add

Sunday 30 June 2019

CAPTAIN RANA PRATAP 2019 TELUGU MOVIE REVIEW RATING 0.5 / 5

జీవితం లో మంచి - చెడు ఉన్నట్లే .. సినిమాల్లో కూడా మంచి - చెత్త సినిమాలుంటాయి . హీరో కి డబ్బు ఉంది, నాటకాలు మీద మోజు ఉంది , అమెరికా లో డాక్టర్ గా సంపాదించింది ఎం చేసుకోవాలో తెలియలేదు, ఉన్న నాటక అనుభవం తో ఒక సినిమా లో తండ్రి పాత్ర చేసారు , తరువాత ఇక డైరెక్ట్ హీరో ... అలెక్స్ అనే భయంకరమైన హిందీ రీమేక్ సినిమా , ఇక తరువాత ... chapter 6,పరమానందయ్య శిష్యుల గ్యాంగ్ , రాజేంద్ర, చంద్రహాస్ , టిక్ టాక్ లాంటి తెలుగు భయంకర చిత్రాలు జనాలమీదకు వదిలాడు. జనాలు మేము చూడలేం అని తిప్పి కొట్టినా ... ఏజ్ అయ్యిపోయిన  ఈ హీరోగారు .. ఈ సారి కెప్టెన్ అవతారం లో జనులమీద దండెత్తారు. హైదరాబాద్ లో తొలి  రోజు ఉన్న 6 థియేటర్లు , రెండవరోజుకు 4 అయ్యాయి , అందులో ఒక్కొక్క షో మాత్రమే వేస్తుండగా ... ఒకే ఒక థియేటర్ కి ముందుగానే వారం అద్దె చెల్లించినందున సుదర్శన్ 35mm  లో మూడవరోజు కూడా ఈ సినిమా వేస్తున్నారు. 

ఒకప్పుడు తెలుగు సినిమా లో జోకర్ హీరోలలో యాదాకృష్ణ  అంటే నాకు ఎంతో అభిమానం , బాడీ సహకరించకపోయినా,బిల్డుప్ ఇస్తూ .. ఇద్దరు హీరోయిన్స్  తో సరసాలాడుతూ.. ఇచ్చే బిల్డుప్ ,చూపే హీరోయిజం  కామెడీగా  ఉండటం తో యాదాకృష్ణ ఇప్పటికి నాకు ఫేవరేటే .. అటువంటి మరో హీరో కళాఖండం - హరినాథ్ పొలిచెర్ల .



కథ - హరినాథ్ కథ చెప్పుకోవడానికేం ఉండదు ... ఒక మిషన్ లో పట్టుబడిన రానా ప్రతాప్ పాకిస్థాన్ ఖైదీ అవుతాడు. అక్కడనుండి తప్పించుకుని హైదరాబాద్ లో టెర్రర్స్ ఆపడానికి ప్రయత్నిస్తాడు. 

నటీనటులు -  మీరు హరినాథ్ ఫాన్స్ అయితే చదవకండి .... కెప్టెన్ గా హరినాథ్ ని చూడగానే ... పోకిరి లో , ఆ ఏజ్ ఏంటి? కింద గేజ్ ఏంటి .? అనే డైలాగ్ గుర్తొస్తుంది. నటిస్తున్నప్పుడు మూతి ఎలా పెట్టాలో కూడా సరిగ్గా తెలియదు. 
కనుబొమ్మలు పూర్తిగా ఊడిపోయాయి ... చూడటానికీ భయం వేసేలా ఉన్నాడు . గూబలు తన్నేసి , జారిపోయిన దవడలు తో ఉన్న హీరో ని చూసి ... సింహం , అందగాడు నా మొగుడు అని హీరోయిన్స్  అంటుంటే , నాకు నవ్వు ఆగలేదు. హీరో హెయిర్ స్టైల్ అయితే అంటించిన గమ్ము తో సహా కనపడటం హాస్యాస్పదం. హీరోయిన్స్ లో జ్యోతి రెడ్డి  ఎక్స్ట్రా టాప్ ఓవర్ ఆక్షన్ చేసింది, వీర మాత , వీర భార్య గా ఆమె అక్కడక్కడా ఓవర్ అయ్యింది. ఇంకొక  హీరోయిన్ అయితే ఎక్సపోసింగ్ బాగా చేసింది .. కానీ మనకే చూడబుద్ది కాదు. స్విమ్మింగ్ పూల్ లో ఒక రకమైన 
రొమాన్స్ చేస్తుంటారు హీరో - హీరోయిన్ ( భంగిమ) ఆ ఫోజ్ చూడలేం . సుమన్,షాయాజీ,పునీత్ ఇస్సార్ బకరా పాత్రలు .. హీరో బిల్డుప్ కోసం వాడుకున్నారు. 

