కార్తీ హీరోగా , పాండిరాజ్ దర్శకత్వం లో .. సూర్య నిర్మాణంలో .. రైతు కుటుంబం నేపథ్యంలో .. నేడే విడుదలయ్యింది " చినబాబు ''. ఖాకీ లాంటి ప్రయోగం తో హిట్ కొట్టిన కార్తీ, హీరోయిజం కంటే కథ కే ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు చేస్తుండటం విశేషం. రైతు కుటుంబాల నేపధ్యం ఎన్నుకోవడం కార్తీ యొక్క గొప్ప విజయం.
కథ: చినబాబు తండ్రికి ఇద్దరు పెళ్ళాలు . చినబాబుకు అయిదుగురు అక్కలు, అయిదుగురు అక్కల్లో ఇద్దరికీ అమ్మాయిలు. చినబాబుకు ఇచ్చి పెళ్ళిచేయాలనుకున్న అక్కల ఆశలను ఆవిరిచేస్తాడు చినబాబు. నీల అనే అమ్మాయిని ప్రేమిస్తాడు చినబాబు. మరోవైపు నీల మేనమామ తో చినబాబుకు వైరం. ఇన్ని ఆటంకాలను చినబాబు ఎలా ఎదుర్కొన్నాడో తెరమీద చూడాలి.
నటీనటులు: కార్తీ హీరోగా చక్కగా నటించాడు. వెంకటేష్ చేసే సినిమాలకు .. కార్తీని ఎంచుకోవచ్చు. అక్కలమధ్య .. ప్రేయసీమధ్య నలిగిపోతూ .. కుటుంబాన్ని కాపాడుకునే రైతుగా చక్కని నటన ప్రదర్శించాడు. ఇక సయేశా సైగల్ నటించడానికేం లేదు. సత్యరాజ్ , భానుప్రియ,మిగతా ఆర్టిస్టులందరు అద్భుతంగ నటించారు .. మందు తాగే బావలూ , గొడవపడి అక్కలు అద్భుతంగ నటించారు. విలన్ కు అంత ప్రాధాన్యత లేదు. సూరి కామెడీ ఆకట్టుకుంటుంది.
సాంకేతికవర్గం: పాండిరాజ్ కథ కొత్తగలేకపోయిన , కథనం వేగంగా .. అర్ధవంతంగా సాగింది. సినిమా లో సహజంగా సాగే కుటుంబ సన్నివేశాలు పాండిరాజ్ అద్భుతంగ రాసాడు. ఫస్ట్ హాఫ్ లో రైతులకోసం చినబాబు ఇచ్చే స్పీచ్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో .. గుడిలో జరిగే సన్నివేశం కంట తడి పెట్టిస్తుంది.
కెమెరా,లైటింగ్ ,ఎడిటింగ్ చాలాబాగున్నాయి. ఇక సంగీతం ఈ సినిమాకు మైనస్. డి . ఇమ్మన్ సంగీతం లో ఒక్క పాట కూడా అలరించదు, పాటల్లో సంగీతం ..ఒకటే దరువు .. రొమాంటిక్ పాట కు , యుద్ధానికి ఇచ్చే సంగీతం ఇచ్చాడు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కొంత పరవాలేదు. ఆర్ట్ చక్కగా చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివర్లో పెళ్లి కి ..పెళ్ళికొడుకు, గెడ్డం పెంచి .. పెళ్లి చేసుకోవాలా ? కార్తీకి గెడ్డం గీయొచ్చుగా !
కుటుంబమంతా .. సరదాగా చూసేయ్యొచ్చు.
సినిమా చూసినది :40/- శ్రీ కృష్ణ (ఉప్పల్) మిడిల్ క్లాస్ రేంజ్ థియేటర్ - బాగుంది
No comments:
Post a Comment