add

Sunday, 20 May 2018

అన్నదాత సుఖీభవ - 2018 - సినిమా రివ్యూ annadata sukeebhava 2018 review RATING 1 / 5

విప్లవ సినిమా హీరో ' నారాయణమూర్తి ' నటించిన సినిమా .. ' అన్నదాత సుఖీభవ '. సినిమా పరిశ్రమ లో చాలామంది కాలానికనుగుణంగా ..  మారుతున్నా.. మూర్తి అన్న మాత్రం .. అక్కడే ఆగిపోయారు. వయసు ఎంత పెరిగినా సరే .. మూర్తి గారు, హీరోగా నటిస్తూనే ఉన్నారు. పబ్లిసిటీ  అస్సలు లేకుండానే .. కేవలం వాల్ పోస్టర్ల ద్వారా రిలీజ్ అయ్యిన ' అన్నదాత సుఖీభవ ' ఎలా ఉందొ .. చూద్దాం. 

కథ: రైతులు .. పంటలు.. అమ్మకాలు.. మార్కెట్ యార్డులు.. రైతు కుటుంబాలు.. cm రైతుల కోసం ఎం చేసారు. అనేది కథ. 

నటీనటులు: నారాయణమూర్తి నటన .. ఎర్రసైన్యం కాలం లోనే ఉంది. మార్పేమి లేదు. మిగిలిన నటీనటుల్లో చెప్పుకోదగ్గ వారు, ఎవరూ లేరు. వంగపండు ( విప్లవ గాయకుడు) కూడా నటించారు. నారాయణమూర్తి పెద్ద అల్లుడు గా నటించిన నటుడు బాగానే చేసాడు. విలన్ ఎక్కువ చేసాడు. 

సాంకేతికవర్గం: ఇక్కడ అన్ని శాఖలూ  నారాయణమూర్తే నిర్వహించారు. సంగీతం.. కల్తీ మీద పది నిమిషాల పాట  కొంత బాగుంది, కెమెరా .. మూర్తి గారిని ఇక్కడ ప్రత్యేకంగా తిట్టాలి.. చాలా చోట్ల లైట్ చూసుకోలేదు, కెమెరా వణికిపోయింది .. డాన్సులు ..అబ్బా ఊరిలో ఉన్న అందరిని తీసుకొచ్చి.. డాన్సులు వేయించారు మూర్తి .. చేతకాని పనులెందుకు ? ఎడిటింగ్ సింక్ అవ్వలేదు,నిర్మాతగా కూడా సరిగ్గా ఖర్చు పెట్టలేదు. ఇక దర్శకుడు గా అయితే మూర్తి గారు సినిమాలు మానేయాలి. బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లు  సెంటిమెంట్ సీన్లు లో సైతం నవ్వుతుంటారు.. సీఎం ని .. ఎమ్మెల్యే పబ్లిక్గా కాల్చేస్తుంటే .. చుట్టూ సెక్యూరిటీ లేకపోవడం అబ్బా.. తట్టుకోలేం. జనాలు అందుకే థియేటర్లలో కనపడటం లేదు.  


నారాయణమూర్తి నుండి మరో సుత్తి చిత్రం. 

సినిమా చూసినది:

శ్రీ సాయి రాజా థియేటర్ -(ముషీరాబాద్) బాగున్నా .. టాయిలెట్స్ కి వెళ్తే ..చస్తారు.                                                                                        శుభ్రం చేసి కొన్ని ఏళ్ళు అయ్యి ఉంటది. 

No comments:

Post a Comment

ADD