కథ : ఫోన్ టాపింగ్ ద్వారా అపాయం లో ఉన్నవారి కి సాయం చేసే ఐ.బి అధికారి శివ కి శాడిస్ట్ అయిన విలన్ భైరవుడు అమాయక ప్రజలను చంపుతూ సవాల్ విసురుతాడు , శివ శాడిస్ట్ ని ఎలా అంతమొందించాడు అనేడి తెర మీద చూడాలి .
నటీనటులు : మహేష్ కొత్తగా నటించడానికేంలేదు తన పాత్రకి తగ్గట్లు అన్ని చేసాడు, మరీ అందంగా కనిపించాడు , కొన్ని చోట్ల అతని నటన మనసుకి హత్తుకుంటుంది , స్టైలిష్ అండ్ క్లియర్ యాక్షన్ మహేష్ చూపించాడు . రకుల్ బబ్లీ క్యారక్టర్ చేసింది , అంత ప్రాధాన్యత లేని పాత్ర అయినా గ్లామర్ తో ఆకట్టుకుంది, ఇక సినిమాలో హీరో కంటే అందర్నీ ఆకట్టుకునే రెండు పాత్రలు భైరవుడు (చిన్న/పెద్ద) . చిన్నప్పటి సూర్య గ వేసిన చిన్నపిల్లాడు అద్భుతంగ నటించాడు
, ముఖ్యంగా జనం మధ్యలో నవ్వుని దాచుకుంటూ ఏడ్చే శాడిస్టిక్ ఎక్స్ప్రెషన్ అద్భుతంగ ఇచ్చాడు, తన తల్లి తండ్రి మరణాన్ని చూస్తూ అతనిచ్చిన ఎక్స్ప్రెషన్ సుపెర్బ్ . ఇక సూర్య ఇంటర్వెల్ బ్లాక్ లో యాక్షన్ , హీరోని హింసించే సీన్ లలో అద్భుతంగ ఆక్ట్ చేసాడు. సూర్యకి ఇది మర్చిపోలేని రోల్. మిగిలిన అందరు లో భరత్ కొంచం ఎక్కువసేపు కనపడతాడు, బాగానే ఆక్ట్ చేసాడు,. మిగిలిన అందరు తమ పాత్రలకు తగినట్లు ఆక్ట్ చేసారు.
సాంకేతికవర్గం: హర్రీస్ జయరాజ్ అచ్చంతెలుగందం,సిసిలియా పాటలు బాగా ఇచ్చాడు, ముఖ్యంగా విలన్ వచ్చినపుడు వినిపించే బ్యాగ్రౌండ్ ట్యూన్ ఆకట్టుకుంటుంది . సమయం లేక నెమో , కొన్ని చోట్ల అపరిచితుడు సినిమాలో రామం పాత్ర మీద జాలి కలిగించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్(మహేష్ కి
రాడ్ గుచ్చుకునే సీన్) , తుపాకీ సినిమాలో టైటిల్స్ పడేటపుడు వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్( హాస్పిటల్ లో మహేష్ 11వ ఫ్లోర్ లో ఎక్విప్మెంట్ సెట్ చేసే సీన్) వాడేసుకున్నాడు.సంతోష్ శివన్ కెమెరా చాలా బాగుంది ,అయన గురించి మనం ఎంత చెప్పిన తక్కువే, మహేష్ తన ఆఫీస్ లో అద్దం లో కనపడే ప్రతిబింబం,క్లోసప్ లో మహేష్ ,విలన్ కళ్ళు చూపించే షాట్స్,మహేష్ ఇంట్లో సూర్య ఫోన్లో మాట్లాడుతూ సగం అద్దంలో కనపడుతూ నవ్వే షాట్స్ గుర్తుంచుకోవాల్సినవి. ఎడిటింగ్ సినిమా కి హెల్ప్ అవ్వగా, పీటర్ హెయిన్స్ ఫైట్స్ మాములుగా ఉన్నాయి , ఇక సినిమా కి ప్రధాన మైనస్ గ్రాఫిక్స్ ,ముఖ్యంగా బండ దొర్లుకుంటూ వచ్చే సీన్ ,
రోలర్ కోస్టర్ సీన్ లో గ్రాఫిక్స్ చీప్గా ఉన్నాయి,రూపిన్ సూచక్ ఆర్ట్ స్పెక్టర్ సినిమాని గుర్తుకుతెస్తుంది , శోభి డాన్స్ పరమ చెండా లంగా ఉంది,మహేష్ తో వాంఅప్ ఎక్సరసైజ్స్ చేయించాడు,కాళ్ళు చేతులు పట్టేసినవాళ్లు చేసినట్లు ఉంది డాన్స్ . ఇక సామజిక అంశాలతో కథారాసుకునే మురుగదాస్ మంచి పాయింట్ రాసుకున్నాడు,హాలీవుడ్ స్టైల్ విలన్ ని చూపించి హీరోని ఎలివేట్ చేయడం మర్చిపోయాడు , హీరో విలన్ మధ్య ఎత్తుకు పై ఎత్తులు కొన్ని చోట్ల బాగానే ఉన్న ... విలన్ హీరోని మించిపోయాడు. అభిమానులు జీర్ణించుకోలేకపోయారు , తమిళ్ నేటివిటీ బాగా కనపడుతున్న ఈ సినిమా లో తెలుగు వెర్షన్ కోసం కొన్ని మార్పులు చెయ్యాల్సింది, కొన్ని పాత్రలు తెలుగులో మాట్లాడలేదు ( భైరవుడు తండ్రి ) . డబ్బింగ్ చెప్పారు . సీరియల్స్ వాడుకుని విలన్ ని కనిపెట్టే సీన్ కి థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తుంది.
తమిళ్ సినిమాలను రెగ్యులర్ గ చూసేవారిని ఈ సినిమా ఇబ్బందిపెట్టదు ,మిగిలినవారికి ఈ సినిమా ఎక్కుతుందో లేదో ? ఫోన్ టాపింగ్ కాన్సెప్ట్ చదువులేని వాళ్లకు అర్ధమవ్వడం కష్టం, రెగ్యులర్ కమర్షియల్ సినిమాకాదు ఈ SPYDER . ఇంతకీ SPYDER అంటే ఏంటో తెలుసా ? మహేష్ ఈ సినిమాలో ఫోన్ టాపింగ్ కోసం వాడే సాఫ్టువేర్ .
హాలీవుడ్ విలన్ ,హాలీవుడ్ హీరో ,హాలీవుడ్ కాన్సెప్ట్ ..... టాలీవుడ్ / కోలీవుడ్ కు ఎక్కుతుందో?లేదో?
WATCHED AT : BVK MULTIPLEX - LB NAGAR - HYDERABAD
(EXCELLENT THEATRE,SOUND,PICTURE)
Nice review
ReplyDeletesuper bro... baga undi nee review.. wanna see the movie once...
ReplyDelete