add

Wednesday 2 October 2019

సాహో .. చిరు SYERAA - MOVIE REVIEW RATING -3 / 5

మెల్ గిబ్సన్ - బ్రేవ్ హార్ట్ సినిమా చూసి .. అటువంటి సినిమా ఎప్పటికైనా చెయ్యాలని మెగాస్టార్ చిరంజీవి , తన కల  అని ఎన్నో ఇంటర్వూస్ లో చెప్పేవారు. అటువంటి కథాంశమే ఈ సై రా .. సినిమా ని ఎంత డబ్బుతో తీసాం అన్నది ముఖ్యం కాదు. ఎంత మంది దానిని ఆదరించారు అన్నదే ముఖ్యం. బాహుబలి విజయం తో .. భారీ సినిమాలు తీసి విజయం సాధించవచ్చు , అని దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ తెలుసుకుంది. ఆ కోవలోనే ..మోహన్ లాల్ ,మామూట్టి ,సుదీప్,లాంటివాళ్లు మల్టీ లాంగ్వేజ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇండియా లోనే తొలి  కోటి రూపాయలు తీసుకున్న స్టార్ హీరో .. మెగాస్టార్ చిరంజీవి. నటుడిగా చిరంజీవిని గొప్పగా చూపించిన సినిమాలు చాలా తక్కువ. ఆపద్భాందవుడు,స్వయం కృషి, రుద్రవీణ,ఖైదీ,ఇలా కొన్ని మాత్రమే చిరంజీవిలో పూర్తి నటుడిని ఆవిష్కరించాయి. వాణిజ్య విలువలున్న సినిమాల పై దృష్టి పెట్టి మెగాస్టార్ అయినా.. చిరుకి తనలోని నటుడిని చూపించుకోవాలనే తపన మాత్రం .. ఇంకా చనిపోలేదు. ఎన్నో ఏళ్ళ తన కల ఇలా  సైరా గా రూపొంది .. నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 300 కోట్ల భారీ సినిమా ..ఎలా ఉందంటే.. 


కథ - ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి  బ్రిటిష్ పాలకుల అన్యాయాలకు  ఎలా ఎదురెళ్ళాడు, ఎలా పోరాడాడు .. పోరాటం లో మలుపులు,కలుపులు,వెన్నుపోట్లు .. అన్నదే కథ. 

నటీనటులు -  మెగాస్టార్ చిరంజీవి తన కళ్ళతోనే చాలా భావాలు పలికించేశారు, సరికొత్త నటన చూపించలేదు కానీ.. ఈ పాత్ర లో చిరుని మాత్రమే ఉహించుకోగలం  అనేలా నటించారు, ఈ వయసులో కూడా ఫైట్స్ చాలా కష్టపడి చేసారు. (డూప్ స్పష్టంగా తెలిసిపోతాడు). చిరంజీవే చాలా జీవం లేని సన్నివేశాల్లో  .. ఊపిరిగా నిలిచి .. సినిమాని భు జాల పై మోశారు. నయనతార ఉన్నంతలో హుందాగా నటించింది. తమన్నా .. కి మంచి పాత్ర లభించింది. డాన్స్ లో ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన తమన్నా .. పాత్ర సినిమాకి కొంత ఉపయోగ పడింది. తమన్నా పాత్ర ముగింపుని అద్భుతంగ తీయలేకపోయాడు ..సురేందర్ రెడ్డి. అనుష్క  రుద్రమ దేవిగా నటించిన కొద్దీ సేపు .. ఇలా ఉందేంటి, మొహం వాచిపోయి .. అనిపిస్తుంది. సుదీప్,జగపతిబాబు పాత్రలు ఆకట్టుకుంటాయి. ఆలా అని అవి కొత్తగా ఉండవ్. బ్రహ్మాజీ ,విజయ్ సేతుపతి నిడివి తక్కువున్న  పాత్రలు చేసారు. కానీ ఆకట్టుకుంటారు. ఆనంద్,నిహారిక,అమితాబ్, లాంటి వాళ్ళు అతిధి పాత్రలు పోషించారు. ఆ పాత్రలు ఎవరు చేసినా ఒకటే. రఘుబాబు.. పృథ్వి .. కొద్దీ సేపు కనిపించి పర్వాలేదనిపిస్తారు. 


