అరవింద సమేత వీర రాఘవ .. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ తొలి కలయిక. ట్రైలర్ లో కొత్తదనం లేకపోయినా .. త్రివిక్రమ్ మంచి కసితో తీస్తాడని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశించి, థియేటర్ లకు పరుగుతీశారు. క్లాస్ టైటిల్ తో .. మాస్ ఎన్టీఆర్ సినిమా లో ఎంతో కొంత కొత్తదనం త్రివిక్రమ్ చూపిస్తాడని .. క్లాస్ ప్రేక్షకులు కూడా ఒక కన్ను వేసుంచారు. ప్రీమియర్ షో లతోనే రికార్డు తిరగరాయడానికి ఎన్టీఆర్ ఎలా వచ్చాడంటే..
కథ : రెండు ఊర్లు.. ఇద్దరు నాయకులూ.. వాళ్ళ మధ్య ఫ్యాక్షన్ గొడవలు .. ఈ నాయకుల బిడ్డల్లో ఒకడికి (వీర రాఘవ ) గొడవలు ఆపాలని ఆలోచన రావడం, అరవింద ఆలోచనలు రాఘవని నడిపించటం, సీమ లో మార్పు తేవడం.ఎన్నో సినిమాల్లో చుసిన కథే...
నటీనటులు: ఎన్టీఆర్ .. ఈ సినిమాలో అద్భుతంగ కొన్ని సన్నివేశాల్లో నటించాడు.. ఎమోషనల్ సన్నివేశాల్లో కొత్తగా నటించలేకపోయిన ... త్రివిక్రమ్ మార్క్ కామెడీ సీన్స్ లో క్లాస్ గా.. కొత్తగా కనిపించాడు. హీరోయిన్ స్పేస్ కావాలంటే ... ఈ సైడ్ మొత్తం తీసేసుకో అనే సీన్.. ఉదాహరణ. మర్డర్ చేసిన తరువాత కత్తి పట్టుకుని నేలను చూస్తూ కూర్చునే సీన్ 'దమ్ము ' నుండి .. ఈ సినిమా వరకు ఎన్టీఆర్ ఒకేలా చేసాడు. డైలాగ్ డెలివరీ లో ఏమి కొత్తదనం లేదు. పూజ హెగ్డే కి మంచి పాత్ర లభించింది, కొంచం సైకో లక్షణాలు ఉన్న పాత్ర .. బట్ రాఘవకి కలిసి వస్తుంది. నరేష్,శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర కామెడీ బాగుంది. ఈషా రెబ్బ సినిమాలో వేస్ట్ పాత్ర చేసింది. దేవయాని,ఈశ్వరి రావు ఒక్కొక్క సీన్ తప్ప చేసిందేం లేదు. సునీల్ కామెడీ మానేసి క్యారక్టర్ ఆర్టిస్టుగా ఈ సినిమా లో కనిపించాడు. రావు రమేష్ ,శుభలేఖ సుధాకర్.. పర్వాలేదు. జగపతిబాబు మాత్రం .. ఏ మాత్రం ఉపయోగపడని క్యారక్టర్- విల్లన్ గా ఈ సినిమాలో చేసాడు. లెజెండ్ లో కొత్తలో బాగుందనిపించింది.. చూసి చూసి జగపతిబాబు .. సాఫ్ట్ విల్లన్ గా ఓకే ..కానీ ఇలాంటి మాస్ విల్లన్ గా మాత్రం నప్పలేదు. బాగా చేసినప్పటికీ .. హీరోగా చుసిన జగపతిని ఈ విల్లన్ రొల్స్ లో చూడలేం. మెత్తని పకోడికి .. గట్టిపకోడీ డ్రెస్ వేసినట్లున్నాడు జగపతిబాబు. నవీన్ చంద్ర రొటీన్. స్త్రీ పాత్రలకు ఏమంత ప్రాధాన్యత లేదు ఈ సినిమాలో , ఒక్క హీరోయిన్ కు తప్ప.