సాంకేతికవర్గం -  నేపధ్య సంగీతం కొంతలో పరవాలేదు. మిగిలినవన్నీ నాసి రకం . దర్శకత్వం గురించి మాట్లాడుకుందాం. తొ లి సీన్ లో .. ఖాళి చేతులతో వచ్చిన రౌడీలను చూసి మెయిన్ విలన్ .. ఎక్కడ , తీసుకొచ్చారా వాడ్ని అని అడుగుతుంటాడు  .. ఖాలీ చేతులు చూసి కూడానా..  ..హీరో కదలకుండా ఒక దగ్గరే నిల్చుని చెక్క బొమ్మలా ... విల్లన్స్ ని కాల్చేస్తుంటాడు. 
భార్య చనిపోయిందని బాధ లేకుండా ..శ వాన్నీ వదిలేసి  .. పాకిస్థాన్ నుండి ఇండియన్ బోర్డర్ కి 127 కిలో మీటర్లు పరుగెత్తుకుని వస్తాడు. దారిలో పాక్ ఆర్మీ ఎదురైతే ... పాములను మీద పడేసి వస్తాడు. బాంబు లను మెటల్స్ తో తయారు చేస్తారు , ఈ సినిమాలో చెక్క తో తయారు చేసారు. బాంబు స్పెషలిస్ట్ .. ఓవర్ బిల్డుప్ ఇస్తూ వచ్చి ... ఒక వైరు ముక్క తీసుకుని ఇక్కడ  పెట్టాలా..? అక్కడ పెట్టాలా ... ? అని సందేహపడుతుంటాడు  (అణు  బాంబులు ఆర్పేసాడని   బిల్డప్). 

ఉదయం నుండి రాత్రి వరకు bianaclors తో చార్మినార్ ని చూస్తుంటాడు  హీరో ... అక్కడ ఎం కనపడుతుందో మరి. 
చార్మినార్ లో  డాన్ గా  అవతారం ఎత్తుతాడు  . బార్ లో డాన్సర్  తో సరసాలు .. (పెళ్ళాం చనిపోయిందని బాధ ఎక్కడా ఉండదు). డాన్స్ లు చూస్తే నవ్వు ఆపుకోలెం, డాన్స్ వేస్తూ మన హరినాథ్ పొలిచెర్ల మూతి తిప్పుతుంటాడు అబ్బా నవ్వే నవ్వు. పాకిస్థాన్  లో  పోర్ట్ లో కి వెళ్లిన హీరో ని చూస్తే .. వీడు అసలు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాడా ? అనే సందేహం వస్తుంది. ఎందుకంటే .. ఎదురుగ పాక్ ఆర్మీ ఉంటె .. అక్కడ రిసీవర్  తీసుకుని సర్ .. నేను పోర్ట్ కొచ్చాను , ఇక్కడ దొంగలున్నారు , మాట్లాడుకుంటున్నారు అని ... మాట్లాడుతుంటాడు. 

ఈ సినిమాలో మరో స్పెషల్ ఏంటంటే .. టార్చర్ .. అవును పాక్ రానా ప్రతాప్ ని టార్చర్ పెట్టె సీన్ అయితే మనం నవ్వు ఆపుకోలెం. ఒక్క సీన్ లో కంటిన్యూటీ  ఉండదు .. చర్మం వలిచేసిన సీన్...  తరువాత సీన్ లో .. చర్మం మామూలుగా ఉంటది. పోర్ట్ లో పరుగెత్తేటపుడు ... పాక్ నుండి ఇండియా పరుగెత్తేటపుడు ... డూప్ ని డైరెక్ట్ గా  చూపించేసాడు. 
పాక్ నుండి పరుగెత్తే టైం లో .. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట  వస్తున్నపుడు .. మన హీరో విన్యాసాలు ,హీరో వాళ్ళ ఆవిడ కాళీ నృత్యం అబ్బా .. ఎప్పుడు అవుతుందిరా బాబు ... ఎడిటర్ ఉన్నడా .. నిద్రపోయాడా ? అనిపిస్తుంది.


ఇక క్లైమాక్స్ లో హీరో ..  ఇక్కడ 100-200 తీవ్రవాదులు ఉన్నారు మాకు ఫోర్స్ హెల్ప్  కావాలంటాడు. తీరా చూస్తే 25 మంది కూడా ఉండరు. హీరో బాడీ లో ఒక డజను బుల్లెట్స్ పోయినా  కూడా .. హాస్పిటల్ లో బ్రతుకుతాడు. స్టాలిన్ లో  చిరు కోసం స్పీచ్ ఇచ్చినట్లు .. హీరో కోసం సుమన్ క్లైమాక్స్ లో ఇచ్చే భారీ స్పీచ్ చూసి .. ఎడిటర్ ఎక్కడ ? అనిపిస్తుంది. 


మీ ఖర్మ కాలి ఈ సినిమాకెళ్లారో ... అయిపోతారంతే ! నేను హరినాథ్ గురించి తెలిసే వెళ్ళాను .. 
సినిమా  చుసిన  థియేటర్ - సుదర్శన్ 35 ( మాములు థియేటర్)
రేట్ - 80/-

1 comment:

ADD