అద్భుతమైన హైప్ తో .. రాజమౌళి సపోర్ట్ తో .. కన్నడ భారీ బడ్జెట్ సినిమా
' కెజిఫ్ ' తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ఈరోజు మంచి ఓపెనింగ్స్ తో .. షో షో కి జనాలను పెంచుకుంటూ పోతున్నది. ఈ సినిమా అందరి అంచనాలు అందుకుందా ?లేదా!
కథ - రాకీ ఒక గూండా .. బొంబాయి నుండి బెంగళూరు వచ్చి .. గరుడ అనే ఒక పెద్ద రౌడీని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. అతన్ని చంపడానికి కెజిఫ్ బంగారు గనుల్లోకి వెళ్తాడు. గరుడని చంపడానికి గనుల్లోనే ఉంటూ .. ప్లాన్ వేస్తుంటాడు. గనుల్లో బానిసల్లా బ్రతుకుతున్న అందరికి .. ఎలా విముక్తి కలిగించాడు .. గరుడని ఎలా చంపాడు ? .. అనేది ఈ కెజిఫ్ తొలి భాగం.
నటీనటులు - హీరో యాష్ .. నటించాడు . అంతే . అన్ని సీన్ లలో ఒకటే ఎక్స్ప్రెషన్ . సినిమాలో ఒకే మొహం లో ఒకే భావం చూస్తూ .. రెండున్నర గంటలు గడపటం కష్టం. తమిళ్ విజయ్ ఆంటోనీ ఈ టైపు నటన తో చంపుతుండగా .. యాష్ కూడా మరీ అంత కాక పోయిన .. కొంత ఇబ్బంది పెట్టాడు. మన ప్రభాస్ అన్ని భావాలు పలికించలేకపోయిన .. కోపం లో హెచ్చు .. తగ్గు చూపిస్తాడు. యాష్ మాత్రం ఒకటే ... లైట్ కోపం . హీరోయిన్ పరమ వేస్ట్. చూడటానికి కూడా ఎం బాగోలేదు. తమన్నా డాన్స్ .. డ్రెస్ .. పాట కూడా వికారంగా ఉన్నాయి . విల్లన్స్ అందరు ఫిట్గా లేకపోయినా .. అగ్లీ మేకప్ తో పరవాలేదనిపిస్తారు. అనంత్ నాగ్ ఆకట్టుకుంటారు. హీరో తల్లిగా ఆక్ట్ చేసిన అమ్మాయి బాగా ఆక్ట్ చేసింది.
సాంకేతికవర్గం - ఆర్ట్ డైరెక్టర్ ఉన్న బడ్జెట్ లో మంచి అద్భుతమైన సెట్స్ వేసాడు. విల్లన్ పాలస్,కాళీమాత సెట్, కెజిఫ్ సెట్ అద్భుతం. కెమెరా అయితే చాలా బాగుంది. సంగీతం లో .. సలాం రాకీ భాయ్ పాట బాగుంది. మిగిలిన పాటలు బాగోలేదు. ఎడిటింగ్ పాటల్లో అంత బాగోలేదు . ట్రాన్సటిషన్స్ వాడినవి అంత గొప్పగా లేవు. డైరెక్టర్ కథ పాతదే అయినా .. కెజిఫ్ బేక్డ్రోప్ కొత్తగా ఉంది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ అంత తినేసినా .. సెకండ్ హాఫ్ లో లాస్ట్ 30 నిమిషాలు మంచి బిగితో కథనం నడిపాడు. చివరిలో జనం అరుపులు దానికి సాక్ష్యం.
ఫైట్స్ .. చాలా స్పీడ్ గ అయిపోయి .. ఇంపాక్ట్ లేకుండా చేస్తాయి .. హీరో కి ఒక్క దెబ్బ కూడా తగలదు. హీరో ఒక్క గన్ తో ..ఎదురుగ జీపుల్లో గన్స్ పట్టుకుని వస్తున్న అందర్నీ పిట్టల్లా కాల్చేస్తుంటాడు. హోంబేలె ఫిలిమ్స్ మంచి బడ్జెట్ ఖర్చుపెట్టింది.
కన్నడ సినిమాల్లో ... టగరు సినిమా తరువాత టెక్నికల్గా బాగున్నా సినిమా ఇది. ఒక్కసారి చూడొచ్చు.
కొసమెరుపు - రాకీ వాడే బైక్ చూస్తే 1980 లో ..తయారు చేసిన బైక్ లాగ కనపడదు. రీసెంట్ నైక్ బైక్ లా ఉంది.
సినిమా చూసినది - శ్రీ కృష్ణ (ఉప్పల్) - హైదరాబాద్
PLUS POINTS
CAMERA ARTYASHBAGROUND MUSIC
MINUS POINTS
OLD STORY
HERO WITH SINGLE EXPRESSION
HEROINE
SONGS
TAMANNA ITEM SONG
WEAK VILLIANINSM
EMOTION LESS
No comments:
Post a Comment