add

Thursday 16 August 2018

SATYAMEVA JAYATHE 2018 HINDI MOVIE REVIEW - RATING 1.5/5

జాన్ అబ్రహం  పరమాణు లాంటి మంచి హిట్ సినిమా తీసి మంచి ఊపు మీద ఉండగా ... భారీ ఆక్షన్ సినిమా గా సత్యమేవ జయతే .. తో వచ్చి ప్రేక్షకుల తీర్పు కోరాడు. తెలుగు సినిమాల్లో ఉండే మసాలా, ఓవర్ ఆక్షన్ , ఊహకందని పోరాటాలు , లాజిక్ లేని విశేషాలు తో ఒక హిందీ సినిమా తీస్తే ఎలా ఉంటుందో .. అలా ఈ ' సత్యమేవ జయతే '  సినిమా ఉంది . 

కథ: వీర్ తండ్రి నిజాయితీ గల పోలీస్ .. అతనిని కుట్ర పన్ని పోలీస్ ఉద్యోగం నుండి తీసేస్తారు . వీర్ తండ్రి అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. వీర్ పెరిగి పగ తీర్చుకోవాలనుకోగా .. వీర్ అన్న తండ్రి నిజంగానే ద్రోహి అని భావించి .. మంచి పోలీస్ అవ్వాలనుకుంటాడు. వీర్ .. ముంబై లోని ఒక్కొక్క లంచగొండి పోలీస్ లను చంపుతుంటే ... అతన్ని పట్టుకోడానికి  .. శివాంశ అనే పోలీస్ ను నియమిస్తారు, శివాంశ వీర్ ను ఎలా పట్టుకున్నాడు? వీర్ పగ  తీరిందా ? తెర మీద చూడాలి. 
నటీనటులు: జాన్ అబ్రహం సినిమా మొత్తం నీరసంగా కనిపించాడు, యాక్షన్ సీన్లలో మాత్రం ఇరగదీసాడు. మనోజ్ బాజ్పాయ్ .. నటుడిగా మరొక సారి ఆకట్టుకోగా .. ఐషా శర్మ గ్లామర్ కోసం మిగిలిపోయింది. ఇషా గొంతు మగ  గొంతులా అనిపిస్తుంది. విలన్ అస్సలు సూట్ కాలేదు. 
సాంకేతికవర్గం: మిలాప్ జవేరి .. 80 ల లో రావాల్సిన కథ ఎంచుకుని .. అలాగే తెరకెక్కించాడు.. ప్రతి సీను  నీరసంగా .. సాగి సాగి బోర్ కొట్టించగా, సినిమా లో ఆసక్తికలిగించే కథనం లేకపోవడం మరో విశేషం. ట్విస్టులు అన్ని మనం ముందే ఊహించేయవచ్చు. సంగీతం లో చెప్పుకోదగ్గ పాట  లేదు, సిర్ఫ్ తుమ్ లోని .. దిల్ బర్ సాంగ్ ఒక్కటే కొంత ఆకట్టుకుంది. నేపధ్య సంగీతం ,కెమెరా  కూడా చెప్పుకోదగ్గ స్థాయి లో లేవు . ఆర్ట్ ఓకే. సినిమా లో ప్రధాన బలం తండ్రి కొడుకుల సంబంధం, దర్శకుడు దానిని వదిలేసి ..యాక్షన్ బాట పట్టి .. అగ్నీపత్ లాంటి హిట్ మిస్ అయ్యాడు. 

రొటీన్ రోత... 

సినిమా చూసినది : సుధా సినిమాస్ (శాలిబండ) సూపర్ థియేటర్ (118/-)

No comments:

Post a Comment

ADD