సాంకేతికవర్గం -  నరసింహ రెడ్డి మేకప్ పెద్ద మైనస్, హీరో పరిచయ సన్నివేశం. ఇంగ్లీష్ ఫిలిం ఆస్ట్రేలియా నుండి స్ఫూర్తి పొంది చేసారు, ( ఎద్దులు .. కొండ మీద నుండి పడకుండా కాపాడే సన్నివేసం ). ఎడిటింగ్ లో చలా లోపాలున్నాయి ..ఒక సీన్ ఎలా ఎండ్ చెయ్యాలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి రాలేదు. ఉదాహరణకు.. నాయన తార - చిరంజీవి  శోభనం గది  సన్నివేశం చలా బాగుంది అని అనుకుంటున్నపుడు  హఠాత్తుగా ఆగిపోతుంది. అలాంటివి చాలా ఉన్నాయి .. సురేందర్ రెడ్డి కి గ్రాఫిక్స్ ఎక్కడ .. ఎలా వాడాలో కూడా   తెలియదు. 
ఆర్ట్ డైరెక్టర్ రాజీవం వేసిన కొండ  సెట్టింగ్ చూడగానే తెలిసిపోతుంది. చాలా చోట్ల vfx  లో జర్క్ లు స్క్రీన్ మీద తెలిసిపోతుంటాయి. 
రత్న వేలు కెమెరా వర్క్ చాలా చాలా బాగుంది. అలాగే.. సినిమా కి వాడిన కలరింగ్ కూడా బాగా కుదిరింది. ఫైట్స్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. అమిత్ త్రివేది పాటలు బాగున్నాయి. ఎండ్ టైటిల్స్ లో వచ్చే జాగోరే సాంగ్ హృద్యంగా ఉంది. జూలియస్ పాకీయం  అందించిన  బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా కుదరలేదు. కొన్ని చోట్ల డైలాగ్స్ మింగేసింది. సాయి మాధవ్ బుర్ర అందించిన మాటలు .. అక్కడక్కడా మాత్రమే బాగున్నాయి. గౌతమీ పుత్ర  రేంజ్ లో మాత్రం లేవు. 

స్క్రీన్ప్లే ఈ సినిమాలో పెద్ద లోపం. అందరికి తెలిసిన కథ లో కాల్పనికత జోడించినపుడు , దానికి ఊహించని మలుపులు ఇస్తేనే .. అదిరిపోతుంది. కానీ .. సురేందర్ రెడ్డి చాలా స్లో గా .. తరువాత సీన్ ఏమవుతుందో .. పాత్రతోనే చెప్పించాడు. దాని వలన తరువాత సీన్ ఎం అవుతుందో మనకి వెంటనే తెలిసిపోతుంది. ఉదాహరణకు ( 6 గంటలకు తల నరుకుతాను అని చిరు చెప్పడం., క్లైమాక్స్ ముందు తల్లి పాత్ర కీడు శంకించడం). జగపతి బాబు పాత్ర లో ట్విస్ట్ కూడా సాదా సీదాగా తీసి .. నీరుగార్చారు. 
ఇంటర్వెల్ బాంగ్ అందరు చెప్పుకున్నట్లు .. రివ్యూ ల్లో రాసినట్లు గొప్పగా లేదు. ఎందుకంటే మనకి ముందే తెలుస్తది కదా. ఎం జరుగుతుందో. అలాగే జాతర పాత కూడా గొప్పగా లేదు. డాన్స్ మూవ్మెంట్స్ అస్సలు కుదరలేదు.వస్త్రాలు చక్కగా కుదిరాయి, తమన్నా .. అనుష్క ,నయనతార,సుదీప్, బ్రిటిషర్లు డ్రెస్ లు భలే ఉన్నాయి. 

సురేందర్ రెడ్డి సినిమా కథని సరిగ్గా తెరమీద  ఆవిష్కరించలేదు. దానికి గ్రాఫిక్స్,ఎడిటింగ్ ,స్క్రీన్ప్లే కారణాలు. కానీ.. క్లైమాక్స్ మాత్రం అద్భుతంగ తీసాడు. చిరుని చంపుతారు అనే లోపు ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది. ఒకప్పుడు నేను కూడా చిరు అభిమాని అవ్వడం వలన .. చిరుని ఒక్క సా రి ఆలా ..చూసి ఏడ్చేసాను. తల్లి పాత్రతో చెప్పించిన డైలాగ్స్ కంట తడి పెట్టిస్తాయి. 
 చరణ్ చెప్పినట్లు ఈ సినిమా కి అంత బడ్జెట్ మాత్రం అయ్యి ఉండదు. 

ఒక వీరుని కథగా వచ్చిన  ఈ సినిమాని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి. 


సినిమా చుసినది  - ఆసియన్ ఉప్పల్ 

సాహో .. చిరు !

No comments:

Post a Comment

ADD