add

Thursday, 18 July 2019

పనికిరాని రెండు చిప్పుల కథ - బోరింగ్ శంకర్. ismart shankar - telugu movie review in telugu RATING 2 / 5

పూరి జగన్నాధ్ .. తెలుగు సినిమా  దర్శకుల్లో హైయెస్ట్ హిట్ వేల్యూ ఉన్న దర్శకుడు. కొత్త రకం కథలు,చక్కని పాటలు,అలరించే కామెడీ తో అతని సినిమాలు నిండి ఉంటాయి. హీరో ని కొత్తగా చూపించే ఏకైక దర్శకుడు పూరి. కానీ తన కొడుకుని , తమ్ముడ్ని హీరోని చేసే ప్రయత్నం లో తన లో ని బలాలన్నీ మర్చిపోయి , వి సముద్ర లాంటి దర్శకుని రేంజ్ కి పడిపోయాడు పూరి. పోకిరి లాంటి సినిమా తీసిని పూరీనే నా .. పైసా వసూల్ అనే భయంకరమైన ప్లాప్ తీసింది అని డౌట్ వస్తుంది. రామ్ ని ఊర మాస్ గా చూపించాలని తాపత్రయ పడుతూ ఛార్మి తో కలిసి తానె నిర్మించి , దర్శకత్వం  వహించిన ఈ ఇ - స్మార్ట్ శంకర్ ఎలా ఉన్నదో చూద్దాం. 

కథ - శంకర్ అనే లోకల్ రౌడీ , సుపారీ తీసుకుని హత్యచేస్తాడు. అనుకోకుండా ఆ హత్య కేసు ని సాల్వ్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అజయ్ జ్ఞాపకాలు శంకర్ లోకి పంపిస్తారు సిబిఐ . ఇక అక్కడి నుండి సీఎం ని చంపింది ఎవరు? శంకర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అతని ప్రేమకథ ఏంటో .. చూడాలంటే  ధైర్యముండాలి. 

నటీనటులు- రామ్ హైపర్ ఆక్టివ్ , ఈ మధ్యనే  నమ్రతగా ఉండే పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ .. క్లాస్ కి దగ్గరయ్యాడు. హీరో కి క్లాస్ ప్రేక్షకులు మాత్రమే  ఫాన్స్ అయితే సరిపోదుగా.. అందుకని ఊర మాస్ కోసం ఈ సినిమాలో రామ్ చాల కష్టపడ్డాడు. కథ లేని సినిమాలో .. చొక్కా విప్పేసుకుని .. హీరోయిన్ ని ఒత్తేసుకుని.. తెలంగాణ యాసలో  అరిచేస్తే  .. మాస్ కి దగ్గరైపోము . హీరోయిన్స్  లో నాభ నటేష్ .. అబ్బా ..మరీ ఓవర్ డైలాగ్స్ ,అందులో తెలంగాణ స్లాంగ్ లో ఓవర్ చేసింది. అక్కడక్కడా అందాలు ఆరబోసింది.నిధి అగర్వాల్ పనికి రాని పాత్రలో చక్కగా చేసింది. గెట్ అప్ శీను ,షాయాజీషిండే,సత్యదేవ్ రొటీన్ గా నటించారు. 
సాంకేతికవర్గం - పూరి జగన్నాధ్ కథ ఏమి లేకుండా సినిమా తీసాడు, చిప్ పెట్టి మెమరీ కాపీ చెయ్యడం .. వివేక్ ఒబెరాయ్ - ప్రిన్స్ సినిమా లో చూసాం. ఇందులో ఏమి అంత కొత్తగా ఉండదు. పూరి సినిమాల్లో మాటలు అదిరిపోయాయి. ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోడానికి ఒక్క డైలాగ్ కూడా లేదు. పూరి సినిమాల్లో కామెడీ అదిరిపోతాది. ఇందులో నో కామెడీ. కథే లేదాయె ... స్క్రీన్ప్లే ఎక్కడఉంటది? పూరి తీసిన రోగ్ సినిమా చాలా బెటర్ దీనికంటే. 
మణిశర్మ మ్యూజిక్ ఇప్పటి కి బాగా పాత టమాటో పచ్చడి ల ఉన్నది. మేరె రష్ కె కమర్ ... సాంగ్ ని...  ఉండిపో అనే పాటలో వాడేసుకున్నారు.  టైటిల్ సాంగ్ మాత్రమే కొంత బాగుంది. కెమెరా .. ఎడిటింగ్ ఓకే. ఆర్ట్ చాలా బాగుంది. డాన్స్ గురించి చెప్పుకోవాలంటే ..ఢీ ,ఛాలెంజ్ లో ఇలాంటి డాన్సులు చూసేసాం. ఫైట్స్ మాత్రం చాల బాగా చేసారు. 

తొలిభాగం లో ... హీరోయిన్ హీరో మధ్య తెలంగాణ బూతుల లవ్ స్టోరీ... ఇంటర్వెల్ లో చిప్ల మార్పిడి, రెండో సగం లో 
సీఎం ని చంపిన వాడ్ని వెతకడం ... తలనొప్పి . 

ఈ సినిమా చూసాక - మార్ పూరి.. చోడ్ ఛార్మి అనాలనిపిస్తుంది. 

పనికిరాని రెండు చిప్పుల కథ - బోరింగ్ శంకర్. 

1 comment:

  1. Ni Reviews Annii Super Unnayi Bro Baga rasavu.

    మార్ పూరి.. చోడ్ ఛార్మి అనాలనిపిస్తుంది.

    But Ni blog not working properly oka manchi website chesukoni promotions start chey content baguntundi
    i am a web developer if u have any help meassage me.

    ReplyDelete

ADD