add

Thursday 7 June 2018

జురాసిక్ వరల్డ్ - ఫాలెన్ కింగ్ డమ్ రివ్యూ తెలుగులో RATING: 2/5 .. JURASSIC WORLD - FALLEN KINGDOM REVIEW

జురాసిక్ వరల్డ్ - ఫాలెన్ కింగ్ డమ్ , రిలీజ్ కాకమునుపే .. హిట్ అవుతుందని ఎన్నో అంచనాలున్నాయి .. ఇదే బహుశా సిరీస్ లో చివరిది అని కూడా వార్తలొచ్చాయి. 3డి చిత్రంగా.. రాకపోయినా .. 2డి లో రిలీజ్ అయ్యింది. కాలా సినిమాతో పోటీ పడుతున్న ఈ రాక్షశ బల్లి విషయాలు చూద్దాం.


కథ: మిల్స్ అనే చెడ్డవాడు , DR అయాన్ దగ్గర ఉంటూ .. రహస్యంగా .. DR  వూ తో కలిసి డైనోసార్స్ ను తయారు చేస్తుంటారు , ఒక భయంకరమైన, మనుషులతో కంట్రోల్ చేయబడే దయనొసార్ ని తయారు చేయడం కోసం .. బ్లూ డయానో రక్తం అవసరం వస్తుంది. దాని కోసం జురాసిక్ వరల్డ్ కి హీరో,హీరోయిన్ లను పంపిస్తాడు. జురాసిక్ వరల్డ్ ఉన్న అగ్నిపర్వతం బద్దలవుతుంది , కొన్ని డయానో లను కాపాడతారు. కానీ ఒకటి చనిపోతుంది. మిగిలిన డైనోసార్ లను అమ్మేస్తాడు మిల్. కానీ అనుకోకుండా ..ప్రమాదం జరిగి డైనోసార్ లను కొనడానికి వచ్చిన వారిపై .. డైనోసార్లు విరుచుకుపడతాయి. చివరికి ఏమయ్యింది? సినిమా చూడాలి.

నటీనటులు:క్రిస్ పాట్ , బ్రైస్ డల్లాస్ లు..  హీరో , హీరోయిన్ లుగా బాగా నటించారు. రేఫే  స్పెల్, టెడ్ లెవిన్ లు విల్లన్స్ గా బాగా చేశారు.డాక్టర్ గా పినెడ, నెట్వర్క్ అనలిస్ట్ గా జస్టిస్ స్మిత్ అక్కడక్కడ .. కామెడీ పండించారు. చిన్న పాప చాలా బాగా నటించింది. హీరో క్రిస్ పాట్ చూడటానికి అఖిల్ లా ఉన్నాడు.


సాంకేతిక వర్గం : జె.ఏ బయోన  దర్శకత్వం వహించిన  ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగేలా , స్క్రీన్ ప్లే  రాయగా .. సినిమా లో థ్రిల్స్ పాత డైనోసార్ సినిమాల్లో చూ సినవే అవ్వడం మైనస్ . 
సినిమాలో .. డైనోసార్లు అనవసరంగా తన్నుకుంటాయి ..పక్కన మనుషుల్ని పెట్టుకుని. ఇక ప్రతి డైనోసార్ సినిమాల్లో .. డినోసార్లే విలన్లు కాగా.. ఈ సినిమాలో మనుషులే విలన్స్ అవ్వడం మరో మైనస్, చివర్లో డైనోసర్లతో కలిసి జనం బ్రతకడం .. మరీ వెటకారం. గ్రాఫిక్స్ ఈ సినిమాకి ఎప్పటిలాగే ప్రధాన ఆకర్షణ. 


ఒక్కసారి చూడొచ్చు. 


సినిమా చూసినది: రాజధాని 70MM  ( చెత్త )

No comments:

Post a Comment

ADD