హాట్సఫ్ n.t.r
కధ : చిన్నప్పుడే తనకున్న నత్తి వలన అందరిముందు అవమానాల పాలయిన జై ఒడిస్సా పారిపోయి రౌడీగా మారుతాడు. తాను రాజకీయంగా ఎదగడానికి , ప్రేమలో గెలవడానికి తనలాగే ఉండే తమ్ముళ్ళని వాడుకుని వాళ్ళను చంపేయాలనుకుంటాడు. తమ్ముళ్లు ప్రేమ చూపించి అన్న మనసు గెలిచారా? అన్న తమ్ముళ్లను కాపాడుకున్నాడా ? తెరమీద చూడాల్సిందే.
నటీనటులు:ఎన్ .టి.ర్ తన నటనతో దున్నేశాడు,మూడు పాత్రల మధ్య తేడాలను చక్కగా చూపించాడు , ఒక్క చోట కూడా ఓవర్ అవ్వకుండా , చాలా చక్కని నటన ప్రదర్శించాడు, ట్రింగ్ ట్రింగ్ పాట లో డాన్స్ చూస్తే మెగాస్టార్ చిరంజీవి తరువాత ఎన్ .టి.ర్ బెస్ట్ డాన్సర్ అని ఒప్పుకోవాల్సిందే . హీరోయిన్స్ సినిమాకి అనవసరం,ఐటెం సాంగ్ లో తమన్నా తన నడుము,తొడ అందాలతో వేడి పెంచింది. సాయికుమార్,పోసాని ఉన్నంతలో పరవాలేదు,మిగిలిన నటులు,విలన్స్ తో సహా అందరు మాములుగా నటించారు.
సాంకేతికవర్గం: బాబీ ఈ సినిమాకి రాసుకున్న సన్నివేశాలు ఒక్కటి కూడా లోతు లేని అతుకుల బొంతల ఉంది, చిన్నప్పుడే తమ్ముళ్లను చంపాలనుకునే జై ,తమ్ముళ్లను నిజంగా ప్రేమించాడంటే జనం నమ్మగలరా, అన్న తమ్ముళ్ల ప్రేమను చూపించే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడా సినిమాలో లేదు, తమ్ముళ్లను చంపమని స్వయంగా చెప్పిన అన్న వెంటనే మారిపోవడం ,తమ్ముళ్లను కాపాడటం అస్సలు నమ్మశక్యంగా లేదు. జై పాత్రలో రాక్షసత్వంకంటే , శాడిజం ఎక్కువగా కనపడుతుంది తమ్ముళ్లను మరీ దారుణంగా హింసిస్తూ తనను చిన్నప్పుడు ప్రేమించలేదని అనటం,మావయ్యను దోమలను తోలమనడం, జై ను చంపడానికి సరైన కారణం లేని హీరోయిన్ , తన పగ మర్చిపోయి భయపడటం. చెప్పుకుంటే బోలెడు లోపాలున్నాయి , మాటలు గొప్పగాలేవు,ఫైట్స్ సాధారణంగా ఉన్నాయి, డాన్స్ ఉన్నంతలో పరవాలేదు. కథలోని లోపాలు, సినిమాని తక్కువ బడ్జెట్ లో తీసారని తెలిసిపోతుంది, ఎన్ .టి.ర్ కాస్ట్యూమ్స్ కొన్ని చోట్ల చాల బాగున్నాయి,చోట కెమెరా బాగున్నా, కొన్ని చోట్ల గ్రాఫిక్స్ లో డబల్ బాడీ కి అతికించిన తల కదలటం కనిపిస్తుంటాయి,కొన్ని చోట్ల మాత్రం చాల సహజంగా వచ్చాయి.నాటకాలు వేసి సెంటిమెంట్ పండించాలనుకుని అస్సలు పస లేని సన్నివేశాలు తీశారు,అవి సినిమాకి ఏమాత్రం ఉపయోగపడని సీన్స్,
క్లైమాక్స్ లో చనిపోయే సన్నివేశంలో బరువైన డైలాగ్స్,సెంటిమెంట్ డ్రామా లేక అసంపూర్తిగా మిగిలిపోయింది. దేవి పాటలు పరమ రొటీన్ ,బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు,కామెడీ అంత లేదు.
ఎన్ .టి.ర్ కోసం ప్రతి ఒక్కరు తప్పక చూడాలి ,మారిన ఎన్ .టి.ర్ నటనని అభినందించాలి .
చుసిన థియేటర్ : శ్రీనివాస 70 MM ( ఉప్పల్) (హైదరాబాద్)
( ఛండాలపు థియేటర్)
చుసిన థియేటర్ : శ్రీనివాస 70 MM ( ఉప్పల్) (హైదరాబాద్)
( ఛండాలపు థియేటర్)
Good review
ReplyDelete