add

Friday, 26 July 2019

విజయ్ దేవరకొండ .. డియర్ కామ్రేడ్ vijay devarakonda DEAR COMRADE REVIEW IN TELUGU RATING 2.5/5

విజయ్ దేవరకొండ .. డియర్ కామ్రేడ్ , మైత్రి మూవీస్ నిర్మించిన ఈ సినిమా ... ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది. నాలుగు భాషల్లో విడుదల చేస్తున్న ఈ సినిమా లో హిట్ పెయిర్ .. విజయ్ రష్మిక జంటగా నటించారు,సినిమా ప్రివ్యూ చూసి , బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ రీమేక్ చేస్తున్నామని ప్రకటించేసారు. అంత ఏముంది ఈ సినిమాలో . . 


కథ - బాబీ అనే కాలేజీ స్టూడెంట్ , కాలేజీ లో తప్ప ఎప్పుడు ..ఇంట్లో లేదా రోడ్ మీద తిరుగుతుంటాడు. పక్కింటి లిల్లి ని ప్రేమిస్తాడు. కోపం ఎక్కువైన బాబీ  ని వద్దని పోతుంది లిల్లి. 3 సంవత్సరాలు బైక్ మీద దేశాలు తిరిగి , బాబీ సౌండ్ థెరఫీ చేస్తుంటాడు. అనుకోకుండా ..ఒక డాక్టర్ ని కలవడానికి వెళ్లిన బాబీకి .. లిల్లీ పిచ్చి దానిలా హాస్పిటల్ లో కట్టేసి కనపడుతుంది. ఎందుకలా ఉంది.. ఏమయ్యింది. బాబీ  ఎం చేసాడో చూసి తెలుసుకోవాలి. 

నటీనటులు- విజయ్ స్టార్ హీరో అయిపోయాడు. క్లాస్ గా  ఉంటూనే.. మాస్ ఎమోషన్స్ చక్కగా పలికించాడు. మహేష్ బాబు లా  అందరిని ఆకట్టుకుంటాడు, పొగ త్రాగటం హానికరం .. అనే స్లయిడ్ విజయ్ స్వయంగా చదవడం అభినందనీయం. (ఈ మధ్య హీరోలు చదవడం మానేశారు ). రష్మిక .. పళ్ళు మొత్తం బయట పెట్టి నవ్వడం ,లేదా తలదించుకు ఏడవడం ఎక్కువయ్యిపోయింది. అక్కడక్కడా మాత్రం ముద్దులు తో మురిపించింది.. క్రికెట్ షాట్స్ లో బాగా నటించింది. ఆనంద్ ,చారుహాస్సన్,హీరో ఫ్రెండ్స్ ,కాంచి, మిగిలిన అందరు బాగా చేసారు. విల్లన్ గా  నటించిన బాలీవుడ్ ఆక్టర్ జీవించాడు. 

సాంకేతికవర్గం - సంగీతం లో ..ఒక రెండు పాటలు బాగున్నాయ్. మిగిలినవి మలయాళ సాంగ్స్ ల ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి పాట ,ఎప్పుడు అయిపోతుందా ..అని  అనిపించింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒకటే ..నీ నీలి కళ్ళల్లో. ... 
కెమెరా .. కొన్ని చోట్ల బాగుంది, కాకినాడ షాట్స్ మాత్రం .. చెత్తగా ,యూట్యూబ్ నుండి తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఆర్ట్, ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్స్ ,డాన్స్ ఓకే. ఇక కథ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు దగ్గర గా ఉన్నదే.. కానీ 
కథ లో ఉన్న సిన్సియారిటీ ..సీన్లలో లేదు. 



ఉదాహరణకు.  హీరో - హీరోయిన్ విడిపోయాక.. హీరోయిన్ హైదరాబాద్ వచ్చి చక్కగా క్రికెట్ ఆడుకుంటుంది. బాధ ఎం ఉండదు. హీరో మాత్రం ఉప్పల్ బాలు లా .. కసి తో టెలిఫోన్ బూత్ లు బద్దలు కొడుతుంటాడు. హీరో .. నిజం చెప్పమంటే .. హీరోయిన్ అస్సలు చెప్పదు . విల్లన్ ఒక్క మాట అనగానే రెచ్చిపోయి ..నిజం చెప్పుతుంది.. కామ్రేడ్ విలనా ? లేక హీరోనా? సినిమాలో కాంటీన్ సాంగ్ తీసి పడేసారు, మంచి పని చేసాడు . లేకపోతే ఇప్పటికే 3 సినిమాలు చుసిన ఫీలింగ్ . దర్శకుడు భారత్ కమ్మ టేకింగ్ బాగా స్లో, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఎంతవరకు తీయాలో తెలియదు. సినిమా సాగి.. సాగి.. జనం సినిమా చూడటం మానేసి  మొబైల్స్ చేసుకునేలా చేసాడు. 

విజయ్ కోసం ఒక్కసారి చుడండి. 
సినిమా చూసినది - ఏషియన్ - ఉప్పల్ 



No comments:

Post a Comment

ADD