add

Thursday, 29 November 2018

2.0 రోబో తెలుగు రివ్యూ 2018 by PHANI MAROJU RATING - 4 / 5

2.0 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లకు .. లేనివాళ్లకు .. 2.0 గురించి మొత్తం తెలుసు. శంకర్ - రజిని - రెహమాన్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.ఎన్నో అడ్డంకులను దాటుకుని, భారీ నిర్మాణంతో .. బ్రహ్మాండంగా ఈరోజు విడుదలయ్యింది. ప్రేక్షకులకు 'టెక్నికల్ వండర్ 2. 0' అని శంకర్ చెప్పినట్లుగానే .. ట్రైలర్ ఉండటం .. అంచనాలను పెంచేసింది. 2, 0 ఎలా ఉందంటే .. 


కథ- పక్షిరాజు (అక్షయ్) పక్షులను ప్రేమిస్తుంటాడు.. అతని పుట్టుక ఒక పిచ్చుకవలన జరగడం అతనికి పక్షుల మీద ప్రేమ పెరిగేలా చేస్తుంది. కానీ సెల్ ఫోన్ టెక్నాలజీ వలన , చనిపోతున్న పక్షులను కాపాడటానికి పక్షిరాజు .. సెల్ టవర్ ఫ్రీక్వెన్సీ తగ్గించమని కోరుకుంటాడు. కానీ లంచం తీసుకుని కమ్యూనికేషన్ మినిస్టర్ పట్టించుకోడు. కోర్టులో కూడా పక్షిరాజు ఓడిపోయి, ఆత్మహత్య చేసుకుంటాడు. పక్షిరాజు యొక్క ఆరా ( మనిషి చుట్టూ ఉండే కంటికి కనపడని తరంగాలు).. చనిపోయిన పక్షుల ఆరా తో కలిసి ఒక పెద్ద ఆరాగా మారి .. సెల్ల్ఫోన్స్ వాడుతున్న వారిపైకి  విరుచుకు పడతాయి. పక్షి రాజునుండి కాపాడమని ప్రభుత్వం మిలిటరీ ని పంపితే . పక్షిరాజు ముందు మిలిటరీ ఓడిపోతుంది. ఇక సైంటిస్ట్ వసీ .. తన రోబో లైన చిట్టి,వెన్నెల(అమీ జాక్సన్ ),2. 0 మరియు 3. 0 లతో రంగం లోకి దిగి ఎలా ప్రజలను కాపాడాడు అనేది కథ. 
నటీనటులు - రజిని నాలుగు రకాల పాత్రలను అద్భుతంగ పోషించారు. వశీకరన్,చిట్టి,2,0, 3.0 ఇలా నాలుగు పాత్రలు జీవంపోశారు రజిని.. 3. 0 పాత్ర అయితే వచ్చిన వెంటనే అందరిని ఆకట్టుకుంటుంది. దానికి ఇచ్చిన వాయిస్ ప్రత్యేకం. అక్షయ్ కుమార్ కూడా.. ముసలి వాడిగా , పక్షిగా, కాకి మనిషిగా బాగా నటించాడు. సెకండ్ హాఫ్ లో వచ్చినా కూడా , అక్షయ్ పాత్ర మనకు గుర్తుండిపోతుంది. అమీ జాక్సన్ సినిమా అంతా  ఉన్నా .. చెప్పుకోతగ్గ సీన్ లేదు. అందాలు ఆరబోయడానికి పాటల్లేవు.మిగిలిన అందరు చిన్న చిన్న పాత్రలే.. ఒక్క ఆదిల్ హుస్సేన్ ఒక్కడే ముఖ్యమంత్రిగా కొంత మేరకు గుర్తుంటాడు. 

సాంకేతికవర్గం - ఈ సినిమా గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమా .. కొన్ని చోట్ల అద్భుతం అనిపించే గ్రాఫిక్స్ ఉన్నాయి. కొన్ని మాత్రం చాలా కంగారు పడి  చేసినట్లున్నారు. అక్షయ్ కుమార్ .. సెల్ ఫోన్ గుడ్డులోంచి రావడం అద్భుతంగ  తీస్తే. చిట్టి పక్షి తో తలపడుతూ ..బిల్డింగ్ ఎక్కి దూకే సన్నివేశంలో గ్రాఫిక్స్ చాలా తక్కువ క్వాలిటీ తో ఉన్నాయి. 
రెహమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎందుకూ ఉపయోగపడదు. రండాలి .. పాట  తప్ప ఒక్క చోట కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోదు. పక్షిరాజుకు ఎదో ఒక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ డిజైన్ చేసినా ..  అది వినపడని రేంజ్ లో ఉండి ..  చెవులకెక్కదు.రోబో సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అప్పుడప్పుడు వచ్చి ..రెహమాన్ ను గుర్తుచేస్తుంది.  ఎడిటింగ్ , నిరవ్ షా కెమెరా అద్భుతం. శ్రీ రామ కృష్ణ మాటలు అక్కడక్కడా ఆకట్టుకుంటాయి .. శ్రీమంతుడు డైలాగ్ , అన్నం తినే చెయ్యిని నరుక్కుంటామా .. లాంటివి . పక్షుల అవసరం మానవులకెంత ఉందొ ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. 

