విజయ్ ఆంటోనీ .. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ వరుస ప్లాపులతో ..తెలుగు ప్రేక్షకులను హింసిస్తూ .. ఇప్పుడు మరో సారి ' కాశీ ' గా కసి తో వచ్చాడు.
కథ : కాశీ తన సొంత అమ్మ నాన్న లను వెతుక్కుంటూ .. అమెరికా నుండి ఇండియా కి వస్తాడు .. పార్వతి అనే పేరు తో ఉన్న తల్లిని కనుక్కోవడం కోసం.. ఉరి వాళ్ళ దగ్గర ఎదో ఒక సాకు చెప్పి.. రక్తం సేకరించి , తన డిఎన్ఏ తో కలిసిందో లేదో .. చూసుకుంటాడు.. ఈ క్రమం లో అతను ఊరి ప్రెసిడెంటు , గజ దొంగ రత్తయ్య కథలు వింటాడు. ఆ కథల్లో .. కాశీ ఫ్రెండ్ గోపి ... కాశీనే హీరోగా ఉహించుకుంటాడు. చివరకి తన తండ్రి ఎలా దొరికాడు.. అన్నది తెర మీద చూడాలి.
నటీనటులు: ఎన్ని సినిమాలు మారినా .. ఎన్ని పాత్రలు వేసినా .. అదే ఫీలింగ్ .. అదే భావాలూ.. విజయ్ ఆంటోనీ ఈ సినిమా లో 3 రకాల పాత్రల్లో ఒకేలా నటించి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. అపరిచితుడు సినిమా విజయ్ కి ఇస్తే .. ప్రజలు రెండో షో కె సినిమా తీయించేస్తారు . విజయ్ మారకపోతే కష్టం. అంజలి హీరోయిన్ గా రొటీన్ గా నటించింది.. అదేం పెద్ద పాత్ర కాదు. కమెడియన్ యోగి కొంత నవ్విస్తాడు. సునైనా పాత్ర బాగానే చేసింది. శిల్ప మంజునాథ్ ముసలి వాడ్ని పెళ్లి చేసుకుని .. గజ దొంగ తో ప్రేమలో పడటం ..ఆ ఎపిసోడ్ బాగుంది, ఆమె అందంగానూ ఉంది,నటన బాగా చేసింది. కాలేజీ ఫ్లాష్ బ్యాక్ లో అమృత పర్వాలేదనిపించింది. మధుసూదన్,నాజర్ పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం:
కిరుతిగా ఉదయనిధి .. అమ్మాయి. ఈ సినిమా డైరెక్ట్ చేసింది. సినిమాలో అనవసర కథలకు టైం ఎక్కువ ఇచ్చి .. టైం తినేసింది. పోనీ ఆ కథలేమైనా ఆసక్తిగా ఉన్నాయా? లేవు!. ఒక్క మూడవ ఫ్లాష్ బ్యాక్ కొంచం సినిమాకి పనికి వచ్చేలా ఉంది. ధనుష్ ఈ సినిమా ఒప్పుకోకుండా.. మంచిపని చేసాడు. విజయ్ ఒప్పుకుని ఈ సినిమాని చెత్త చెత్త చేసాడు. కథనం మరీ చిరాకు తెప్పిస్తుంది. ఫైట్స్ ఉన్నంతలో బాగున్నాయి. పాటలు ఒక్కటి కూడా ఆకట్టుకోవు. కెమెరా బాగుంది. ఎడిటింగ్ నీరసం . ఆర్ట్ బాగా కుదిరింది.
విజయ్ ఆంటోనీ కసి తో వదిలిన రీ' మేకు ' - కాశీ
సినిమా చూసినది : సప్తగిరి 70 MM RTC క్రాస్ రోడ్డు ( చెత్త థియేటర్)

No comments:
Post a Comment