కె.వి.ఆనంద్ - సూర్య కాంబినేషన్ సూపర్ హిట్. వీడొక్కడే సూపర్ హిట్ , బ్రదర్స్ ఒక మోస్తరుగా ఆడింది. రంగం తరువాత కే. వి ఆనంద్ తీసిన సినిమాల్లో చెప్పుకోతగ్గ సినిమా ఒక్కటి లేదు. ఇక సూర్య కి కూడా ఈ మధ్య హిట్ లేక నలిగిపోతున్నాడు. ఇలాంటి సమయం లో వచ్చిన ఈ బందోబస్త్ ఎలా ఉందంటే?...
కథ - ప్రధాన మంత్రి ని కాపాడలేకపోయిన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ .. ఎలా హంతకుడిని పట్టుకున్నాడు అన్నదే కథ.
నటీనటులు - సూర్య ఎప్పటిలాగే నటించాడు. కొత్తగా చేసింది లేదు. పాత్రకు ఏమాత్రం తగ్గకుండా బాడీ,నటన చూపించాడు. మోహన్ లాల్ ఉన్న కొద్దీ సేపు నటనతో మెప్పిస్తాడు, అతని పాత్రకు కొన్ని మంచి సంభాషణలు రాసారు. ఆర్య పాత్ర సరిగ్గా లేదు.. తండ్రి చావు చూసి ఏ మాత్రం బాధ్యత , బాధ లేకుండా హాయిగా పడుకుంటుంటాడు. ఆ పాత్ర మలిచిన తీరే తప్పు. ఇక సాయేషా హీరోయిన్ కి తక్కువ సైడ్ ఆక్టర్ కి ఎక్కువ, పాత్రలో .. మొహం అంత ఎక్కువ మేకప్ వేసుకుని , జనాల్ని అలరించలేకపోయింది. నాగిరెడ్డి , బోమన్ ఇరానీ ,మరో విలన్ - చిరాగ్ జానీ నటన పర్వాలేదు అనిపిస్తుంది.
సాంకేతికవర్గం - కథ పరమ రొటీన్, ఇక ఎన్నో లాజిక్ లేని సీన్లు .. విలన్ ఒక కమెండో ఇంట్లో పిల్లి కడుపులో బాంబు ఎలా పెట్టాడో.. హాస్పిటల్ లో .. కి వచ్చి హీరోయిన్ చేతిలో ఎలా బాంబు పెట్టాడో దేవుడికే తెలియాలి. ఓకే డబ్బు తోనో .. లేదా బెదిరించో .. చేసాడు అనుకుందాం. ప్రధానమంత్రి మీటింగ్ ఓపెన్ ఎయిర్ లో పెట్టినపుడు మరి అంత చిన్న స్టేజి వేస్తారా? వేశారు అనుకో.. హీరో ... రైలు పేల్చేసి .. పారాచూట్ తో దూకేసి .. మీటింగ్ కి ఎలా వచ్చేస్తాడు.
కె. వి . ఆనంద్ ఈ సినిమా అస్సలు బ్రెయిన్ వాడి తీసినట్లు కనపడలేదు. సినిమా లో ఒక పబ్ సాంగ్ .. అబ్బా ఆ ట్యూన్ కానీ .. సాహిత్యంగానీ ..అర్ధం అయితే ఒట్టు. హర్రీస్ జయరాజ్ తన పాటలు తానె కాపీ కొట్టి ,బ్యాగ్రౌండ్ కూడా తిరగ మారగ చేసి పాత పాటలు అందించాడు. ఒక్క పాట కూడా అందుకే బాగోలేదు,కెమెరా మొత్తం ఒక చిన్న బడ్జెట్ సినిమా రేంజ్ లో మొత్తం గ్రెయిన్ తో ఉంది. ఫైట్స్ బాగున్నా , సరైన టైమింగ్ లేక ,కెమెరా సరిగ్గా చిత్రీకరించ లేక అవి కూడా తేలిపోయాయి. పాటలే బాగోలేవు .. ఇక డాన్స్ గురించి ఎం చెప్తాము . ఇక హైలైట్ అనుకునే ట్రైన్ ఫైట్ అయితే ..గ్రాఫిక్స్ అని తెలిసిపోయి ... తేలిపోయింది. హీరో కూడా హంతకుడిని పట్టుకోవడం మర్చిపోయి ,వాళ్ళ అబ్బాయ్ కి కాపు కాస్తూ.. డాన్స్ లేస్తుంటాడు. ఇక విలన్ కూడా నేను ఎం తక్కువ కాదు .. అని ఫిగర్స్ తో సరసాలు ఆడుతుంటాడు.
మధ్య లో స్పెషల్ ఆఫ్రికా పురుగుల గోల. కథ సెకండ్ హాఫ్ లో కథ ఎక్కడి నుండి ఎక్కడికో పోయింది.
జనాలు ఈ సినిమా చూసి ఇంటికి క్షేమంగా వెళ్ళడానికి ఎవరినైనా బందోబస్త్ గా తెచ్చుకోవాలి.
సినిమా చూసినది- శ్రీనివాస (ఉప్పల్) చెత్త సినిమా హాల్

No comments:
Post a Comment