add

Saturday, 20 July 2019

AAME / AADAI MOVIE REVIEW IN TELUGU 3.5 / 5

అమల పాల్ ..  ప్రయోగాత్మకంగా  నటించిన చిత్రం - ఆమె . రత్నకుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అయ్యింది.  డబ్బింగ్ చిత్రం ఐన - ఆమె సినిమా ట్రైలర్ లో .. అమల నగ్నంగా నటించి జనాల్ని ఆకర్షించింది . తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే. 

కథ- సత్య వాణి  అనే  టీవీ యాంకర్ , తన బృందం తో కలిసి , ప్రాంక్ షోస్ చేస్తుంటుంది. టోపీ టోపీ అనే కార్యక్రమం లో .. అందరి ప్రజల్ని ఫూల్స్ చేస్తుంటుంది. ఒక రోజు బట్టలు అన్ని విప్పేసి న్యూస్ చదువు తానని పందెం కడుతుంది. ఒక పార్టీ అయినా తరువాత ఉదయం , ఖాళి చేసిన టీవీ బిల్డింగ్ లో నగ్నంగా స్పృహ లేకుండా పడి  ఉంటుంది. ఎందుకో ... సినిమా చూసి తెలుసుకోవాలి. 

నటీనటులు- అమల పాల్ అద్భుతంగ నటించింది, మగరాయుడులా, సిగ్గుతో బాధపడే అమ్మాయిలా , తెగువతో పోరాడే స్త్రీ లా .. అద్భుతంగా నటించింది. అమల వలన బాధపడే అమ్మాయిగా వేరే నటి, అమల తల్లి, అమల స్నేహితులు చక్కగా నటించారు. 


సాంకేతికవర్గం-రత్నకుమార్ కథ , కథనం కొత్తగా ఉంది.  ప్రేక్షకుడు ఎక్కడ కూడా తల తిప్పుకోకుండా సినిమాని ఆసక్తికరంగా మలిచాడు.  అమల పాల్ సగం సినిమా మొత్తం నగ్నంగా ఉన్నా కెమరామెన్  చక్కగా చిత్రీకరించాడు. ఎడిటింగ్ , బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. పాటలు ఉన్న రెండూ ఆకట్టుకోవు. ఆర్ట్, డైలాగ్స్, చాలా బాగున్నాయి. 

తప్పకుండా చూడండి. 

No comments:

Post a Comment

ADD