add

Wednesday, 15 August 2018

గీత గోవిందం 2018 సినిమారివ్యూ RATING 4/5

పరశురామ్ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఆంజనేయులు,సారొచ్చారు లాంటి సినిమాలు అతని ప్రతిభకు ఉదాహరణలు. కామెడీని కథలో కలుపుతూ సినిమాని సరదాగా నడిపేయడంలో పరశురామ్ మంచి ప్రతిభావంతుడు. గీత గోవిందం సినిమా కూడా ఆ కోవకు చెందినదే. 
కథ : గీత -గోవింద్  ఇద్దరు బస్సు లో అనుకోకుండా జరిగిన ముద్దు సంఘటన తో గొడవపడతారు, గీత..  గోవింద్ ని కాముకుడు అనుకుంటుంది. గోవింద్ చెల్లిని , గీత అన్న కిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు , ఒక పక్క తన చెల్లిని బస్ లో ఏడిపించిన వాడిని చంపడం కోసం గీత అన్న తిరుగుతుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో గోవింద్ ,గీత ప్రేమను ఎలా పొందాడు అనేదే సినిమా. 

నటీనటులు: విజయ్ హీరోగా ఈ సినిమాలో చక్కగా ఒదిగిపోయాడు, సినిమా కు సరిపడినంత నటించాడు .. రష్మిక మందన్న .. ఈ సినిమాకే హైలైట్ , హీరో - హీరోయిన్ మధ్య  గిలిగింతలు పెట్టె రొమాంటిక్ కామెడీ సన్నివేశాలు అదిరిపోతాయి. సుబ్బరాజు , నాగబాబు, రాహుల్ రామకృష్ణ  బాగానటించారు. వెన్నెల కిశోర్ - అన్నపూర్ణ మధ్య కామెడీ నవ్వులు కురిపిస్తుంది. 
సాంకేతిక వర్గం : పరశురామ్ రాసిన సంభాషణలు,కథనం అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దర్శకత్వంలో ఏమి గొప్ప మెరుపులు లేవు కానీ .. సినిమా ఆద్యంతం నవ్వులతో నడిపించేసాడు. బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు వస్తుంటాయి. సన్నివేశాలే ప్రధానంగా సాగే ఈ సినిమా కు కథ అనవసరం. గోపిసుందర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం . ఇంకేం ఇంకేం కావాలె.. ,తెల్లతెల్లవారే పాటలు అద్భుతంగా వున్నాయి. మణికందన్ కెమెరా అనుకున్నంతగా లేదు, అన్నవరం లో తీసిన సన్నివేశాల్లో కెమెరా .. లైటింగ్ సరిపోలేదు.ఆర్ట్ బాగుంది . అత్తిలి గర్ల్ పాటలో డాన్స్ ..చూస్తే పోర్న్ సినిమా లో యాంగిల్స్ గుర్తొస్తాయి. అంత వల్గర్ గ డాన్స్ కంపోజ్  చేసారు. 

కాకినాడలో సినిమా జరిగినట్లు చూపించినా ...  కాకినాడ ఏరియాలో షూటింగ్ జరుపనందున, కాకినాడ లోజరుగుతున్న ఫీలింగ్ కలగదు.(ఒక్క భానుగుడి సీన్ మినహా)

కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రం. 
సినిమా చూసినది: రాజధాని 70mm (దిల్సుఖ్నగర్)
                            చెత్త సినిమా హాల్ (70/-)

No comments:

Post a Comment

ADD