సాంకేతికవర్గం: ఫైట్ తో సినిమా అద్భుతంగ ప్రారంభవుతుంది.రామ్ లక్ష్మణ్ ఫైట్స్ చాలా బాగా అల్లారు. ఇంటర్వెల్ ఫైట్ కూడా సూపర్బ్. కెమెరా చాలా బాగుంది. థమన్ బ్యాగ్రౌండ్ సినిమాకి కలిసివచ్చింది. ఆర్ట్ లో .. సునీల్ గ్యారేజ్ లో బెడ్ సెట్ చాలా బాగా చేసారు. జగపతిబాబు ఇల్లు మాత్రం సెట్టింగ్ ల తెలిసిపోతుంది.నవీన్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో చాలా చెయ్యాలి. తొలిసగం యిట్టె అయిపోతుంది. కొంచెం ఆకు కామెడీ, ఎన్టీఆర్ నటన,త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమా ని కాపాడాయి. .
మలి సగం ప్రారంభం నుండి సినిమా నత్తనడకన సాగిపోయింది. తోలి సగం లో హీరోయిన్ స్పూర్తితో మారిన హీరో.. సెకండ్ హాఫ్ లో కూడా .. హైదరాబాద్ లో ఉండి , ఫోన్ లో బ్లాక్మెయిల్ చేసి కాపాడుతుంటాడు.బ్లాక్మెయిల్ కూడా ఒక రకమైన వయోలెన్స్ కాదా? అసలు సమస్య సీమలో ఉంటె .. అక్కడకు వెళ్లకుండా .. మినిస్టర్ చుట్టూ తిరుగుతుంటాడు హీరో . హీరో సీమకేల్లె సరికి సినిమా అయిపోతుంది . క్లైమాక్స్ లో సీమకెళ్లి మళ్లి .. బసిరెడ్డిని చంపుతాడు. ఇక్కడ త్రివిక్రమ్ తెలివి తేలిపోయింది.. రొటీన్ గా మళ్లి వయోలెన్స్ వైపు హీరో వెళ్లడం తప్పు. హీరో విల్లన్ మధ్య ..గొప్ప సన్నివేశాలు లేకపోవడం .. వాళ్ళు కలవడమే రెండు సార్లు అవడం .. మరో మైనస్ .
త్రివిక్రమ్ సెకండ్ హాఫ్ లో పూర్తిగా పట్టు కోల్పోయాడు అని చెప్పడానికి .. సెకండ్ హాఫ్ లో వచ్చే పెని విటి పాట ఉదాహరణ. ఆపాట ఒక సమయం .. సందర్భం లేకుండా.. బలమైన సన్నివేశం లేకుండా .. అతికించినట్లు వస్తుంది. కనీసం పూజ(సీమ గురించి రీసెర్చ్ చేసే స్టూడెంట్) కి తన తల్లి గురించి చెప్తూ పాడితే .. ఓకే అనుకోవచ్చు, హీరోయిన్ చెల్లి తో .. సొల్లేస్తూ పాడతాడు. ఇక రెడ్డి పాట అయితే .. ఎంత త్వరగా అయిపోతే బాగుండును అనిపిస్తుంది.డాన్స్ లు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాత కథకి .. కొత్త కథనం సరిగ్గా ఇవ్వలేకపోయాడు త్రివిక్రమ్.
వినాయక్..పూరీజగన్ .. ఇద్దరు పడిపోయి ..లేవలేని స్థితిలో ఉండగా.. వాళ్ళకు తోడుగా .. త్రివిక్రమ్ చేరాడు !
నిజం.. !ఎందుకంటే .. ఒక హత్తు కునే సన్నివేశం .. మంచి పాట .. హాస్యం.. ఆలోచింపచేసే మాటలు లేని త్రివిక్రమ్ సినిమా .. ఏ తెలుగు ప్రేక్షకుడు ఊహించగలడు. ఈ సినిమా అలాగే ఉంది. జులాయి లాంటి బ్రెయిన్ లెస్ సినిమా తీసి, సన్ అఫ్ సత్యమూర్తి లాంటి స్పీచ్ థెరఫీ సినిమాలు రుద్ది .. అర 'విందు'లాంటి ఈ సినిమా తీసి త్రివిక్రమ్ గురూజీ ఎలా అవుతాడు? అగ్న్యాత వాసి పరాజయం నుండి ఎం నేర్చుకున్నాడు ?
అరవిందే .. పూర్తి విందు కాదు.
సినిమా చూసినది: సాయిరాజ - ముషీరాబాద్ - హైదరాబాద్ (40/-)

No comments:
Post a Comment