add

Thursday 4 July 2019

స్పైడర్ మాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ / spiderman far from home review in telugu RATING 3.5 / 5

స్పైడర్ మాన్  ఫార్ ఫ్రమ్ హోమ్ .. ఈ రోజు ఇండియా లో విడుదలయ్యింది , ట్రైలర్ తోనే అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా .. ఎలా ఉందొ చూద్దాం. 

కథ - స్పైడర్ మాన్ తన స్నేహతులతో  టూర్ కి వెళతాడు, అక్కడ తనకి ఒక దుష్ట శక్తీ ని ఎదురుకునే క్రమం లో .. మిస్టీరియో  మాన్  పరిచయం అవుతాడు, టోనీ స్టార్ క్ ఇచ్చిన కళ్ళజోడు .. స్పైడర్ మాన్  .. మిస్టీరియో మాన్ కి ఇస్తాడు.  మిస్టీరియో మాన్  ఆ కళ్ళజోడు తో టోనీ సామ్రాజ్యానికి అధిపతి అయ్యి , ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడదామనుకుంటాడు . కానీ స్పైడర్ మాన్  కనిపెట్టి అతని అంతు ఎలా చూసాడో ..తెర మీద చూడాలి !


నటీనటులు -   స్పైడర్ మాన్  గా టామ్ హాలండ్ చక్కగా సరిపోయాడు, ఎమోషన్స్ ఎక్కువ చూపించే స్కోప్ లేదు కానీ .. ఎప్పటిలాగే నటించాడు. హీరోయిన్ జెండాయా ,మన సాయి పల్లవి లాగా కనిపిస్తూ .. రొమాంటిక్ లుక్స్ తో పడేస్తుంది. హీరో ఫ్రెండ్ జాకబ్  లవ్ స్టోరీ క్యూటీగా ఉంది .. కామెడీ పండించింది. ,విల్లన్ రొటీన్.   మిగిలిన అందరు బాగా నటించారు. 

సాంకేతికవర్గం - కథ చాలా చిన్నది , స్క్రీన్ప్లే ,ఎడిటింగ్  చాల షార్ప్ అండ్ క్రిస్పీ గా  ఉన్నాయి. సినిమాలో  ప్రధానలోపం ఎమోషనల్ సీన్స్ ఏమి లేవు, అలాగే విల్లన్ వాడే డ్రోన్ ప్రొజెక్షన్ టెక్నిక్ జోకేగా ఉంది , స్పైడర్ మాన్  ఈ సినిమా లో తాను ఎవరో .. ఇంకొంతమందికి చెప్పేస్తాడు. గ్రాఫిక్స్ ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ. నీటి మనిషి ని గ్రాఫిక్స్ లో అద్భుతంగా  సృష్టించారు. 

సరదాగా ఒక్క సారి చూసేయొచ్చు. 

సినిమా చూసిన థియేటర్ - ఆసియన్ - ఉప్పల్ (సూపర్)

No comments:

Post a Comment

ADD