add

Monday 24 June 2019

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి ..ఆశ్చర్యమే.

మహర్షి .. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం, రిలీజ్ అయిన వెంటనే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా .. రైతు సమస్యల నేపథ్యం ఎన్నుకోవడం వలన .. చుసిన వాళ్లలో సినిమా మీద మంచి అభిప్రాయమే ఉండటం వలన .. 170 కోట్ల కలెక్షన్ చేసి .. 200 సెంటర్లలో .. 50 రోజుల వైపుకు పరుగెడుతున్నది. హైదరాబాద్ లో ఇంకా ఈ సినిమా , ఆదివారం హౌస్ ఫుల్ అవ్వడం విచిత్రం. ఈ నెల 27 న 50 వ రోజు జరుపుకోనున్న మహర్షి సినిమా , మహేష్ అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించింది. 28 న శిల్ప కళా వేదిక లో సినిమా బృందం అంత వేడుక చేసుకోబోతున్నారు. విశేషం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ 25 - ఆజ్ఞతవాసి  అట్టర్ ప్లాప్ , ఎన్టీఆర్ 25- నాన్నకు ప్రేమతో బీలో అవేరేజ్  గా ఆడింది. ఒక్క మహేష్ బాబు మాత్రం తన 25 సినిమా తో సూపర్ హిట్ కాక పోయిన .. హిట్ కొట్టాడు. పోస్టర్ల మీద రాసినట్లు ఇది ఎపిక్ బ్లాక్బస్టర్ మాత్రం కాదు. ఈ అమెజాన్ ప్రైమ్ ..  కాలం లో ఇన్ని సెంటర్ లలో ఒక సినిమా 50 రోజులు జరుపుకోవడం ఆశ్చర్యమే.


No comments:

Post a Comment

ADD