శంకర్ కథ సామాజిక స్పృహతో రాసుకున్నాడు. కానీ పక్షిరాజు  గతం ఏమాత్రం ప్రేక్షకుడి ని ఆకట్టుకోలేదు. పక్షిరాజు పక్షుల కోసం పడే బాధను ..శంకర్ ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చెయ్యలేకపోయాడు.పక్షిరాజు గతాన్ని చుట్టేద్దామనే  హడావిడి ఎక్కువ కనపడింది. అదే ఈ సినిమాలో మైనస్ పాయింట్. 
రెండున్నర గంటల సినిమా చాలా ఇంట్రెస్టుగా చూసేలా శంకర్ అద్భుతంగ  స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ అయితే ఎన్ని సార్లు చుసినా బోర్ కొట్టదు . ఆర్ట్,దుస్తులు సినిమా కి కళ ను తెచ్చాయి.నిర్మాత ఖర్చుపెట్టడానికి అస్సలు వెనకాడలేదని సినిమా చూస్తే తెలుస్తుంది. 

సినిమాలో చాలా చోట్ల తెలుగు డబ్బింగ్ కి తగినట్లుగా పేర్లు మార్చలేదు, పక్షి రాజు అని వినపడుతున్నా .. తెర  మీద పక్షిరాజన్ అని పేరు కనపడుతుంటుంది. సినిమా మొత్తం తమిళ్ నాడులోనే జరిగినట్లు చూపించారు.  కానీ బ్యాగ్రౌండ్ లో మహేష్ బాబు ఐడియా యాడ్స్ ఉండటం విశేషం. 

3D - ఈ సినిమా త్రీడి కెమెరాతో తీసిన సినిమా. త్రీడి లో ప్రేక్షకుల మీదకు సినిమాలో వస్తువులు వచ్చిపడుతున్న ఫీలింగ్ కలుగుతది . ఈ సినిమాలో కొన్ని చోట్ల మాత్రమే .. ఆ ఫీలింగ్ కలుగుతుంది. 
1. డ్రింక్ బాటిల్ రోబో ఇచ్చినపుడు. 
2. సెల్ ఫోన్స్ రోడ్ మీద పాకుతూ రావడం చుసిన కుక్క (క్లోసప్)
3. స్టేడియం లో 2. 0 గన్స్ ఫైర్ చేసినప్పుడు.బుల్లెట్స్ మీద పడతాయి.  
మిగిలిన చోట్ల లో డెప్త్ తప్ప ఏమి అంత గొప్ప 3డి  ఎఫెక్ట్స్ ఉండవ్. 

2 డి లో చుసినా ,  ఏమి ఇబ్బంది ఉండదు. మిస్ అయ్యేది ఉండదు. 

టాప్ సీన్స్ -
1. పక్షిరాజు వశీకరన్  లోకి వెళ్ళాక వచ్చే సీన్ అద్భుతం. శంకర్ మాత్రమే తీయగలిగే సీన్. VF X  అయితే అద్భుతం. ఇక్కడ బ్యాగ్రౌండ్ లో మహేష్ బాబు ఐడియా యాడ్స్ చూడొచ్చు. 

2. మాగ్నెటిక్ మోడ్ లోకి మారిన 2.O  కార్, బస్సు లను 8 ప్యాక్ చేసుకుని ఫైట్ చేయడం. 

3. 3.0 ఉన్న సీన్స్ అన్ని టాప్ . చిన్న పిల్లల కోసం స్పెషల్. యాంట్ మాన్ లా .. 

గమనిక - సినిమా చివరలో పాట  అయ్యాక ఒక సూపర్ సీన్ ఉంది . అది మిస్ కాకండి. 

మరో శంకర్ అద్భుతం . 
సినిమా చూసినది - SPI CNEMAS -MALLAPUR( BEST THEATRE)
                                       10 AM (2D) & 1.25 PM (3D)


No comments:

Post a Comment

ADD