మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర తీయడం సాహసం. తెలుగు సినిమా తొలి దశల్లో సూపర్ స్టార్ ల కంటే గొప్ప అభిమానులను సంపాదించుకున్నారు.. సావిత్రి. ఆమె డేట్స్ కోసం హీరోలు వేచి చూసేవారంటే .. ఆమె ఎంత గొప్ప నటో చెప్పనవసరం లేదు. అశ్వినీదత్ లాంటి గొప్ప నిర్మాత .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో .. తీసిన మహానటి సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ: మహానటి సావిత్రి గారి ..బాల్యం , నటిగా ఎదగడం, రహస్య వివాహం, ఆమె మద్యానికి బానిస అవ్వడం, జెమినీ గణేశన్ మోసం, అందరిని కోల్పోవడం.. చివరికి ఎలా చనిపోయింది ఈ సినిమాలో చూడొచ్చు.
నటీనటులు: కీర్తి సురేష్ .. చాల గొప్ప అవకాశం అంది పుచ్చుకున్నది. అద్భుతంగ నటించి .. మెప్పించింది. మనకు కీర్తి సురేష్ అక్కడక్కడా కనపడుతుంది .. మిగిలినదంతా ఆమె సావిత్రి గారి జీవితంలోకి పరకాయ ప్రవేశం చేసిందని చెప్పొచ్చు.ఆమె మొహం లో అన్ని భావాలు అద్భుతంగ పలికించింది. జెమినీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్ బాగా నటించాడు. అతని పాత్రకు తానె డబ్బింగ్ చెప్పుకోవడం కూడా బాగుంది.
సమంత ,రాజేంద్రప్రసాద్ సినిమాలో బలమైన పాత్రలు పోషించారు ,క్లైమాక్స్ లో సమంత బాగా నటించింది. విజయ్ దేవరకొండ మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి. మాటలు మింగేసి.. తెలుగుని .. తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే ..అన్ని సినిమాల్లో భరించడం కష్టం.
క్రిష్,సందీప్ రెడ్డి,శ్రీనివాస్ అవసరాల,సాయిమాధవ్ బుర్ర లు .. కెవి రెడ్డి ,పుల్లయ్య,ఎల్వి ప్రసాద్ ,పింగళి పాత్రలు చేసారు ..ఇవి తక్కువ నిడివిగల పాత్రలు. చక్రపాణిగా ప్రకాష్ రాజ్ పరవాలేదు, ఎస్వీఆర్ గా మోహన్ బాబు.. రెండు సీన్లలో కనిపించి అలరిస్తాడు. ఎన్టీఆర్ గా ఎవరో నటుడు నటించగా .. ఏఎన్నార్ గా నాగ చైతన్య నటించాడు. నాగచైతన్య ఆ పాత్రలో సూట్ కాలేదు.. ముఖ్యంగా అతని మూతి వలన .. చిరాకుగా కనిపిస్తాడు. మిగిలిన అందరు బాగా నటించారు.
సాంకేతికవర్గం: నాగ్ అశ్విన్ .. ఎవడె సుభ్రమణ్యం సినిమా తీసి అందర్నీ భయపెట్టాడు. ఈ సినిమా.. నాగ్ అశ్విన్ తీసాడంటే నమ్మలేం. చాలా బాగా తీసాడు. సావిత్రి గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే వావ్ .. అనిపిస్తుంది. సినిమా లో జీవితం చూపించాడు . సావిత్రిగారి బలాలే కాకుండా .. ఆమె లోని మైనస్ లు కూడా బాగా చూపించాడు.బాగా పరిశోదించాడు .
అతిగా అందర్నీ నమ్మడం,దాన గుణం, మద్యం కంటే ప్రమాదకరం అని, సావిత్రి గారి జీవితం చెపుతుంది. మరపు రాని చిత్రం తీసాడు నాగ్ అశ్విన్. ఆర్ట్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది, కాస్ట్యూమ్స్ బాగా డిజైన్ చేసారు. కెమెరా వర్క్ మాత్రం ఈ సినిమాలో అక్కడక్కడా బాగా లేదు.. ముఖ్యంగా విజయ్ సమంత ట్రాక్ మొత్తం మసకగా ఉంది.. చిరాకు పుట్టిస్తుంది.
మిక్కీ మ్యూజిక్ లో పాటలు గొప్పగా లేకపోయినా.. నేపధ్య సంగీతం మాత్రం సూపర్బ్. సినిమా చివరికొచ్చే సరికి , సావిత్రిగారి పతనం చూస్తుంటే ..మనసున్న ప్రతి ఒక్కరు కదిలి పోతారు.
స్త్రీ లోలుడైన భర్తని .. నిర్దాక్షిణ్యంగా తిరస్కరించే స్త్రీ గా.. మద్యానికి బానిసై .. నోరు కట్టుకోలేని వ్యక్తిగా .. సావిత్రిగారి పాత్రను చూస్తే...జాలి వేస్తుంది. పేదరికం లోనూ .. సాయం చేసే గుణం చూస్తే ...చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. తండ్రి ని చూడటం కోసం ఆరాట పడే సావిత్రమ్మ .. చివరికి తండ్రి ని చూడకుండానే ..మరణించడం బాధాకరం.
ఈ రివ్యూ రాసిన నేనే .. ఈ సినిమా నుంచి బయటకు వచ్చి.. గంటకు పైగా ఏడ్చానంటే .. ఆమె జీవితం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు... దర్శకుడు ఎంత బాగా తీసాడో చెప్పొచ్చు.
తప్పకుండ ప్రతి ఒక్కరు .. థియేటర్లో చూడాల్సిన సినిమా. ఇది. సావిత్రి గారికి మనమిచ్చే గౌరవం సినిమాని థియేటర్ లో చూడటం. ఇటువంటి సినిమా తీసిన ప్రియాంకదత్ ని అభినందించాలి.
సినిమాలో నరేష్ ఒక మాట అంటాడు.. ' సావిత్రి గురించి చెప్పను !సావిత్రమ్మ గురించి అయితే చెపుతాను ' అని అంటాడు. సినిమా పూర్తయ్యాక మనం కూడా .. సావిత్రమ్మ అనే పిలుస్తాం. శంకరయ్య ఎవరో క్లైమాక్స్ లో బాగా చూపించారు.
సినిమా చూసినది : రాజలక్ష్మి ( ఉప్పల్)(పర్వాలేదనిపించే థియేటర్)

No comments:
Post a Comment