add

Friday 11 May 2018

మెహబూబా 2018 రివ్యూ .. వద్దబ్బా ! 2 / 5

పూరి జగన్నాధ్ తన తనయుడు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి, తన సొంత బ్యానర్ లో .. పూర్వజన్మల అంశంతో .. తీసిన మెహబూబా సినిమా ఈ రోజు విడుదలయ్యింది. సినిమాలు అన్నీ వరుసగా ప్లాపులయ్యి .. వెనక్కి తగ్గిన పూరి.. ఇల్లు కూడా అమ్మేసి , మెహబూబా సినిమా తీసాడు. ఈ సినిమా ను చూసిన దిల్ రాజు, కొనేసుకుని తానే  తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయడం, చిత్ర విజయం పై నమ్మకం  పెంచింది. 


కథ: రోషన్ మిలిటరీ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంటాడు. ఆఫ్రీన్ పాకిస్థాన్ నుండి హైదరాబాద్ వచ్చి చదువు కుంటుంటుంది. ఇద్దరికీ .. చిన్నప్పటి  నుండి గత జన్మ జ్ఞాపకాలు.. గుర్తొస్తుంటాయి. అనుకోకుండా ఒక అపాయం నుండి ఆఫ్రీన్ ని .. రోషన్ కాపాడతాడు. అక్కడ నుండి ఇద్దరికీ గతజన్మ గుర్తుకు రావడం ...ఆ గత జన్మ లో వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోడానికి ఈ సినిమా చూడాలి. 

నటీనటులు: ఆకాష్ పూరి కి మంచి వాయిస్ ఉంది, ఆ వాయిస్ అతని బాడీ కి నప్పలేదు. మొహం లో హీరో లక్షణాలు లేవు. ఆక్టింగ్  అక్కడక్కడా బాగానే చేసాడు. కానీ  రొమాంటిక్ అండ్ సెంటిమెంట్ సీన్లు చేసేటప్పుడు తేలిపోయాడు. ఎప్పుడూ  సినిమాలో 'ఏఏయ్య్ .. అని అరుస్తుంటాడు ఆకాష్, అంత అవసరం లేదు ఈ కథకి. మహేష్,పవన్,ప్రభాస్ లను చాలా చోట్ల ఇమిటేట్ చేసినట్లు తెలిసిపోతుంది. నేహా శెట్టి .. చూడటానికి మెహ్రీన్ ల ఉంది, గొప్ప నటన ప్రదర్శించలేదు. ఆమె తలకు స్కార్ఫ్ కట్టినపుడే బాగుంది. స్కార్ఫ్ తీసేస్తే చూడటానికి అంత బాగోలేదు. సాయాజీ షిండే ..పరవాలేదని పించాడు. హీరో ఫ్రెండ్స్ హీరో కంటే వయసులో చాలా పెద్దవాళ్ళని చూస్తే తెలిసి పోతుంది. ఇక మురళి శర్మ పెద్దగా చేసిందేం లేదు. 

సాంకేతికవర్గం: పూరి స్పీడ్ గా కథ చెప్పడం లో దిట్ట. కానీ ఈ సినిమా చూస్తే.. పూరి ఈ సినిమా తీసాడా? అనిపిస్తుంది. పాత  చింతకాయ కథ కి, ఏ మాత్రం మసాలా లేకుండా.. ఫ్లాష్ బ్యాక్ లో కనీసం కొత్తదనం లేకుండా తీసాడు. కొన్ని చోట్ల  మరీ ఓవర్ అయ్యాడు .. క్లైమాక్స్ లో ఇండియా - పాక్ బోర్డర్ లో ఆర్మీ ఆఫీసర్స్ .. కాలేజీ స్టూడెంట్స్ మాదిరి కొట్టుకోవడం, బైక్ వేసుకుని బోర్డర్ దాకా వచ్చేయడం, గేట్ ని రాకెట్ లాంచర్ లతో కాల్చేయడం, అబ్బబ్బ .. మెహబూబా కోసం పూరి వేరే లెవెల్ కి వెళ్ళిపోయాడు. కథనం అయితే పరమ నీరసంగా సాగింది. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి, 'ఇంట్లో నాన్నను ఉంచుకుని .. పక్కింటోడిని నాన్నా అని చెప్పుకుంటావా?' అని పాకిస్థాన్ ని పొగిడే ఇండియన్ తో అనడం, సేవ్ ది టైగర్ సీన్ లో మాటలు ఆకట్టుకుంటాయి. కానీ ఈ ప్రేమ కథ చిత్రం లో .. ప్రేమ కు సంబంధించిన మాటలు లేవు .. ఉన్న కొన్ని కూడా ఆకట్టుకోవు. హీరో పాకిస్థాన్ వెళ్లడం .. అబ్బా ఎంత ఈజీ.  జీప్ లు వేసుకుని ..హీరో బైక్ ని చేస్ చెయ్యలేని విల్లన్స్.. ఇలా బోలెడు లాజిక్ లెస్ సీన్లు సినిమా నిండా.. అంతా ఆకాష్ పూరీని .. మాస్ హీరోని చెయ్యాలని. తపన  అయితే ఓకే .. బట్ ఆకాష్ లో చార్మింగ్ ఉండాలిగా ?

 సందీప్ చౌతా నేపధ్య సంగీతం ఈ సినిమా కి ప్రధాన బలం,పాటలు ఒకటి రెండు బాగున్నాయి.  కెమెరా .. ఎడిటింగ్ పర్వాలేదు. ఆర్ట్ గొప్పగా లేదు. గ్రాఫిక్స్ మాత్రం బొమ్మ వాను లు , బొమ్మ ప్లైట్ లు లా చూడగానే తెలిసి పోతుంటాయి. ఈ సినిమా కంటే హిందీ లో వచ్చిన సన్నీ డియోల్ ' గదర్ ' ఏక్ ప్రేమ్ కథ .. సినిమా చూడటం బెటర్. 


జండూ బామ్ తీసుకుని వెళ్ళాలి.

సినిమా చూసినది:సుధా సినిమాస్ ( చార్మినార్)( మంచి థియేటర్) 

No comments:

Post a Comment

ADD