add

Friday, 29 June 2018

సంజు మూవీ రివ్యూ తెలుగులో 4/5 RATING - SANJU 2018 HINDI MOVIE REVIEW TELUGULO

సంజయ్ దత్  జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా , కొన్ని కల్పిత పాత్రలతో .. 3 ఇడియట్స్  వంటి సంచలన సినిమా తీసిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో .. భారీ ప్లాపులతో, రేస్ లో వెనుకబడిన రణబీర్ కపూర్ హీరోగా  నిర్మించిన 'సంజు ' సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో విడుదలయ్యింది. 




కథ: సంజయ్ దత్  తన ఆత్మకథ రాయమని విన్నీ ( అనుష్క శర్మ ) ని అడుగుతాడు. ముందు సంజయ్  తీవ్రవాది అనుకుని ఒప్పుకోకపోయినా .. తరువాత ఒక గంట టైం ఇస్తుంది, ఆ గంటలో సంజయ్ తనకు డ్రగ్స్ అలవాటు చేసిన మిత్రుడు (జిమ్ షర్బ్ ) తో ఎలా పరిచయం అయ్యిందో చెపుతూ  విన్నీ ఏడ్చేలా చేస్తాడు, ఆమె ఒప్పుకుంటుంది కానీ .. సంజయ్ ప్రాణ మిత్రుడు
 ' కమలేష్ ' సంజయ్ కి దూరమయ్యాడని తెలుసుకుంటుంది.   మళ్ళి  సంజయ్ ఆత్మకథ రాయనంటుంది. ఇంతలో సంజయ్ కు అక్రమ ఆయుధం కలిగి ఉన్నందుకు 6 ఏళ్ళు జైలు శిక్ష విదిస్తుంది కోర్ట్. విన్నీ చివరికి సంజయ్ ఆత్మకథ రాసిందా ? కమలేష్ విన్నీ కి ఎం చెప్పాడు? సునీల్ దత్  సంజయ్ జీవితం లో ఎలాంటి పాత్ర పోషించాడు ? సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు: రణబీర్  సంజయ్ దత్  పాత్రలో ఒదిగిపోయాడు, మాదకద్రవ్యాల బానిసగా .. తల్లి తండ్రి .. కుటుంబం కోసం ఆలోచించే వాడిగా.. జైలు లో ఖైదీగా .. జీవించాడు. అనుష్క శర్మ ఉన్నంతలో అలరించగా, దియా మీర్జా , మనీషా కొయిరాలా పాత్రలు  చాలా చిన్నవి. ఇక సినిమాలో అతి ముఖ్య మైన పాత్రలు  పరేష్ రావెల్ , విక్కీ కౌశల్ పోషించారు. పరేష్ రావెల్ అద్భుతం .. విక్కీ కౌశల్ అదరగొట్టేసాడు. సంజయ్ పాడైపోతున్నాడని .. కమలేష్ , సునీల్ దత్  తో చెప్పే సీన్ ఒక్కటి చాలు .. వాళ్ళ ఇద్దరి నటన గురించి చెప్పుకోడానికి. సోనమ్ కపూర్ ఉన్న సీన్స్ లో పరవాలేదనిపించింది, బోమన్ ఇరానీ పాత్ర ఉన్న సీన్  డబుల్ మీనింగ్ తో ఉండి అంతగా ఆకట్టుకోదు. షాయాజీ షిండే , డ్రగ్స్ అమ్మేవాడిగా జిమ్ షర్బ్  ఉన్నంతలో బాగా చేసారు. నేనింతే  సినిమాలో హీరోయిన్ .. సియా ఈ సినిమాలో సంజయ్ చెల్లిగా  అనవసరపు పాత్ర చేసింది .

సాంకేతికవర్గం: రాజ్ కుమార్ హిరానీ  ఈ సినిమా ని నిజాయితీగా తీసాడు, సంజయ్ మీద ప్రేక్షకులకున్న సందేహాలన్నీ ఈ సినిమాతో కొంతవరకు తుడిచేసాడు హిరానీ . సంజయ్ జీవితం లో జైలు, తండ్రి,స్నేహితుడు,బాబ్రీ గొడవలు  తీసుకున్నాడు. సంజయ్ నటనా జీవితం, వ్యక్తిగత జీవితం లో ప్రేమ , పెళ్లి వంటివి వదిలేసాడు. ఇది సంజయ్ జీవితం లో కొన్ని కోణాలు మాత్రమే స్పృశించిన సినిమా. అందుకే కొన్ని చోట్ల మాత్రమే కంట తడి పెట్టిస్తాడు. మనసుకు హత్తుకునే సన్నివేశాలు .. చాలా తక్కువ , కానీ ఒక జీవితాన్ని చూసాం అన్న భావన కలిగిస్తాడు దర్శకుడు. సంజయ్ ని తండ్రి కాపాడుకునే తీరు, తండ్రి .. కొడుక్కి పాటల రూపం లో ధైర్యం నూరిపోయ్యడం .. రాజ్ కుమార్ హిరానీ మార్క్. ఎడిటింగ్ కష్టమైనా .. సినిమా బోర్ కొట్టించకుండా చేసాడు హిరానీ. రవి వర్మన్  కెమెరా.. విక్రంగైక్వాడ్ మేకప్ .. ఆర్ట్ .. ఉన్నతంగా ఉన్నాయి.   సినిమాలో చెప్పుకోతగిన ..పాట  ' కర్ హర్ మైదాన్ ఫతే " . రహమాన్ స్వరపరిచిన ' రూబీ ' పాట  సినిమాలో రెండు లైన్ లే వినిపిస్తాయి. సినిమాలో పాటలు అడ్డంగా రాకుండా దర్శకుడు చాలా జాగ్రత్తపడ్డాడు. సంజయ్ తుపాకులు ఎందుకు కొన్నాడో.. మాఫియా తో ఎలాంటి సంబంధాలున్నాయి ? సంజయ్ పత్రికల యెల్లో జర్నలిజం కి ఎలా బలయ్యాడో దర్శకుడు తన స్టైల్ లో చెప్పాడు.



సంజయ్ దత్  జీవితం లో కొన్ని అద్భుత కోణాలు .. చూసి తీరాల్సిందే. 


సినిమా చూసినది : ఆసియన్ మల్టీప్లెక్స్  ( ఉప్పల్) ( సూపర్)


1 comment:

ADD