add

Saturday 19 May 2018

డెడ్ పూల్ -2 (DEADPOOL-2 )REVIEW IN TELUGU RATING : 4 / 5

డెడ్ పూల్ సినిమా హాలీవుడ్ లో ఒక సంచలనం. మార్వెల్ కామిక్ హీరోల్లో 'డెడ్ పూల్ ' ది విచిత్రమైన పాత్ర. డెడ్ పూల్ పాత్ర కామెడీగా,
శృంగారభరితంగా,వీరోచితంగా ఉంటుంది. కాన్సర్ బాధితుడైన డెడ్ పూల్ (వేడ్ ), ఒక అగ్ని ప్రమాదం లో సూపర్ హీరోగా మారతాడు. మొదటి భాగం లో అద్భుతమైన విసువల్ ఎఫెక్ట్స్, సెక్స్,డబల్ మీనింగ్ డైలాగ్స్ తో అలరించిన డెడ్ పూల్, ఈ సినిమా ని ఫామిలీ ఎంటర్టైనర్ గా  తీసుకొచ్చాడు. 

కథ : డెడ్ పూల్ భార్య చనిపోయిన తరువాత , ఆత్మహత్యకు పాల్పడతాడు. కానీ అతనిని కాపాడతారు. డెడ్ పూల్ ఎక్స్ మెన్ లో చేరి, ఒక కుర్రాడ్ని(రస్సెల్ ) కాపాడబోతాడు, ఆ కుర్రాడు కూడా మండే చేతుల శక్తీ కలిగి ఉంటాడు. ఈ ప్రయత్నం లో డెడ్ పూల్ , కుర్రాడు ఇద్దర్ని .. జైలు లో వేసి, శక్తులు పని చేయనివ్వకుండా చేస్తారు. ఇదే సమయంలో భవిష్యత్తు కాలం నుండి వస్తాడు 'కెబుల్ '. కేబుల్ కుర్రాడ్ని చంపేద్దామనుకుంటాడు. డెడ్ పూల్ .. ఆ కుర్రాడ్ని ఎలా కాపాడాడు అన్నదే కథ. 

నటీనటులు: ర్యాన్ రేయినాల్డ్స్ డెడ్ పూల్ గా  అద్భుతంగా నటించాడు. అతని పాత్రకు సరైన డబ్బింగు  చెప్పడం వలన మరింత  బాగుంది. కేబుల్ గా జోష్ బ్రోలిన్ బాగా నటించాడు. రస్సెల్ గా  జూలియన్  రకరకాల భావాలూ  పలికించాడు. డెడ్ పూల్ టీం మొత్తం సినిమా లో ఇరగ దీసింది. 

సాంకేతిక వర్గం:డేవిడ్ లీచ్ సినిమా ఆద్యంతం డెడ్ పూల్ మొదటి భాగానికి దీటుగా సినిమాని నడిపించాడు. ముఖ్యంగా ఈ సినిమా లో ,డబ్బింగ్ చేసిన విధానం, మాటలు రాసిన విధానాన్ని మెచ్చుకోవాలి. తెలుగు సినిమా లేటెస్ట్ పేర్లు వాడుకుని డైలాగ్స్ భలే రాసారు. భాగమతి డైలాగ్,స్పైడర్ మీద సెటైర్ అదిరిపోతాయి. సాంకేతికంగా ఎడిటింగ్,సంగీతం,గ్రాఫిక్స్,స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి. కొన్ని బూతు కామెడీ సీన్స్ కూడా అలరిస్తాయి,ముఖ్యంగా 
డెడ్ పూల్ కి చిన్న పిల్లల కాళ్ళు అతికించిన సీన్ హైలైట్, దోపిందర్  గా కరణ్ సోని క్లైమాక్స్ లో చేసే కామెడీ అలరిస్తుంది. సరైన విల్లన్ లేకపోయినా .. కామెడీ తో అలరిస్తాడు డెడ్ పూల్. 

తప్పక చూడండి. 

సినిమా చూసినది : శ్రీ రమణ 35 ( బాగుంది)

No comments:

Post a Comment

ADD