add

Thursday, 5 July 2018

గోపీచంద్ ' పంతం ' GOPICHAND PANTHAM 2018 RATING 2 / 5 MOVIE REVIEW

గోపీచంద్ చాలా రోజుల తరువాత...  గౌతమ్ నంద లాంటి ప్లాప్ సినిమా తరువాత .. పంతం సినిమా  తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గోపీచంద్ కెరీర్ లో 25 వ సినిమా పంతం అవ్వడం గమనార్హం. 


కథ: విక్రాంత్ అనే యువకుడు .. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రభుత్వం ఇచ్చే ఎక్సగ్రే షియా .. ఇవ్వకుండా.. మినిస్టర్ లు నొక్కేయడం చూసి , బాధపడి.. తానే రంగంలోకిదిగి , ఆ దాచిన దొంగ సొమ్ము కాజేసి , ప్రజలకు పనిచేస్తుంటాడు, హోమ్ మినిస్టర్ నాయక్ - విక్రాంత్ మధ్య గొడవే .. పంతం.


నటీనటులు: గోపీచంద్ రొటీన్ నటన ప్రదర్శించాడు. క్లైమాక్స్ కోర్ట్ లో ఆకట్టుకునే విధంగా డైలాగ్స్ చెప్పాడు. హీరోయిన్ మెహ్రీన్ మరీ లావుగా .. గోపీచంద్ పక్కన చిన్నపిల్ల లా కనిపించింది. నటించింది ఏమి లేదు. సంపత్ విలనిజం మామూలే. ముఖేష్ ఋషి, కమెడియన్ పృథ్వి,శ్రీనివాస్ రెడ్డి ,భరణి ఉన్నంతలో నటించారు.

సాంకేతికవర్గం: గోపిసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి అతి పెద్ద లోటు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే మలయాళ సురేష్ గోపి సినిమాల్లో ఉన్నట్లుంది. కెమెరా పర్వాలేదు వాడిన బ్లూ టింట్ అస్సలు బాగోలేదు. ఆర్ట్,ఎడిటింగ్ కొంత సినిమాని కాపాడాయి. ఫైట్స్ గొప్పగాలేవు.

ఇక కథ పరమ రొటీన్, కోర్ట్ లో డైలాగ్స్ అక్కడక్కడా బాగున్నాయి. చక్రవర్తి కి లభించిన అవకాశం సద్వినియోగ పరచుకోలేకపోయాడు. ప్రేక్షకులు సినిమా చూసి పెదవి విరుస్తున్నారు.

పాత కథ తో .. చెత్త కథనం తో పంతం నిరాశకలిగిస్తుంది . 

సినిమా చూసినది: మేఘ థియేటర్ ( ఛండాలపు థియేటర్) (దిల్సుఖ్నగర్)
       ఇక్కడ బాగ్  లోపలి పట్టుకెళ్ళ కూడదు, బాగ్ కి 10 /- ఛార్జ్ చేసి                                                         దోచుకుంటున్నారు.


No comments:

Post a Comment

ADD