add

Sunday, 22 September 2019

GADDALAKONDA GANESH MOVIE REVIEW , RATING 2 / 5

వరుణ్ తేజ్ గెడ్డం గెటప్  వేసుకుని .. బ్యాగ్రౌండ్ లో ... వక్క వక్క .. అనే పెద్ద అరుపుతో ...వచ్చిన  వాల్మీకి , ఆకా గద్ద లకొండ గణేష్  గా విడుదలయ్యింది . ప్లాపుల్లో ఉన్న హరీష్   శంకర్ తీసిన ఈ రీమేక్ సినిమా ఎలా ఉందంటే. 

కథ - రౌడీ గణేష్ జీవిత కథ తో..  సినిమా తీద్దామనుకున్న ఒక డైరెక్టర్, గణేష్ ని ఎలా ఒప్పించాడు,గణేష్ ఎం చేసాడు అనేదే కథ. 

నటీనటులు.- వరుణ్ తేజ్ గెటప్ ముందు చూడటానికి బాగున్నా .. చూసేకొద్దీ చికాకు పుట్టిస్తాడు. ఒకొక్కసారి అతను నటిస్తున్నాడు అని తెలిసిపోతుంది. వరుణ్ చేసిన పాత్రలో డ్రామా ఉన్న .. సహజత్వం లేదు. అతని పాత్ర తీర్చి దిద్దిన తీరు కూడా సహజంగా లేదు. (జిగర్తాండా లో సహజత్వమే .. బాబయ్ శిమ్మ కి నేషనల్ అవార్డు తెచ్చింది) . పూజ హెగ్డే  అతిధి పాత్ర లో ఎక్సపోసింగ్ మాత్రమే చేసింది. బొడ్డు  చూపించి , ఏడ్చింది అంతే. అథర్వ బాగా ఆక్ట్ చేసినా అతని వాయిస్ అతికినట్లు ఉంది. అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఇంకొక హీరోయిన్ .. తమిళ ఓవర్ ఆక్షన్ తో చిరాకు తెప్పించింది. కమెడియన్ సత్య ,బ్రహ్మాజీ కొంత నవ్వు తెప్పిస్తారు. 

సాంకేతికవర్గం - హరీష్ శంకర్ మార్పులు చేర్పులు .. గబ్బర్సింగ్ కి కుదిరినా.. ఈ సినిమాకి కొంత కుదరలేదు. కథ ఇంటర్వెల్ వరకు అసలు కదలదు, గణేష్ మర్డర్ లు చెయ్యడం .. వక్క వక్క అరుపు బ్యాగ్రౌండ్ అంతే. గణేష్ కూడా .. ఫ్లాష్ బ్యాక్ లో ఒక అమ్మాయికి పడిపోయి చవట డైలాగ్స్ కొట్టడం ఎబ్బెట్టుగా ఉంది. ఇక ఇంటర్వెల్ తరువాత సినిమా లో ముందు ఏమి జరగబోతుందో మనకి యిట్టె తెలిసిపోతుంది. స్క్రీన్ప్లే లోపం . ఇక మిక్కీ సంగీతం అరుపులు.. వామ్మో ఇవి పాటలా..? అనిపిస్తాయి. కెమెరా చాలా  బాగున్నా వాడిన బ్రౌన్ టోన్ బాగోలేదు. ఐటెం సాంగ్ లో ఆక్టర్ బాగా చూపించింది. 
ఫైట్స్,డాన్స్ లు వేస్ట్. వెల్లు వొచ్చి గోదారమ్మ సాంగ్ లో స్టెప్స్ వెయ్యలేక వరుణ్  చాలా కష్టపడ్డాడు . ఒరిజినల్ బెటర్ . 
క్లైమాక్స్ లో రెండు సన్నివేశాలు మాత్రం హృదయాన్ని స్పృశిస్తాయి. క్లైమాక్స్ బాగా తీశారు. 
ఈ సినిమాకి వాల్మీకి అనే పేరు కరెక్ట్ , ఎందుకు గోల చేస్తారో అర్ధం కాదు, బోయ కులం లో అందరు మంచివారే  ఉన్నారా ?


వామ్మో ... డబ్బులు .. బొక్క ..బొక్క !

సినిమా చూసినది - రాజలక్ష్మి (ఉప్పల్)( మామూలు  థియేటర్)

No comments:

Post a Comment

ADD