add

Wednesday 15 August 2018

AKSHAY KUMAR ' GOLD ' 2018 MOVIE REVIEW - RATING 3/5

అక్షయ్ కుమార్ హీరోగా .. హాకీ క్రీడా నేపధ్యం లో తీసిన చిత్రం గోల్డ్. రీమా కాగ్టి దర్శకత్వంలో .. టీ - సిరీస్  , పర్హాన్ అక్తర్ తో కలిసి నిర్మించిన ఈ సినిమా .. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదలయ్యింది. 

కథ: తపన్ దాస్ బ్రిటిష్ ఇండియన్ టీం కి కో ఆర్డినేటర్ గ ఉంటాడు , 1936 ఒలింపిక్స్ గెలిచిన తరువాత .. ఎప్పటికైనా స్వతంత్రం పొందిన ఇండియా తరపున ఆడి గెలవాలనుకుంటాడు. యుద్ధాల వలన ఒలింపిక్స్ రద్దవుతాయి .. తపన్ దాస్ మద్యానికి బానిస అవుతాడు. 1948 లోమళ్లీ ఒలింపిక్స్ పోటీలు ప్రారంభమవుతాయి  .. తపన్ దాస్ ఒక టీం ని తయారుచేస్తాడు .. కానీ .. దేశం పాకిస్థాన్ - హిందుస్థాన్ గ విడిపోతుంది ముస్లిమ్స్,బ్రిటిషర్లు, వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతారు.  మళ్లి  కొత్త టీం కోసం వేట  .. తపన్ చివరకి ఇండియాకి ఎలా గోల్డ్ మెడల్ తెచ్చాడనేదే సినిమా. 
నటీనటులు:అక్షయ్ కుమార్ మాములుగా నటించాడు , కొత్తగా చేసిందేం లేదు. కానీ సినిమా కి వెన్నుముక్కగా ఆ పాత్ర ఉంటుంది . మౌని రాయ్ బెంగాలీ గృహిణిగా కాస్త రొమాంటిక్ టచ్ ఇస్తూ .. బాగానే నటించింది. కునాల్ కపూర్(సామ్రాట్), అమిత్ సాద్ ( రఘువీర్ సింగ్), సన్నీ  కౌశల్ ( హిమ్మత్) సినిమా కి ప్రధానమైన పాత్ర లు పోషించారు. హిమ్మత్ సింగ్ పాత్ర ఆకట్టుకుంటుంది. 
సాంకేతికవర్గం: సినిమా లో అంత కొత్తదనం లేదు.. స్ట్రెయిట్ గా కథ చెప్పాడు దర్శకుడు . దాని వలన తరువాత ఎం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకులకు కలగదు . అన్ని క్రీడా కథల్లాగే కొన్ని చమక్కులున్నాయి అంతే .  చివర్లో వర్షం పడేటప్పుడు షూస్ తీసి ఆడటం లాంటివి . కెమెరా బాగుంది , సచిన్ - జిగర్ సంగీతం లో ఒక్క పాట  కూడా ఆకట్టుకోదు. నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. గేలరీ లో ప్రేక్షకులను .. గ్రాఫిక్స్ లో ఛండాలంగా చూపించారు .. కానీ అక్షయ్ కుమార్ టీం నటనతో కట్టిపడేస్తుంది. ఆర్ట్ వర్క్ అద్భుతం. 

ఒక్క సారి చూడొచ్చు. రొటీన్ స్పోర్ట్స్ డ్రామా. 

సినిమా చూసినది : సుధా సినిమాస్ (శాలిబండ) సూపర్ థియేటర్స్ (118/-)

No comments:

Post a Comment

ADD