add

Saturday, 31 August 2019

సాహో ప్రభాస్ ... SAAHO - REVIEW ...RATING -3

సాహో  ప్రభాస్ నటించిన భారీ ఆక్షన్ చిత్రం. బాహుబలి సిరీస్ తరువాత దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ నటించిన సాహో సినిమాని , 4 భాషల్లో విడుదల చేసారు. ముఖ్యంగా హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసుకుని ,తారాగణం లో కూడా ఎక్కువగా ..బాలీవుడ్ ఆక్టర్స్ నే తీసుకున్నారు. అయిదుగురు సంగీత దర్శకులు పని చేసిన సాహో  మీద .. ప్రేక్షకుల అంచనాలు ఎక్కువయ్యాయి. అట్టహాసంగా రిలీజ్ చేసిన ఈ సినిమా .. డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఎందుకు డివైడ్ టాక్ . 

కొన్ని నెలల ముందు రిలీజ్ అయ్యిన తెలుగు భారీ ప్లాప్ .. ఆజ్ఞత వాసి , లార్గో వించ్  అనే హాలీవుడ్ సినిమాకి కాపీ ,ఆ ఒరిజినల్ దర్శకుడు ఈ తెలుగు సినిమా చూసి , కేసు కూడా వేసాడు. ట్ సిరీస్ (సాహో  - హిందీ నిర్మాత ) కొన్న హక్కుల మీద .. అజ్ఞాతవాసి నిర్మాతల మీద కేసులు కూడా పెట్టింది. కొంత వసూల్ కూడా చేసుకుంది. ఈ సినిమాకి ... సాహోకి ఉన్న లింక్ ఏంటి అంటారా ... సాహో  కూడా లార్గో వించ్  కి కాపీనే .. 

తన వారసుడ్ని .. ప్రపంచానికి తెలియకుండా దాచి , హఠాత్తుగా మరణిస్తాడు తండ్రి. తండ్రి స్థానం ని వేరే వాళ్ళు ఆక్రమించుకోబోతే ... కొడుకు ఎలా తండ్రి స్థానం ని సంపాదించుకున్నాడు ? తానే కొడుకని ఎలా నిరూపించుకున్నాడు.. ? అన్నదే లార్గో వించ్  మెయిన్ స్టోరీ. 
ఇదే కథని బిజినెస్ నేపధ్యం లో అజ్ఞాతవాసి ..సినిమా తీస్తే , మాఫియా నేపథ్యంలో .. సాహో  సినిమా తీశారు. 
ఆజ్ఞత వాసి సినిమా రిలీజ్ అయ్యిన వెంటనే .. సాహొ  షూటింగ్ ఆగింది , కథ లో మార్పులు జరిగాయని ప్రముఖ వెబ్సైట్ లో రాసారు కూడా.. 

సో ... సాహో  కథ కాపీ అని తెలిసిపోయింది. కానీ దర్శకుడు సుజీత్ ఒరిజినల్(లార్గో వించ్  పెద్ద హిట్ కాదు )సినిమా కంటే కొంచం బెటర్గా తీయడానికి ట్రై చేసాడు , ఆక్షన్ సీన్స్ చాలా బాగా తీసాడు. కథ ఇలాంటి సినిమాల్లో పెద్దగా ఉండదు , అసలు కథనం లోనే ఈ సినిమాలకి కిక్ ఉంటుంది. 
సినిమా రిలీజ్ అవ్వగానే ... .,2,1.5 , 2. 5 రేటింగ్స్ ఇచ్చారు బాలీవుడ్ ,టాలీవుడ్ రివ్యూయర్స్ . హాలీవుడ్ ఆక్షన్ సినిమాలు మన టాలీవుడ్ తీయలేదు .. అని గోల పెట్టె వాళ్ళు. హాలీవుడ్ రేంజ్ లో తీసిన సాహో  కి రివ్యూస్ ఆలా ఇస్తరేంటో. 
ప్రభాస్ యాక్టింగ్  , డైలాగ్ డెలివరీ వీక్ అని అందరికి తెలిసిందే. ఫైట్స్ ,డాన్స్ ఇరగదీస్తాడు అని తెలిసిందే. సాహో  లో ఫైట్స్ అదిరిపోయాయి. సినిమా జోనర్ ని బట్టి అందులో సరుకు ఉంటుంది . ఈ యాక్షన్  సినిమాలో కూడా .. కామెడీ కావాలని కోరుకోవడం .. తెలుగు ప్రేక్షకుల ఎదుగుదల చెప్తుంది.ఘిబ్రాన్  బ్యాగ్రౌండ్ మ్యూజిక్ , కెమెరా ,ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగ ఉన్నాయి.  

ఎమోషనల్ గా .. ప్రేక్షకుడు ఈ సినిమాలో ఎక్కడ కనెక్ట్ ఎవ్వడు. అదే ఈ సాహో  లో మైనస్ పాయింట్ . రెండు చోట్ల 
హీరో పాత్రని ఎమోషనల్ గ కనెక్ట్ చెయ్యొచ్చు. హీరోయిన్ .. ప్రేమలో , తండ్రి కోసం తపనపడే కొడుకు . కానీ దర్శకుడు హాలీవుడ్ ఆక్షన్ మాత్రం తీసుకుని ..ఎమోషనల్ కనెక్షన్ మర్చిపోయాడు. హాలీవుడ్ డార్క్ నైట్  సినిమాలో బాట్మాన్ కి ప్రేక్షకులు ఎమోషనల్ గ కనెక్ట్ అవుతారు. అందుకే ఆ సిరీస్ విజయం సాధించింది. అబుదాబి ఆక్షన్ సీక్వెన్స్ నుండి సినిమా క్లైమాక్స్ వరకు ఒక రేంజ్ ఆక్షన్ తో సినిమా ముందుకెళ్తుంది. ఇటువంటి స్క్రీన్ప్లే  హాలీవుడ్ ఆక్షన్ సినిమాల్లో ఉంటుంది . అవెంజర్స్ చుడండి .. ముందు అంత మాటలు ... లాస్ట్ 30 నిమిషాలు ఆక్షన్ . 

సాహో  తో .. తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెరిగాయని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు. 




No comments:

Post a Comment

ADD