add

Thursday, 27 September 2018

మణిరత్నం - నవాబ్ - 2018 రివ్యూ RATING 3.5/5

మణిరత్నం .. ఈ పేరు చెపితే సినిమా ప్రేక్షకుడి మనస్సు ఉరకలేస్తుంది . టెక్నాలజీ మాత్రమే వాడుకునే వర్మ లా కాకుండా .. టెక్నాలజీ తో పాటు భావోద్వేగాలను కథకు అద్ది, సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు మణిరత్నం. వరుస పరాజయాలతో ఉన్న మణిరత్నం చాలా రోజులతరువాత, నవాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమా కు మణిరత్నం ఆస్థాన కెమరామెన్ సంతోశ్శివన్ , సంగీత దర్శకుడు రెహమాన్ పనిచేశారు. 

కథ: సిటీ లో పెద్ద దాదా అయిన ' భూపతి ' మీద హత్యాప్రయత్నం జరుగుతుంది. భూపతి చిరకాల శత్రువైన చిన్నప్ప మీద అనుమానం అందరికి కలుగుతుంది, కానీ భూపతి పై హత్యాప్రయత్నం చేసింది తన ముగ్గురు కొడుకుల్లో ఒకరు అని .. భూపతి తెలుసుకుంటాడు. భూపతి ముగ్గురుకొడుకులు నిజంగానే తండ్రి తరువాత స్థానం కోసం ఎదురుచూస్తుంటారు .. భూపతి  చనిపోగానే .. ముగ్గురు కొడుకులు వారసత్వం కోసం పోరాటం ప్రారంభిస్తారు. .. చివరికి ఎవరు గెలిచారు అన్నది తేర మీద చూడాలి . 

నటీనటులు : వరదాగా అరవిందస్వామి అద్భుతంగ నటించాడు.. త్యాగి , రుద్రా పాత్రల్లో అరుణ్ ,శింబు మంచి నటన కనబరిచారు .. రసూల్ పాత్రలో విజయ్ సేతుపతి నటన అద్భుతం. ప్రకాష్ రాజ్ , జయసుధ పాత్రలు హుందాగా సాగాయి. జ్యోతిక,ఐశ్వర్య రాజేష్ ( కమెడియన్ శ్రీలక్ష్మి తమ్ముడు రాజేష్ కూతురు),అదితిరావ్ హైదరి ఉన్నంతలో నటించారు.చెప్పుకోతగ్గ స్త్రీ పాత్రలేమి లేవు ఈ సినిమాలో. జ్యోతిక అక్కడక్కడా చంద్రముఖిల నటించి తానే విల్లన్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. త్యాగరాజన్,మన్సూర్ అలీఖాన్ వి చాలా చిన్న పాత్రలు. 

సాంకేతికవర్గం: సంతోష్ శివన్ కెమెరా తోలి ఫ్రేమ్ నుండే ఆకట్టుకుంటుంది. తుపాకీ,స్పయిడర్ సినిమాల్లో కలరింగ్ ఛండాలంగా ఉండి .. సంతోష్ లైటింగ్ మిస్ అయ్యింది. ఈ సినిమాలో అద్భుతమైన లైటింగ్ చేసాడు సంతోష్. రెహమాన్ పాటలు ఈ సినిమాలో ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. సినిమాలో బ్యాగ్రౌండ్ లో వచ్చేవే అన్ని పాటలు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం రెహమాన్ అద్భుతంగ చేసాడు.. సెగలు చిమ్ముతుంది ... అని సాగే బ్యాగ్రౌండ్ సాంగ్ బాగుంది. భగ  భగ  అంటూ సాగే బ్యాగ్రౌండ్ స్కోర్  వెంటాడుతుంది. ఎడిటింగ్ ఇంకా  కొంత చెయ్యాలి.ఆర్ట్ బాగుంది. మణిరత్నం ఎప్పటిలాగే సినిమా నెమ్మదిగా తీసాడు, క్లైమాక్స్ ఈ సినిమా కి హైలైట్. ఎవ్వరు ఊహించని క్లైమాక్స్ .  కొన్ని మాత్రం మణి  క్లారిటీ ఇవ్వలేకపోయాడు.  అసలు భూపతికి .. తన మీద హత్య ప్రయత్నం చేసింది కొడుకే అని ఎలా తెలిసింది?. భూపతి కుర్చీ కోసం ఎందుకు ముగ్గురు కొడుకులు పాకులాడటం .. (పెద్ద పెద్ద బిజినెస్ లు చేస్తూ). ఈ టైపు కథలు మనకు కొత్తేమి కాదు. బాహుబలి కూడా ఈ టైపు కథే .. అయినా మణిరత్నం ముందు సినిమాలకంటే ఈ నవాబ్ భేష్ అనిపిస్తాడు. ఆపరేషన్ రెడ్ స్కై .. అని ఈ సినిమాకి పేరు పెడితే బాగుండును . తమిళం లో'చెక్క చివంత  వానం ' (తమిళ టైటిల్ )అంటే అర్థం అదే.. 


ఒక్కసారి చూడొచ్చు !

సినిమా చూసినది : spl cinemas - mallapur ( super theatre- high clarity projection- dolby atmos)
 

No comments:

Post a Comment

ADD