈ మల్లేశం ఒకసారి చూడొచ్చు. చూసాక మీకు .. అక్షయ్ కుమార్ "padman " గుర్తురావొచ్చు.  

No comments:

Post a Comment

ADD