add

Saturday 22 June 2019

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ రివ్యూ 2019 RATING 4/5

ఏజెంట్  సాయి శ్రీనివాస్ ఆత్రేయ .. థ్రిల్లర్ , మళ్ళీ రావా సినిమా తో హిట్ కొట్టిన స్వధర్మ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో .. చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న .. వర్ధమాన నటుడు , నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్ర పోషించాడు. అంతేకాదు ..స్క్రీన్ ప్లే రాసాడు. అడవి శేష్ లాగా మల్టీ టాలెంటెడ్ .. నవీన్. అర్జున్ రెడ్డి తరువాత ,పాచి పట్టిన కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు .. రంగస్థలం ఇచ్చిన కిక్ తరువాత .. ఈ సినిమా కిక్ ఇస్తుంది. ఎందుకో ..చెపుతాను. 
కథ - ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ .. చిన్న చిన్న కేసు  చేస్తూ  గడిపేస్తుంటారు. అనుకోకుండా ఒక పెద్ద వరుస ముర్డర్ల కేసు తగులుతుంది . ఆ కేసు సాల్వ్ చేస్తూ .. అతనే అందులో ఇరుక్కుంటాడు. ఆ కేసు ని ఎలా సాల్వ్ చేసాడు, ఎలా ఆ కేసు నుండి బయటపడ్డాడు అన్నది తెర మీద చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలి. 
నటీనటులు - నవీన్ చక్కగా నటించాడు, కొన్ని చోట్ల మంచి ఎమోషన్స్ పండించాడు. కామెడీ కూడా బాగానే చేసాడు. నవ్వితే అచ్చంగా విల్లన్ అజయ్ గుర్తొస్తాడు. హీరోయిన్ శృతి శర్మ సినిమా మొత్తం ఉంటూ హీరో కి హెల్ప్ చేస్తుంది , చూడటానికి మాళవిక నాయర్ లా కనిపిస్తుంది,బాగానే నటించింది, మజిలీ సినిమాలో నాగచైతన్య ఫ్రెండ్ గ ఆక్ట్ చేసిన ఆక్టర్ ఇందులో కూడా చక్కని నటన ప్రదర్శించాడు, మిగిలిన అందరు కొత్త ముఖాలే.. బాగా చేసారు. 
సాంకేతికవర్గం- ఈ సినిమా కి స్క్రీన్ ప్లే చాలా పెద్ద ప్లస్ , సస్పెన్స్ ఏంటో చివరివరకు తెలియదు, ఆ సస్పెన్స్ కూడా కొత్తగా .. అబ్బా అనిపించేలా ఉంటది. డైరెక్టర్ స్వరూప్ సినిమా ని ఆద్యంతం అలరించేలా తీసాడు. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమా అన్ని భాషలలో లో రీమేక్ అవ్వడం ఖాయం. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ ,బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. కెమెరా పర్వాలేదు , ఆర్ట్ కూడా ఓకే. కాస్ట్యూమ్స్ , డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ కొంత చేస్తే బెటర్. చాలా రోజుల  తరువాత తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ . కుర్చీ చివర కూర్చొని చూడాలి ... 

తప్పక చుడండి !


No comments:

Post a Comment

ADD