add

Thursday 7 June 2018

రజినీకాంత్ " కాలా " రివ్యూ తెలుగులో .. rating :3 / 5

రజినీకాంత్ , ప రంజిత్  కలయికలో కబాలి సినిమా తరువాత వస్తున్న " కాలా " సినిమా పై ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలు లేవు. ఎందుకంటే .. కబాలి సినిమా యావరేజ్ గా ఆడటమే . ప. రంజిత్ ఎప్పుడూ .. అణగారిన వాళ్ళు .. ధనికుల మీద పోరాటాలు .. ఇలాంటి కాన్సెప్టులే ఎంచుకోవడం .. మరో కారణం. అయినా రజిని చరిష్మా జనాలను థియేటర్లకు రప్పించింది. 

కథ: కరికాలా  ముంబై లో .. ధారవి అనే   మురికివాడ కి పెద్ద. ధారవి ముంబై కి నడిమధ్యలో ఉండటం వలన .. ఆ ల్యాండ్ మీద హరిదాదా (నానా పాటేకర్)కన్ను పడుతుంది(ప్యూర్ ముంబై). కరికాల 'నేను ఉండగా ..ధారవి లో గుప్పెడు మట్టి కూడా తీసుకోలేవు ' అని సవాల్ విసురుతాడు.  హరిదాదా ప్యూర్ ముంబై ప్రాజెక్ట్ కోసం కాలా ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంటాడు .కరికాలా  ఎలా ఎదుర్కున్నాడు ?

నటీనటులు: రజిని ఈ సినిమాలో సన్నగా , రఫ్ లుక్ తో అదరగొట్టాడు. రజిని ఎక్కువగా ఫైట్స్ చెయ్యలేదు..పాటల్లో   కూడా డాన్స్ లు చెయ్యలేదు , అక్కడక్కడ  హీరోయిజం చూపిస్తూ అదరగొట్టాడు . ఈశ్వరి రావు (రాంబంటు ఫేమ్) కాలా భార్యగా తక్కువ మేకప్ తో .. రొమాంటిక్ సీన్లతో అదరగొట్టింది. హ్యూమా ఖ్యూరేషి  జరీనాగా .. కాలా పాత లవర్ గా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. తాగుబోతుగా సముద్రఖని , కాలా కొడుకులుగా వేసిన డైరెక్టర్ మురుగదాస్ తమ్ముడు దిలీపన్ ,
స్టాలిన్ గా వేసిన కుర్రాడు బాగా నటించారు. బంగారు తల్లి ఫేమ్ అంజలి పాటిల్ అక్కడక్కడా .. జూనియర్ ఎన్టీఆర్ లా ఓవర్ అయ్యింది. 

ఇక విలన్ గా నానా పాటేకర్ .. అదరగొట్టాడు. సినిమా లో నానా పాత్ర వచ్చాక ఊపు వస్తుంది. నానా తో వచ్చే సీన్లలో అద్భుతమైన హావభావాలతో అదరగొట్టాడు. మరిన్ని సన్నివేశాలుంటే బాగుండును అనిపిస్తుంది. సంపత్,రవికాలే.. షాయాజీషిండే ఉన్నంతలో ఓకే . 


సాంకేతికవర్గం: ఎడిటింగ్ కొంత చెయ్యాల్సి ఉంది. మురళి కెమెరా అద్భుతం.. వర్షం సన్నివేశాలు,ధారావి సన్నివేశాలు చాలా చక్కని లైటింగుతో తీసాడు మురళి. సంతోష్ నారాయణ్ పాటలకంటే .. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. రామలింగం ఆర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మన తెలుగు సినిమాల్లో .. హీరో ధారవిలో ఉంటె ? హీరోకి పెద్ద డూప్లెక్స్ ఇల్లు ఉంటది. కానీ ఈ సినిమాలో కాల ఇల్లు ఇరుకుగా ఉంటుంది ( కాలా మనవాళ్లతో ..మానవరాళ్లతో మాట్లాడే సీన్ బాగా పరిశీలించండి  ) . ధనుష్ ఖర్చుకు వెనుకాడలేదు. 

ఇక ఈ సినిమా  దర్శకుడు .. పా . రంజిత్ .. ఎప్పుడు అణగారిన వాళ్ళ కోసమే సినిమాలు చేస్తున్నట్లు ఉంటాయి అతని సినిమాలు. కబాలి సినిమా పూర్తి హాలీవుడ్ సినిమాలా ఉంటుంది.. తమిళ్  ఓవర్ ఆక్షన్స్ , ఓవర్ మెలోడ్రామా ఉండదు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. 
హీరో రావడంతోనే .. గాల్లో ఎగిరి , కారు గిర్రున ఆగకుండా తిరుగుతుంటే ..గాల్లోనే ఉండి రౌడీలను తన్నడం లాంటివి .. ప రంజిత్ సినిమాల్లో ఉండవ్. కానీ ప్రతి సినిమాలు ఉద్యమాలు, విప్లవాలు .. డాన్ లు అంటే జనాలకు బోర్ కొడుతుంది. ఈ సినిమా కథ .. హాలీవుడ్ - గాడ్ ఫాదర్,బాలీవుడ్ - సర్కార్,కోలీవుడ్ - నాయగన్  లో మనం చూసేసాం. మరో కొత్త కాన్సెప్ట్ ఎంచుకుని ఉంటె బాగుండును. 

చిట్టెమ్మ .. పాట వస్తున్నపుడు మనకు నీరసం వస్తుంది. ద్వితీయార్ధంలో .. రాజకీయంగా .. మతకలహాలు సృష్టించే సన్నివేశాలు వెనుక హిందీలో రామాయణం .. బోర్ కొట్టిస్తాయి

ఈశ్వరి - కాలా సన్నివేశాలు , హరిదాదా - కాలా సన్నివేశాలు, కార్ ప్రమాదం , ఇంటర్వెల్ ,వర్షం ఫైట్, షాయాజీ షిండే తో పోలీస్ స్టేషన్ సీన్ ,  క్లైమాక్స్ లో రంగులతో ఆడుకోవడం .. బాగుంటాయి. 

రజిని మారిపోయాడు. ఇకనుంచి .. తన సినిమాల్లో  ప్రేక్షకులు ఇవే ఆశించాలని .. ఈ సినిమాతో చెప్పకనే చెప్పేసాడు.  

సినిమా చూసినది: ఆసియన్ మల్టీప్లెక్స్ (ఉప్పల్) సూపర్ థియేటర్ 

No comments:

Post a Comment

ADD