add

Wednesday, 9 January 2019

NTR - KATHANAYAKUDU 2019 TELUGU MOVIE REVIEW RATING - 2.5/5

నందమూరి నట సింహం బాలకృష్ణ  తన తండ్రి ఎన్టీఆర్  పాత్రలో నటిస్తూ నిర్మించిన - ఎన్టీఆర్ సినిమా ఈరోజు బ్రహ్మాండంగా విడుదలయ్యింది. రామారావు జీవితంలో .. సినిమా అంశాలతో నిండిన ఈ భాగానికి .. కథానాయకుడు అని పేరు పెట్టారు. విద్యాబాలన్ బసవ తారకం పాత్రలో  నటించడం ,బోలెడు మంది సినిమా ప్రముఖుల అతిధి పాత్రలు చెయ్యడం... ముఖ్యంగా బాలకృష్ణ స్వయంగా నిర్మించడం.. ఈ సినిమా విశిష్టతలు. 
కథ - రామారావు తన రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలేసి , సినిమాల్లోకి వచ్చి స్టార్ గా ఎలా ఎదిగాడు. అతని నట ప్రస్థానం ఎలా కొనసాగింది. రాజకీయాలవైపు ఎందుకు రామారావు మొగ్గు చూపాడు అన్నది కథ. 
నటీనటులు- బాలకృష్ణ తనదైన శైలిలో అద్భుతంగ నటించాడు. మేజిక్ ఏంటంటే .. ఎన్టీఆర్ ని అనుకరించినట్లు ఎక్కడ కనపడదు .. కానీ ఎన్టీఆర్ లానే అనిపిస్తాడు. మైమరిపిస్తాడు. పాత్రలో లీనమైపోతాడు. ఇక ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ బాగానే నటించినా .. ఆ పాత్రకు అద్భుతమైన సన్నివేశాలు కానీ .. సంభాషణలు కానీ లేకపోవడం తో .. ఆకట్టుకుంటుంది కానీ ..హత్తుకోదు . ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు పాత్రలో దగ్గుబాటి రాజా చక్కగా ఎక్కువ నిడివి ఉన్న పాత్ర చేసాడు. సుమంత్ నాగేశ్వర్రావు పాత్ర లో రొటీన్ నటన ప్రదర్శించాడు. అతని పొడుగు మనకి నాగేశ్వర్రావు ని చూస్తున్న అనుభూతిని కలిగించదు.. కళ్యాణ్ రామ్ ,రానా ఉన్నంతలో ఆకట్టుకుంటారు. మిగిలిన పాత్రలు అన్ని నిడివి చాలా తక్కువ. కామెడీ ఎక్కడ లేని ఈ సినిమా లో వెన్నెల కిశోర్ , బ్రహ్మి వృధా. 
సాం కేతికవర్గం -క్రిష్ సినిమా లు అన్ని కూడా సెకండ్ హాఫ్ లో గాడి తప్పుతుంటాయి. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ పండించడం లో విఫలం అవుతుంటాడు. ఈ సినిమాలో అదే జరిగింది. ఎన్టీఆర్ పాత్ర మీద మనకు గొప్ప హీరో అనే భావం కలిగించడానికి .. 10 గంటలు దశ తలల సన్నివేశం చూపించి ఆకట్టుకున్నాడు. గొప్ప ఫామిలీ మాన్  గా  చూపించడానికి కొడుకు మరణం సన్నివేశం చూపించాడు. కానీ రాజకీయం వైపు మొగ్గు చూపేందుకు ప్రేరేపించే సన్నివేశాల్లో అస్సలు ఎమోషన్ ఉండదు, బాలయ్య ముఖం లో ఎమోషన్స్ పండలేదు. ఒక సన్నివేశం లో ...ఉత్తరాలు చదువుతూ .. ఎన్టీఆర్ ఫీల్ ఎవ్వడు. అవ్వినట్లు మనం అనుకోవాలి. ఎన్టీఆర్ ని చూడాలనుకునే స్త్రీ ఇంటికెళ్తాడు. అక్కడ ఆమె కొడుకు రాజకీయాలకు బలయ్యాడని తెలిసినపుడు ..ఎన్టీఆర్ లో నో ఎమోషనల్ ఫీలింగ్. 
ఇలా దివిసీమ ఎపిసోడ్ లో కూడా మనకు బోర్ కొడతాయి. ఇక్కడే క్రిష్ ఫెయిల్ అయ్యాడు. కొన్ని చోట్ల ఎన్టీఆర్ ఇంత మంచి చేశాడా అనిపిస్తాడు. 

ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాల్లో పాటలు.. సన్నివేశాలు సినిమా కి అడ్డం వస్తుంటాయి. దాన  వీర సూర కర్ణ సీన్ అయితే బాలయ్య తేలిపోయాడు. ఎన్టీఆర్ లోని రాజసం కనపడలేదు. క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. రెండో భాగం  చూడాలనిపించేలా క్లైమాక్స్ ముడి వెయ్యదు. 

మేకప్ కొన్ని చోట్ల బాగుంది. కొన్ని చోట్ల అతికినట్లు లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ యూత్ గెట్ అప్ సూట్ కాలేదు. సీనియర్ గెట్ అప్ అదిరిపోయింది. 
విద్య బాలన్ తొ లి సన్నివేశం లో కళ్యాణ్ రామ్ కంటే అందంగా నున్నగా ఉండే చర్మం తో నిగ నిగలాడుతుంటుంది. 
కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా బలం ఇవ్వగా .. ఆర్ట్ డిపార్ట్మెంట్,కాస్ట్యూమ్స్  పడిన కష్టం తెర మీద కనపడుతుంది. జ్ఞానశేఖర్ కెమెరా క్లాస్ గా ..చాలా బాగుంది.  సినిమాలో ఎన్టీఆర్ పాత్ర మీద మనకు సెకండ్ హాఫ్ లో కనెక్టివిటీ పోతుంది .. స్క్రీన్ ప్లే లో చాలా అనవసరపు సన్నివేశాలు సెకండ్ హాఫ్ ని సాగ దీసాయి . సాయిమాధవ్ బుర్ర  సంభాషణలు ఇచ్చాడు. .కొడుకు కంటే సినిమా గొప్పదా.. , సమాజం నా కొడుకుని మింగేసింది వంటి సంభాషణలు బాగుంటాయి. 

ఒక్కసారి చూడొచ్చు .. ఎన్టీఆర్ మీద గౌరవం తో ఒక్కసారి ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూడాలి. 
కొసమెరుపు - ఎన్టీఆర్ నటించిన పాత సినిమాలు అన్ని 16 MM  ఫార్మటు లో తీసినవి ... ఈ సినిమాలో మాత్రం - తెరమీద 70 MM  వైడ్ స్క్రీన్ ఫార్మటు లో (16-9) ప్రదర్శిస్తుంటారు . బయో పిక్ లు తీసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి 

సినిమా చూసినది - రవీంద్ర సినిమాస్ ( విజయవాడ)( మంచి థియేటర్)
HIGH LIGHTS 

BALAKRISHNA
KEERAVANI BAGROUND SCORE
CAMERA
ART
CASTING

MINUS

EMOTION LESS SCENES IN SECOND HALF

NTR OLD MOVIE SONGS ..

POLITICAL SCENES.. FLOOD SCENES.




No comments:

Post a Comment

ADD