RX100 ముద్దుల పోస్టర్లు , సెక్స్ సీన్స్ ఉన్న ట్రైలర్ లతో .. యువతను బాగా ఆకట్టుకున్నది. అర్జున్ రెడ్డి తరహా లో విచ్చల విడి శృంగారం,ప్రధాన అంశం అని .. సినిమాకి కావాల్సినంత ప్రచారం చేసుకున్నారు. థియేటర్ల కు యువత తొలిరోజు పరుగులెత్తి వచ్చి, బ్లాక్ లో టిక్కెట్లు కొనుక్కుని సినిమా చూసేలా చేసారు. ఇక ఈ సినిమా ఎలావుందో చూద్దాం.
కథ: శివ అనే యువకుడు ఇందు అనే పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రెసిడెంట్ అయిన ఇందు తండ్రి ఆమెకు వేరే అబ్బాయితో పెళ్లి చేసేస్తాడు. పెళ్లి అయ్యి 3 సంవత్సరాల తరువాత తిరిగి వచ్చిన ఇందుని .. శివ తన తో వచ్చేయమంటాడు. ఈ లోగా శివ పై హత్యాయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం లో శివకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేమిటో సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటులు: శివ గా కార్తికేయ నటించాడు. ఫేసులో రెండు మూడు ఎక్స్ప్రెషన్స్ తప్ప .. చెప్పుకోతగ్గ నటన ఏమి ప్రదర్శించలేకపోయాడు. హీరోయిన్ ని బంధించి మాట్లాడే సన్నివేశంలో , చివర ఫైట్ సీన్ లో,క్లైమాక్స్ లో తేలిపోయాడు. హీరో ఫేస్ కూడా హీరో మెటీరియల్ ల అనిపించలేదు.
హీరో సినిమా ఆరంభం లో " దూలెక్కింది " అని చెప్పే డైలాగ్ ..ఈ సినిమాలో హీరోయిన్ కు కరెక్టుగా సూట్ అవుతుంది. ఆమె కామంతో హీరో మీద పడిపోవడం.. చాలా బాగా చేసింది. హీరో కంటే .. హీరోయిన్ కు ఎక్కువ మార్కులు వెయ్యొచ్చు. హీరోయిన్ పాయల్ అందాలు ఆరబోసి ప్రేక్షకులను ఆరిపించింది. రావు రమేష్,రాంకీ ఇద్దరు ఉన్న సీన్స్ లో బాగా చేశారు. మిగిలిన అందరు చక్కగా నటించారు.
సాంకేతికవర్గం:సినిమాలో డైలాగ్స్ చాల బాగా రాసారు . ముఖ్యంగా హీరోయిన్ హీరోతో " నువ్వు మాట్లాడకు.. మా ఇంట్లో చెప్పి నేనే అన్ని సెటిల్ చేసేవరకు " అని చెప్పే డైలాగ్స్ సహజంగా ఉన్నాయి. మోసం చేసే అమ్మాయిలు నిజంగా ఇలాగె మాట్లాడతారు. రావు రమేష్ కూతురిని తిట్టే సన్నివేశంలో డైలాగ్స్ అద్దిరిపోయాయి. అందుకే ప్రేక్షకులు డైలాగ్స్ వినపడని రేంజ్ లో థియేటర్లో అరుస్తున్నారు.పాటలు రెండు బాగానే ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో వీక్.
కెమెరా చాలా బాగా తీశారు, ఎడిటింగ్ లో చాలా లోపాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో చాలా సినిమా ఎడిటింగ్ చెయ్యాలి , హీరోని రైస్ మిల్లు లో పెట్టి చావబాదుతూ .. ప్రేక్షకుల్ని థియేటర్లో చావబాదారు.
ఇక డైరెక్టర్.. సినిమాని ఆర్టిస్టిక్గా, రియలిస్టిక్ గా తీద్దామనుకున్నాడు .. కానీ సినిమా కమర్షియల్ గా ఉంది. క్లైమాక్స్ లో హీరోయిన్ ని చంపేయమని హాల్ లో జనం అరుస్తున్నారు . కానీ డైరెక్టర్ సేఫ్ గేమ్ ఆడాడు. తెలుగోడు అనిపించుకునే క్లైమాక్స్ ఇచ్చాడు.దానితో సినిమా రొటీన్ రొట్ట అయ్యి కూర్చుంది. చివర్లో ఇది నిజ జీవితంలో జరిగిన కథ అని , వాస్తవంలో శివ ఫోటో చూపించారు.. అప్పటికే చిరాకుతో ఉన్న ప్రేక్షకులు .. ఏ ఫీలింగ్ లేకుండా థియేటర్ బయటకు పోయారు.

హీరో హీరోయిన్ .. ఊరిలో తిరుగుతూ..ఎక్కడపడితే అక్కడ .. శృంగారం జరుపుతూఉంటె ,ఒక్కరు కూడా గుర్తుపట్టి హీరోయిన్ తండ్రికి చెప్పరా ? (రాజముండ్రి బ్రిడ్జి ).
RX 100 సినిమా .. ఒక్కసారి చూడొచ్చు.
సినిమా చూసినది: 70/- శ్రీనివాస (ఉప్పల్)
చండాలం థియేటర్. సినిమా హాల్ లో ఎదురు సీట్ లో కూర్చున్న వ్యక్తి తల అడ్డంగా వచ్చి .. సినిమా కనపడక, ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. విడ్డూరం ఏంటంటే .. ఇది జరిగింది నేల క్లాసులో కాదు.. రిసెర్వెడ్ క్లాస్ లో .

No comments:
Post a Comment