add

Friday, 9 February 2018

ఇంటెలిజెంట్ మూవీ రివ్యూ - INTELLIGENT 2018 TELUGU MOVIE REVIEW

వి వి వినాయక్  సాధారణ మాస్ సినిమాలు తీస్తుంటాడు, పూరీజగన్ ల స్పీడ్ సినిమాలు , రాజమౌళి ల ఎమోషనల్ సినిమాలు తీయలేడు , రైటర్ కథ ,  కామెడీ కలిసివస్తే తప్ప హిట్స్ ఇవ్వలేడు వినాయక్, ఏ ఫిలిం బై వినాయక్ అని పోస్టర్స్ మీద వేసుకోడానికి వినాయక్ కి ఎం అర్హత ఉంది . మెహెర్ రమేష్ కూడా వేసుకోవచ్చు అనుకుంటే వినాయక్ కూడా వేసుకోవచ్చు . 

మాస్ సినిమాలు తీసే వినాయక్ ఇంటెలిజెంట్ అనే సినిమా తీయడం అనవసరం , ఎందుకంటే ఎవడైనా సుమో ని వీధి చివర పార్క్ చేస్తాడు , పక్క వీధిలో పార్క్ చేస్తాడు , మన వినాయక్ సినిమాలో (చెన్నకేశవ రెడ్డి ) మాత్రం భూమిలో గొయ్యి తవ్వి సుమో ని పార్క్ చేసి అందులో దాగుంటారు , అక్కడ ఊపిరి ఆడుతుందో లేదో,ఎంతసేపు ఉండాలి భూమిలో అనేది ఇంటెలిజెంట్ డైరెక్టర్ వినాయక్ చెప్పాలి .ఈ ఒక్క సీన్ చాలు వినాయక్ తెలివి ఎంతో చెప్పడానికి . 

కథ : సాఫ్ట్ వేర్ సంస్థ నడుపుతున్న నాజర్ , తేజ కి చదువులో సాయం చేస్తాడు , పెద్దవాడైన తేజ నాజర్ తో పాటే ఉండాలనుకుని అతని కంపెనీ లోనే సాఫ్ట్  వేర్ జాబు చేస్తుంటాడు ,అనుకోకుండా నాజర్ చనిపోతాడు , అతని మరణం వెనుక ఉన్న రహస్యాలు మన ఇంటెలిజెంట్ ఎలా ఛేదించాడు?

 నటీనటులు : సాయి ధరమ్ తేజ్ బాగా లావుగా ఉన్నాడు , నటన , డాన్స్ లో పరవాలేదు కానీ గొప్ప మార్పు లేదు, ఇమిటేషన్ మాత్రం బాగా చేసాడు, లావు తగ్గకపోతే హీరోయిన్స్ దొరకడం కష్టం , ఇలాంటి కథలు ఎంచుకోవడం మానేస్తే బాగుపడతాడు, లావణ్య త్రిపాఠి అందంగా లేదు,అభినయము ప్రదర్శించలేదు , డాన్సులో అయితే ఎదో చేసాం అంతే అన్నట్లు ఉంది. విల్లన్స్ వేస్ట్ . 
నాజర్,కసి విశ్వనాధ్, సప్తగిరి,జయప్రకాశ్ రెడ్డి అందరు బాగానే చేసారు, బ్రహ్మి మరో వేస్ట్ పాత్ర చేయగా ,సినిమా లో ఆకుల శివ కిల్లర్ గా భలే కామెడీ చేసాడు , అతని నటన చూస్తుంటే హీరో వీడ్ని ఎప్పుడు చంపెస్తాడా అని అనిపిస్తుంది. 

సాంకేతికవర్గం: వినాయక్ ఇక కృష్ణవంశీ,మెహర్ రమేష్,వైట్ల బ్యాచ్ లో చేరిపోయాడు, హీరో ఏ సినిమాలో ఒక్క పని చేసినట్లు కనపడదు , ఒక స్పీచ్ ఇస్తాడు ఆప్ లాంచ్ లో , ఫ్రెండ్స్ కి  విలన్ ఫ్రెండ్స్ బ్యాంకు అకౌంట్ ని హాక్ చేయమని స్పీచ్ ఇస్తాడు ,డ్రోన్ కెమెరా ఏరోప్లేన్ మీద ఎగరవేస్తాడు ,వీటిలో ఇంటెలిజెన్స్ ఎక్కడవుంది,వినాయక్ విసువల్స్ అని వేసుకున్నప్పుడు 
ఏముంది స్పెషలిటీ రొటీన్ రొట్ట  తప్ప ,థమన్ పాటలు రెండు బాగున్నాయి ,డాన్స్ లు అన్ని 
స్టేజి డాన్సులు ల ఉన్నాయి , చమకు చమకు పాట లో డాన్స్ , హీరో లావు ,హీరోయిన్ నీరసం పాటని చంపేశాయి ,ఆకుల శివ మాస్టర్ సినిమాని లక్ష్మి సినిమాగా మార్చేశాడు,ఈసారి ఈ సొంత కథతో వచ్చాడు ఫూల్ అయిపోయాడు , థియేటర్ బయటకొచ్చిన అందరు కథ రాసింది ఎవడ్రా 
అని తిట్టుకుంటున్నారు,విశ్వేశ్వర్ కెమెరా వినాయక్ విసు వాల్స్ కి సరిపోక చోట సహాయం తీసుకున్నాడేమో ,బాగ్రౌండ్స్కోర్ బాగోలేదు , సినిమా చాలా చీప్గా తీశారు అని తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తే ,సినిమా దానిని కంఫర్మ్ చేస్తుంది . 


చూడాలనుకుంటే మీ ఖర్మ !

No comments:

Post a Comment

ADD