add

Friday, 21 December 2018

ANTHARIKSHAM TELUGU MOVIE REVIEW IN TELUGU - RATING 2 / 5 BY PHANI MAROJU

సంకల్ప్ 'ఘాజి' సినిమా తీసి పాపులర్ అయ్యాడు. రెండో సినిమా అంతరిక్షం తీసాడు. ఇటువంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలకి తెలుగులో అంత ఆదరణ ఉండదు. ఎందుకంటే ... సాంకేతికంగా అందరికి అవగాహన ఉండదు. కనుక అరటి పండు వలిచి .. నోట్లో పెడితేగాని తినలేని తెలుగు ప్రేక్షకులకు ... సంకల్ప్, వరుణ్ ఈ అంతరిక్షం పెట్టారు. ఎలా ఉంది అంతరిక్షం? 

కథ - దేవ్ అనే ఇండియన్ స్పేస్ సైంటిస్ట్ .. అవసరం వచ్చి  .. అతనిని పిలిపిస్తారు ఇండియన్ స్పేస్ సెంటర్ వాళ్ళు . మహీరా అనే సాటిలైట్ ని ఫిక్స్ చేయడానికి దేవ్  బృందం రాకెట్ లో పైకి వెళ్లగా ... దేవ్ అనుకోకుండా .. కొత్త ప్లాన్ వేసి రాకెట్ ని చందమామ మీదకు పోనిస్తాడు. ఎందుకలా చేసాడు ? సినిమా చూసి తెలుసుకోవాలి. 

నటీనటులు - వరుణ్ తేజ్ మళ్ళి  లావు అయ్యాడు.  రొటీన్ గా నటించాడు .  అదితి .. లావణ్య పాత్రలు కొత్తగా అనిపించవు. సత్యదేవ్ డ్యూయల్ రోల్ ఎందుకో దర్శకుడికే తెలియాలి. అవసరాల శ్రీనివాస్ , రెహమాన్ ఇద్దరు మంచి పాత్రలు చేసారు . రాజా ( సీత రామ శాస్త్రి కొడుకు  ) బాగానే నటించాడు. 

సాంకేతికవర్గం- కెమెరా పర్వాలేదు. గ్రాఫిక్స్ చూస్తే సినిమా బడ్జెట్ తెలిసి పోతుంది. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ బాగాలేవు. 
ఇక సినిమా ఫస్ట్ నుండి స్లో గా సాగి.. సాగి.. వెళ్తుంది. తరవాత ఎం అవుతుందో మనకి తెలిసిపోతుంది. ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న హీరో అంతరిక్షం లో నడవడానికి పాట్లు పడుతుంటాడు. క్లైమాక్స్ లో అయితే హీరో సాటిలైట్ లో కి ఎలా వచ్చాడో కూడా తెలియదు ... స్పేస్ సెంటర్ లు ఎలా ఉంటాయో చూడలేని వారు ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఎమోషనల్ కనెక్ట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. ఉత్కంఠత కలిగించే సీన్స్ లేకపోవడం మరో మైనస్. పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. ఎడిటింగ్ ఇంకా చెయ్యాల్సి ఉంది. ఆర్ట్ మాత్రం చాలా బాగా చేసారు. సినిమా లో బడ్జెట్ అని తెలిసిపోతుంది. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకోవడం కూడా ఈ సినిమాకి చేటు చేసింది. 

అంతరిక్షం - అంతా రిస్క్  .... బోర్ 
సినిమా చూసినది - ఆసియన్ (ఉప్పల్)

PLUS POINTS

SPACE BACKDROP
CAMERA

MINUS POINTS

GRAPHICS
CINEMATIC LIBERTY
CLIMAX
PREDICTABLE STORY

No comments:

Post a Comment

ADD