add

Friday, 30 March 2018

రంగస్థలం RANGASTHALAM 2018 movie review telugu lo PHANI MAROJU RATING - 5/5

రంగస్థలం ... ఎన్నో సంవత్సరాలనుంచి రొటీన్ సినిమాలు చూస్తూ అప్పుడప్పుడు తమిళ వెరైటీ సినిమాలు చూసి  ఆనందం పొందే తెలుగుప్రేక్షకుల కోసం వచ్చిన అచ్చ తెలుగు సినిమా రంగస్థలం , జగడం లాంటి మంచి కాన్సెప్ట్ సరైన హీరో లేక  ప్లాప్ అయ్యింది , మహేష్ బాబు వన్  టార్చర్ కాగా , నాన్నకు ప్రేమతో హాఫ్ నాలెడ్జి సినిమాగా మిగిలిపోయింది , ఆర్యా  2 లాంటి క్లిష్టమైన కాన్సెప్టునే  అద్భుతంగా తీసిన సుకుమార్ మళ్ళి  రంగస్థలం తో తన ప్రతిభని నిరూపించుకున్నాడు


కథ : రంగస్థలం అనే గ్రామంలో చిట్టిబాబు అనే చెవిటి ఇంజినీరు ,అతని అన్న కోసం ,ఊరికోసం ,రామలక్ష్మి ప్రేమ కోసం ఎం చేసాడు ? రాజకీయాల్లో విష వృక్షంగా ఎదిగిన జమిందార్ ఫణీం ద్ర భూపతిని ఎలా ఎదుర్కొన్నాడు ? అనేదే కథ.
నటీనటులు : రాంచరణ్ తొలిసారిగా తనలోని నటుడ్ని తెర మీద ఆవిష్కరించాడు , రాజమౌళి మగధీర తో కమర్షియల్ హీరోగా నిరూపించుకున్నా  , నటుడిగా  ప్రేక్షకులనుండి , విమర్శకులనుండి ఏ మాత్రం మెప్పు పొందలేకపోయారు . ఈ చిట్టిబాబు   పాత్రలో లీనమైపోయి , చరణ్ నటించిన తీరు చూస్తే మెగా ఫామిలీ లో నిజమైన నటుడు పుట్టుకొస్తున్నాడు అనిపిస్తుంది. ఎక్కడ కూడా హీరోయిజం కనపడకుండా పాత్ర మాత్రమే కనిపించేలా నటించాడు , చెవిటి పాత్ర ప్రవర్తన , ఆహార్యం  సహజంగా ఉంది ఆకట్టుకుంటుంది , ఒక్క మాటలో చెప్పాలంటే , మగధీర లో గుర్రం నడిపినందుకు చరణ్ కి నంది ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి కోరడం జోక్ గ  అనిపిస్తే,ఈ సినిమాకి అవార్డులు వస్తాయి అని మెగాస్టార్ చెప్పడం నిజం అవుతుందని సినిమా చుసిన ఎవరైనా చెప్పాల్సిందే. 

సమంత బాగా నటించినా ఆమె పాత్రకు దుబ్బింగ్, యాస అంతగా సహజంగా లేవు , ఆది పిని శెట్టి పాత్ర చాలా సినిమాకి చాలా కీలకం , ఆది  ఆపాత్రను సునాయాసంగా పోషించాడు,అనసూయ పాత్ర కూడా సినిమా లో ఒక రకమైన రొమాంటిక్ టచ్ తో ప్రారంభమయ్యి , సినిమాకి వెన్ను దన్నుగా నిలిచే పాత్ర , ఆమె వయ్యారాలు నేల క్లాసు జనాలతో పాటు అందర్నీ ఊరిస్తాయి , జగపతిబాబు విలన్  పాత్ర క్రూరంగా ఉండి చివర్లో తేలిపోయింది , ప్రకాష్ రాజ్ ఉన్నంతలో రొటీన్ గ నటించాడు , నరేష్ ,రోహిణి ,సత్య,గెట్ అప్ శీను , అందరు బాగానే నటించారు . 

సాంకేతికవర్గం : సుకుమార్ ఈ మూడుగంటల సినిమా ని ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించాడు , సుకుమార్ సినిమాల్లో ఉత్తమ చిత్రం రంగస్థలం , తమిళ దర్శకుడు బాలా ల సుకుమార్ తెరమీద ఆవిష్కరించిన క్రూరమైన కథ రంగస్థలం , దేవిశ్రీప్రసాద్ సంగీతం , పాటలు మరొక్కసారి సుక్కు దేవి హిట్ కాంబినేషన్ అని నిరూపించాయి, రత్నవేలు కెమెరా అద్భుతం అని చెప్పొచ్చు , ఒక్క ఫారెన్  లొకేషన్ లేని ఈ సినిమా లో కళాదర్శకుడు -  రత్నవేలు కలిసి సినిమాని ఒక పెయింటింగ్ ల తీర్చిదిద్దారు , పాటల్లో కోరియోగ్రఫీ బాగానే ఉంది ,  రామ్ లక్ష్మణ్ ఫైట్స్ సహజంగా ఉండి అద్భుతంగ ఉన్నాయి . ఎడిటింగ్ సరిపోయింది . 


మైనస్ పాయింట్స్:
జిగేలురాణి  పాట  సినిమా లో అసహజంగా అనిపిస్తుంది , లొకేషన్ , కోరియోగ్రఫీ అంతగా ఆకట్టుకోవు ,పూజ హెగ్డే మరి పెద్దాపురం డాన్సర్ ల చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది ,
సమంతా మేకప్ అక్కడక్కడా ఎక్కువైనట్లున్నది , 

టాప్ సీన్స్ :
  1.                    రాంచరణ్  తన నయనమ్మని విలన్ తిట్టాడని చేసే ఫైట్ 
  2.                   రాంచరణ్ సమంత మధ్య వచ్చే రొమాంటిక్ అండ్ కిస్ సీన్స్ 
  3.                   ఆది పిని శెట్టి మీద జరిగే హత్యాప్రయత్నం 
  4.                    క్లైమాక్స్  సీన్స్  

తప్పక చూడండి . 

సినిమా చూసినది : ఆసియన్ రాధికా మల్టీప్లెక్స్ స్క్రీన్ -5 ( సూపర్ థియేటర్) - ఉప్పల్ 

No comments:

Post a Comment

ADD